Teluguvyasalu

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. అలంకారానికి ఆభరణాలు అందం. ఆకర్షణీయంగా సిద్దం కావడానికి అలంకారంలో భాగంగా ఆభరణాలు ఉపయోగపడుతాయి. అందానికి అదనపు హంగులను నగలు తీసుకువస్తాయి. సంప్రదాయంలో కూడా బంగారం, వెండి వంటి లోహములతో తయారు చేసిన నగలు ధరించాలని చెబుతారు.

telugu_calc_app

సమాజంలో స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు.

మన సభ్య సమాజంలో వివిధ సంప్రదాయలు, వివిధ ఆచారాలు పాటించేవారు ఉంటారు. ఏ సంప్రదాయమైనా, అందంగా అలంకరించుకోవడం అంటే అందరికీ ఇష్టమే. అందరూ బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు.

ఒంటిపై ధరించిన నగలు తరుగుదల వస్తూ ఉంటాయి. అంటే శరీరంపై ఉంటూ అరుగుతూ ఉంటాయి. అలా శరీరంపై బంగారం అరుగుతూ ఉండడం మేలు అంటారు. ఇక నగలు మన సమాజంలో స్త్రీలు ఎక్కువగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. బాల్యం నుండే తల్లిదండ్రులు తమ పుత్రికలకు బంగారు నగలు అలంకరిస్తూ ఉంటారు. అలా అలంకరించిన తమ పుత్రికలను చూసి మురిసిపోతారు. బాల్యం నుండే బాలికలకు అలంకారంతో అనుబంధం ఏర్పడుతుంది.

మగవారికి చిన్ననాటి నుండే అలంకారం గురించిన ఆసక్తి ఉండదు. కానీ కొన్ని వస్తువులు మాత్రం వారికి ఆసక్తి ఉంటుంది. చేతికి ఉంగరం, మెడలో గొలుసు…. తమ పుత్రుడికి కూడా చేతికి ఉంగరం, మెడలో గొలుసు వేసి, వారిని చూసుకోవడం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా నగలతో అనుబంధం చిన్ననాటి నుండి ఉంటుంది. అయితే ఆడువారికి ప్రీతి ఎక్కువగా ఉంటుందని అంటారు.

ఎవరైనా స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు.

చిన్నప్పటి నుండే అయినా, వాటిని తమ తమ ఆర్ధిక పరిస్థితి అనుసరించే తల్లిదండ్రులు పిల్లలకు నగలు అలంకరిస్తూ ఉంటారు. వారు ఎదిగిన తరువాయి కూడా తాము తమ ఆర్ధిక స్తోమత ఆధారంగానే నగలు ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే నగలు సమాజంలో తమ యొక్క ఆర్ధిక హోదాను కూడా సూచిస్తుంది. కాబట్టి ఒక్కసారి ధరించిన నగలు జీవిత పర్యంతము కూడా ఉండాలనే ఉద్దేశ్యం బలంగా ఉంటుంది.

చాలామంది అప్పులు చేసి నగలు కొనుగోలు చేయరు. తాము నగలు కొనేటప్పుడే, ఆ నగలు తమతో ఉండాలని ఆశిస్తారు కాబట్టి అప్పులు చేయడం వలన నగలను అమ్మవలసిన అవసరం వస్తుంది కాబట్టి అప్పు చేసి నగలు కొనేవారు అరుదుగా ఉంటుంది.

ఈ విధంగా ఎవరు నగలు ధరించాలని చూసినా, వారు వారి వారి ఆర్ధిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని నగలు కొనుగోలు చేస్తారు. ధరించిన నగలు నలుగురిలో ఒక గుర్తింపు తీసుకువస్తే, ఆ గుర్తింపు పోకూడదని ఆలోచన చేస్తారు.

ఈ విధంగా స్త్రీ కానీ పురుషుడు కానీ నగలు ధరించేటప్పుడే తమ యొక్క ఆర్ధిక స్తోమతను దృష్టిలో పెట్టుకుంటారు.

తెలుగు వ్యాసాలు

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ