Teluguvyasalu

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం. స్వీయ రచన అంటే స్వయంగా వ్రాయుట అంటారు. సొంతంగా ఎలా రచన చేయాలి?

telugu_calc_app

స్వీయ రచన చేయడానికి రచన గురించి తెలుసుకోవాలి. ఏమిటి రచించాలో అవగాహన ఉండాలి? వ్రాసేది వ్యాసం అయితే వ్యాసములు చదివి ఉండడం వలన వ్యాసాలు ఎలా ఉంటాయో? వ్యాసం యొక్క క్రమం గురించి ఆలోచన మనసులో ఉంటుంది. అదే పుస్తక రచన చేయాలంటే, అందుకు తగిన విషయ వివరణ గురించి పూర్తి అవగాహన ఉండాలి.

స్వీయ రచన ఎలా చేయాలి?

కధ వ్రాయాలని తలిస్తే, కధ ఎలా ఉండాలి? కధలో చెప్పబోయే అంశం ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాము? కధ ఏ వర్గమునకు చెందినది? వ్రాయబోయే కధ… నీతి కధా? హాస్యపు కధా? శృంగారపు కధ? కుటుంబ కధా? సామాజిక కధా? ఇలా వివిధ వర్గములలో కధలు ఉంటాయి. ఆ వర్గమును ఎంచుకోవాలి. కధ నిడివి ఎంత? ఎన్ని పదాలతో కధను వ్రాయదలిచాము? కధలు చదవడం వలన కధలు ఎంత నిడివి ఉంటాయి? కధలలో రచయిత దృష్టికోణం ఎలా ఉంటుంది? కధకు ఎలాంటి అంశము ఎంచుకోవాలి? ఒక ప్రాధమిక అవగాహన ఏర్పడుతుంది.

కధలు వ్రాయడానికి కధలు చదవడం వలన ప్రాధమికంగానే అవగాహన ఉంటుంది. మిగిలిన విషయాలలో పెద్దల సలహాలు తీసుకోవాలి. ఇంకా కధా రచన నియమాలను తెలుసుకోవాలి. కధలు చదివి, చదివి కొత్త కధను తయారు చేయవచ్చును. కానీ అందుకు స్వయంగా ఆలోచన చేయగలగాలి.

అదే విధంగా ఒక వ్యాసం వ్రాయాలి అంటే? వ్యాసంలో చెప్పబోవు అంశం గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి. వ్యాసం యొక్క ఉద్దేశ్యం ఏమిటో వ్యాసం యొక్క శీర్షికలోనే తెలియజేయాలి. వ్యాసం యొక్క ప్రధానోద్దేశ్యమును వ్యాసం మొదటి పేరాలో తెలియజేయాలి. వ్యాసం ఉద్దేశ్యాన్ని ప్రతిబింబించేలాగా విషయమును వివరించాలి. ముగింపులో మరలా వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ వ్యాసం ముగించాలి… తదితర వ్యాస రచన నియమాలను తెలుసుకుని వ్యాస రచన చేయవచ్చును. వ్యాసం అంటే ఏమిటి? చదవడానికి

ఒక పుస్తకం వ్రాయాలంటే, ఇంకా నియమ నిబంధనలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా రచయితకు శైలి, మాండలికం వంటి వివిధ విషయాలలో సరైన అవగాహన అవసరం అప్పుడే తన ఉద్దేశ్యమును రచన ద్వారా పాఠకులకు తెలియజేయగలడు.

చరిత్ర గురించి పుస్తకం వ్రాయాలి. అప్పుడు ఎవరి చరిత్ర? ఎక్కడి చరిత్ర? దేని గురించి ? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాల ఉండాలి. ఇంకా వ్రాయబోయే చర్రితకు ఆధారం కూడా ఉండాలి.

పద్య రచన చేయాలంటే వ్యాకరణ పూర్తిగా తెలియాలి. వ్యాస రచన చేయాలంటే, వ్యాస రచన గురించి అవగాహన ఉంటే, క్లుప్తంగా విషయాన్ని వివరిస్తూ ఉండవచ్చును. వచన రూపంలో ఉంటే గద్య రచన అంటారు.

స్వీయ రచన చేయాలంటే ముందుగా రచయిత అభిప్రాయాలు తెలుసుకోవడం

ప్రస్తుత లేక గతంలో గల రచయితలు, రచన గురించి చెబుతూ ఉంటారు. తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ ఉంటారు. కొందరు ఉపన్యాసంలో తెలియజేస్తే, కొందరు వచన రూపంలో వ్రాస్తూ ఉంటారు. లేదా ఎవరైనా ప్రముఖ రచయితల అభిప్రాయాలను తెలుసుకుని ప్రచురిస్తూ ఉంటారు. అటువంటి రచయిత అభిప్రాయాలు గమనిస్తే, రచనపై ఒక అవగాహన వస్తుంది.

కధలు వ్రాయదలిస్తే, కధలను రచించిన పలువురి అభిప్రాయాలను తెలుసుకోవడం వలన కధా రచనలో ఉండే మెలుకువలు తెలియబడతాయి.

అలాగే పుస్తక రచన చేయదలిస్తే, పుస్తక రచయితల అభిప్రాయాలను తెలుసుకోవడం వలన పుస్తక రచన చేయడానికి అవసరమైన సమాచారం లభించవచ్చును.

తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలి. సాహితీ రచయితల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ముందుగా పుస్తకపఠనం ఒక అలవాటుగా ఉండాలి.

తెలుగు వ్యాసాలు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ