Teluguvyasalu

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి… ఏదో సినిమా డైలాగులాగా… ఏదయితే లేకపోతే మనిషి మనిషాలాగా ఉండలేడో? ఏమి లేకపోతే మనిషి ఎప్పుడూ ఆందోళనతో ఉంటాడో? ఏమిటి లేకపోతే మనిషి కార్యవిజయం సాధించలేడో? ఏది లేకపోతే మనిషికి విలువ ఉండదో? ఏది లేకపోతే ఆ మనిషి మాట ఎవరు వినరో? ఇలా ప్రశ్నలు పుడుతునే ఉంటాయి… ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషికి మనుగడ కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది.

telugu_calc_app

మనిషికి ప్రధానమైన ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి.

ప్రతి మనిషికి తప్పనిసరిగా ఉండవలసినదేమిటి? అంటే అదే ఆత్మ విశ్వాసం. అంటే తనపై తనకు సంపూర్ణ విశ్వాసం. ఎవరికైతే ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుందో? వారికే విజయాలు ఎక్కువగా దక్కుతాయి. తన మీద తనకు ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. నేను తలపెట్టిన పనిని నిస్సందేహంగా పూర్తి చేస్తాననే సంకల్పం ఉండాలి.

ఒక వ్యక్తి మాట మరొకరు వినాలంటే, వ్యక్తి చెబుతున్న విషయంలో అతను విజయవంతం అయి ఉండాలి. అప్పుడే ఆ విషయంలో ఇతరులు అతని సలహాను స్వీకరిస్తారు. అంతేకానీ పనిలో విజయం సాధించకుండా, ఆ పనిని గురించి మరొకరికి ప్రవచనాలు చెబతే, ఆ మాటలను ఎవరూ పట్టించుకోరు.

సమాజంలో పలుకుబడి పెరగాలంటే, ఆర్ధిక స్థితి బాగుండాలి. ఆర్ధిక స్థితి బాగుండాలంటే, తన కష్టంతో తాను సంపాదించిన ధనంతో వస్తు, వాహన, గృహమును సముపార్జించుకోవాలి. అప్పుడే సమాజంలో ఒక వ్యక్తి విలువ ఉంటుంది. ఇవ్వన్నీ జీవితంలో ఒక వ్యక్తి సాధించడానికి ముందుగా ఉండవలసినది ఆత్మ విశ్వాసం. అంటే తనపై తనకు పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి.

విద్యార్ధి అయినా, ఉద్యోగి అయినా ఆత్మ విశ్వాసం ప్రధానం

ఒక ఉద్యోగికి సంపూర్ణమైన ఆత్మ విశ్వాసం ఉంటే, ఆ ఉద్యోగి వలన, ఆ వ్యవస్థకు ప్రయోజనం ఎక్కువ. అలా కాకుండా ఉద్యోగికి ఆత్మ విశ్వాసం లేకపోతే, అతనికి, అతను పనిచేస్తున్న వ్యవస్థకు కూడా నష్టమే. కావునా ఒక ఉద్యోగికి ముందు ఉండవలసినది ఆత్మ విశ్వాసం.

విద్యార్ధికి చదువుకునే సమయంలో ఆత్మ విశ్వాసం బలపడుతుంటే, అతను చదువులో బాగా రాణించగలడు. ఆ విధంగా బాల బాలికలను తయారు చేయవసిన బాధ్యత తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులది.

సమాజంలో ఎవరికైనా తమపై తమకు పూర్తి నమ్మకం ఉండాలి. వ్యక్తికి తన శక్తిపై తమకున్న అవగాహనను బట్టి వ్యక్తికి ఆత్మ విశ్వాసం ఉంటుందని అంటారు.

అతి విశ్వాసం – ఆత్మ విశ్వాసం కాదు.

తమను తాము ఎక్కువ అంచనా వేసుకోవడం అతి విశ్వాసం అవుతుంది. దీని వలన నష్టమే ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ఫలితం సాధించడంలో అతి విశ్వాసం పనికిరాదు. ఇది ఆత్మ విశ్వాసము కాదు.

తమ శక్తి సామర్ధ్యములపై తమకు సరైన అవగాహన ఉన్నప్పుడే వ్యక్తి ఆత్మ విశ్వాసంతో ఉండగలడు.

ఆత్మ విశ్వాసం లేకపోతే తనను తాను ఎక్కువ అంచనా వేసుకోవచ్చును లేక ఇతరులను తక్కువ అంచనా వేయవచ్చును. కావునా తమను తాము ఎక్కువగా ఊహించుకోకుండా, తమకు తెలిసిన విద్యలో పరిపూర్ణమై పరిజ్ఙానంతో ఉండడం వలన ఆత్మ విశ్వాసం వృద్ది చేసుకోవచ్చని అంటారు.

మనోబలం తక్కువగా ఉన్నవారికి ఆత్మ విశ్వాసం లోపించే అవకాశం ఉంటుంది. భయపడుతూ ఉండేవారికి కూడా ఆత్మ విశ్వాసం లోపిస్తుందని అంటారు. విషయాలయందు సరైన అవగాహన, తమపై తమకు పూర్తి అవగాహన ఉండడం చేత భాయందోళనలను దూరం చేసుకోవచ్చని అంటారు.

తెలుగు వ్యాసాలు

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ