Teluguvyasalu

విద్యార్థులు దేశభక్తి వ్యాసం

తెలుగులో విద్యార్థులు దేశభక్తి వ్యాసం! ప్రతి భారతీయ విద్యార్ధిలో దేశభక్తి ఉంటుంది. అనేక విషయాల సంగ్రహణలో పడి, వివిధ వ్యామోహాల వలన దేశభక్తి మరుగునపడకుండా ఉంటే, అది దేశానికి ప్రయోజనం అంటారు.

telugu_calc_app

కుటుంబంపై ఎప్పుడూ మంచి అభిప్రాయం ఉన్నవారి, కుటుంబ గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తిస్తారు. కుటుంబ స్థాయిని పెంచడానికి కృషి చేస్తారు. అలాగే దేశముపై భక్తిని ఎప్పుడూ తలచేవారు కూడా దేశప్రగతికి పాటుపడడానికి ప్రయత్నం చేస్తారు.

దేశభక్తి అంటే ఏమిటి?

తనను కని, పెంచిన అమ్మనాన్నలపై ఎటువంటి ప్రేమ ఉంటుందో, అలాగే తన పూర్వీకుల నుండి తనకు ఆశ్రయం అందించిన ప్రాంతం అంటే తన దేశంపై తనకు గల ప్రేమను దేశభక్తి అంటారు. ఒక వ్యక్తికి అమ్మపై ఎలా ప్రేమ పొంగుతుందో, అలాగే దేశభక్తుడికి తన దేశంపై తనకు ప్రేమ కూడా అలాగే ఉంటుంది. కుటుంబం కన్నా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ప్రముఖులు ఎందరో స్వాతంత్ర సమరంలో కృషి చేశారు కాబట్టి మనదేశానికి దాస్యపు సంకెళ్ళు చేధించబడ్డాయి. కాబట్టి దేశభక్తి వలన దేశానికి మేలు జరుగుతుంది. అది మంచి భవిష్యత్తుకు పునాది అవుతుంది.

దేశభక్తి యొక్క ప్రాముఖ్యత

వ్యక్తికి తనదేశం పట్ట గల అమితమైన ప్రేమ దేశానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అతనిని చూసి, మరింతమంది యువకులు అనుసరిస్తారు. యువతలో దేశభక్తి పెరగడం వలన దేశానికి మేలు జరుగుతుంది. యువశక్తి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి దేశభక్తి విద్యార్ధి దశ నుండే పిల్లలలో పెంచడానికి ప్రయత్నం చేయాలి.

కుటుంబంలో తండ్రికి గల మర్యాదను బట్టి, కుటుంబానికి గల గౌరవాన్ని బట్టి, ఆ కుటుంబంలో పిల్లలు కుటుంబ గౌరవ, మర్యాదలకు లోటు రాకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే దేశభక్తి యువతలో ఉండడం చేత దేశ గౌరవ, మర్యాదలు, సంసృతి సంప్రదాయలపై ఆసక్తి కలిగి ఉంటారు. సమాజం పట్ట మర్యాదతో ప్రవర్తిస్తారు. ఎప్పుడైతే సమాజం పట్ల యువతలో మర్యాద ఉంటుందో, అక్కడ పెద్దలు గౌరవింపబడతారు. స్త్రీలు గౌరవింపబడతారు. కావునా యువతలో దేశభక్తి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది.

దేశభక్తి వలన యువతలో మంచి సామాజిక స్పృహ ఉండటమే కాకుండా, శత్రుసైన్యం దేశంపై బడినప్పుడు, శత్రుసైన్యంతో పోరాడడానికి యువతకు ముందుకు వస్తుంది. దేశంకోసం యుద్దం చేయడానికి సైతం వారు వెనుకాడరు.

దేశం కోసం యుద్దం చేయడమే కాదు, దేశార్ధికాభివృద్దికి పాటుపడే తత్వం దేశభక్తి వలన యువతలో పెరుగుతుంది. సోమరితనం లేకుండా ఉండడానికి దేశభక్తి ఎంతగానో తోడ్పడుతుందని అంటారు.

దేశభక్తి గురించి వ్యాసం వ్రాయడం ఎలా?

ముందుగా మన దేశమును మనము ప్రేమించాలి. దేశం గురించి సరైన అవగాహన ఉన్నప్పుడు, మన దేశం యొక్క గొప్పతనం మనకు తెలిసినప్పుడు దేశంపై గౌరవం పెరుగుతుంది. దేశంలో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనలలో నిలబడిన దేశభక్తుల జీవితాల గురించి తెలిసినప్పుడు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వెనుక ఎంతమంది జీవితాల త్యాగం ఉందో తెలుస్తుంది.

దేశభక్తుల గురించిన జీవిత చరిత్రలు, ఆయా ప్రముఖుల చలన చిత్రములు వీక్షించడం వలన నాటి పరిస్థితులు, ఆ పరిస్థితులలో మనవారి పోరాటం గురించి తెలుస్తుంది. తద్వారా దేశం గురించి మనమే గొప్పగా వ్రాయగలం.

తెలుగు వ్యాసాలు

బంధాలు బలపడడానికి ఏం చేయాలి?

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ