Teluguvyasalu

మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది

మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది అంటారు. ఒక వ్యక్తికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంటే, ఆ వ్యక్తి ఖర్చులు అదుపులో ఉంటాయని అంటారు. అలా ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా క్రమశిక్షణ ఉంటే, ఆ విషయంలో ఉత్తమ స్థితిని పొందవచ్చని అంటారు. కావునా క్రమశిక్షణ మంచి భవిష్యత్తుకు పునాదిగా చెబుతారు.

telugu_calc_app

విచ్చలవిడిగా ప్రవర్తించే స్వభావం రాకుండా ఉండాలంటే, విద్యార్ధి దశలోనే మంచి క్రమశిక్షణ అవసరం ఉందని అంటారు. క్రమశిక్షణ లేకుండా పెరిగిన వ్యక్తులు, భావావేశాలకు లోనైనప్పుడు, తమపై తాము నియంత్రణ కోల్పోయే అవకాశం ఉండవచ్చు. కావునా సరైన క్రమశిక్షణ లేని వ్యక్తికి స్వీయ నియంత్రణ ఉండదని అంటారు.

బాల్యం నుండే సమయపాలన పాటించడం. పెద్దలయందు మనసును అదుపులో పెట్టుకుని మాట్లాడడం. చదువులయందు శ్రద్ధ కలిగి ఉండడం. ఉత్తమ ఫలితం సాధించడానికి కృషి చేయడం… శరీరమునకు తగినంత వ్యాయామం చేయడం…. మానసికంగానూ, శారీరకంగానూ ధృఢంగా మారడంలో ఒక నియమబద్దంగా కృషి చేయడానికి తగు శిక్షణ బాల్యం నుండే ఉంటుంది.

మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది పడాలంటే మార్గదర్శకులు

సుశిక్షితులైన విద్యార్ధుల మనసు మంచి విషయాలపై అవగాహన ఏర్పరచుకుంటూ, ఉత్తమ సాధనను చేయడానికి సమాయత్తమవుతుందని అంటారు. అలా ఉత్తమ సాధనను చేసుకుంటూ, మంచి భవిష్యత్తు కోసం కలలు కని, వాటిని నెరవేర్చుకోవడానికి మార్గాన్వేషణ చేయడం వలన తమ జీవితం తమ నియంత్రణలో ఉంచుకోగలిగే మనోశక్తి ఏర్పరచుకోగలదని అంటారు.

ఇష్టారీతిన ప్రవర్తించేవారు, ఏదైనా లక్ష్య సాధనలో అడ్డంకులను జయించడం కష్టమని అంటారు. కారణం క్రమశిక్షణ లేని శిక్షణలో మనసు పలు విధాలుగా సంకోచించే అవకాశం ఉండవచ్చును. కావునా క్రమశిక్షణ ఉత్తమ భవిష్యత్తుకు కీలకమని అంటారు.

అతి అన్నింటిలోనూ అనర్ధం అంటారు. అలాంటి అతి దరిచేరకూడదంటే, క్రమశిక్షణ వలన సాధ్యపడుతుందని అంటారు.

క్రమశిక్షణ వలన ప్రయోజనాలు

సమయానికి పనులు చేసే స్వభావం వృద్ది చెందుతుంది.

పద్దతి ప్రకారం పనులు చేయడం అలవాటు అవుతుంది.

అభ్యాసం చేసే వయస్సులో విద్య త్వరగా అబ్బుతుంది.

చెడు అలవాట్లు దరి చేరకుండా ఉండగలిగే నియంత్రణ ఏర్పడుతుంది.

ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువ.

గౌరవ భావన పెరుగుతుంది.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే అవకాశం ఎక్కువ.

పనితీరు మెరుగ్గా ఉంటుంది.

లక్ష్య సాధనకు క్రమశిక్షణతో కూడిన సాధన చాలా ఉపయోగం.

నాయకత్వం లక్షణాలు అభివృద్ది అవుతాయి.

జీవితంలో అభివృద్దికి క్రమశిక్షణ సాయపడగలదని అంటారు. లక్ష్యసాధనకు క్రమశిక్షణతో కూడిన సాధన అవసరం అంటారు.

తెలుగువ్యాసాలు

Telugureads