Teluguvyasalu

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం… అంటే శాశ్వమైనది ఏమిటి? మనిషి మరణించాక కూడా ఆ మనిషి గురించి మాట్లాడించగలిగేది అతని కీర్తి అంటారు. జీవించి ఉండగా మనిషి చేసిన కృషి మరియు ఆ మనిషికి గల మంచిపేరు అతనికి సమాజంలో ఒక కీర్తి ఏర్పడుతుంది. ఆ యొక్క కీర్తి వలన అతను మరణించినను అతని జ్ఙాపకాలు సమాజంలో మిగిలి ఉంటాయి. కాబట్టి కీర్తి ముందు పదవులు, సంపదలు, శరీరాలు శాశ్వతం కాదు అంటారు.

telugu_calc_app

అయితే ‘పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు’ ఈ ఈశీర్షికతో తెలుగువ్యాసం.

సమాజం సాదారణ వ్యక్తుల జీవనంతో సాగిపోతుంటుంది. కానీ అసాదారణ వ్యక్తి సమాజంలో అరుదుగా కనబడుతుంటారు. వీరు తమ చుట్టూ ఉండే సమాజం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ చుట్టూ ఉండేవారి క్షేమంగా ఉండడం కోసం వీరు తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. స్వార్ధం కన్నా ప్రజాక్షేమమే పరమార్గంగా జీవించే అరుదైన వ్యక్తుల జీవనం సమాజానికి మార్గదర్శకంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి మరణించాకా కూడా ప్రజల మనసులలో నిలిచిపోతారు.

కానీ వ్యక్తి తన జీవితాన్ని కొనసాగించడానికి పదవులు సంపదలు శరీరం చాలా అవసరం తెలుగు వ్యాసాలు

బ్రతకడానికి శరీరం చాలా చాలా అవసరం. అసలు శరీరం లేకుండా మనిషి ఎక్కడ? మనిషి ఉనికికి ఆధారం ఏమిటి? కావునా మనిషికి శరీరం చాలా ప్రధానం. అది ఓ అద్భుతమైన వెలకట్టలేని యంత్రంగా కూడా కొందరు చెబుతారు. అయితే మరి అది శాశ్వతం కాదు అనడానికి కారణం ఏమిటి?

శరీరం శాశ్వతం కాదు అనడానికి కారణం మనిషి ప్రాణాలను నిలబెట్టగలిగే శక్తి లేదు. ఎప్పుడో ఒకప్పుడు మనిషి తన శరీరమును వదిలివేయాలి. అది ఎప్పుడు? అనేది కాలములో కలిగి కర్మే కానీ ఎవరు ఎవరి ప్రాణం ఎప్పుటిదాకా ఉంటుందో గ్యారంటీ ఇవ్వలేరు. అయితే శరీరం ఉండదు కాబట్టి నేనేం చేయనవసరం లేదు సుఖంగా గడిపేస్తాను అంటే, అద్భుతమైన శరీరంతో జీవించిన కాలం వృధా చేసినట్టేనని పెద్దలు చెబుతూ ఉంటారు.

మరి ఏమిటి అద్భుతమైన శరీరంలో ఉండే మనిషి ఏం చేస్తే? జీవిత సార్ధకత అంటారు.

తను ఒకరిపై ఆధారపడకుండా, తన కర్తవ్యం తాను చూసుకుంటూ, తనతోటివారి కోసం పాటుపడుతూ ఉంటే చాలు అంటారు. ప్రతివారికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబ అవసరాలకు ప్రతివారు శ్రమించాలి. కాబట్టి తన అవసరాలకు, తన కుటుంబసభ్యుల అవసరాల కొరకు తను శ్రమించాలి కానీ ప్రక్కవారిపై ఆధారపడడం లేదా వేరొకరి సొమ్ములను అపహరించాలని చూడడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండడమే ఓ సాదారణ వ్యక్తి జీవనం అతనితో పాటు సామాజిక శాంతికి కారణం కాగలదు అంటారు.

ఇంకా అలా తన అవసరాలకు, తన కుటుంబ సభ్యుల అవసరాల మేరకు శ్రమిస్తూ, తన ఆర్దిక స్థితిని సమన్వయపరచుకుంటూ, కష్టపడి కుటుంబ పోషణ చేసుకునే వ్యక్తులు, తాము నివసించే ప్రాంతంలో మంచి పేరును పొందగలరు. ఆ యొక్క ప్రాంతంలో అతను ఓ మార్గదర్శకుడుగా ఉండగలడు. ఇంకా అతని వచ్చిన పేరు ప్రతిష్టలు అతని కీర్తిగా ఇనుమడిస్తుంది.

అలా ఓ సాదారణ వ్యక్తి జీవితం కూడా ఆదర్శంతంగా తీర్చిదిద్దుకుని, తన కుటుంబ సభ్యులకు, తన చుట్టు ప్రక్కలవారిక మార్గదర్శకుడుగా జీవించి, కీర్తిని గడిస్తే, అతని కీర్తి, అతని మరణానంతరం కూడా ఉంటుంది. అది అతని కుటుంబ సభ్యులకు శ్రీరామరక్షగా ఉంటుంది. కష్టమే అయినా అటువంటి జీవనం మార్గదర్శకంగా మారగలదని పెద్దలు అంటారు. అలా వ్యక్తి తనకు లభించిన శరీరంలో తనకు గల కాలపరిమితిలో చక్కగా వినియోగించుకోవడం వలన అతని శరీరం అతని ప్రవర్తన కన్నా తక్కువగానే ఉంటుంది. అంటే భగవతుండిచ్చిన అద్బుతమైన శరీరం సైతం, అతని కీర్తి ముందు వెలవెలబోతుంది.

ఆర్ధికంగా కూడా పదవులు సంపదలు శరీరాలు అవసరమే కదా?

సమాజంలో ఒక వ్యక్తి పరువు అతనికుండే పదవి వలన కానీ అతనికి ఉన్న సిరిసంపదల వలన కానీ ఉంటుంది. శరీరంతో ఉండడం వ్యక్తి పూర్వజన్మ ఫలితం అయితే, అతను సాధించిన పదవులు అతని విద్యాభివృద్దికి తార్కాణం అయితే, అతను సంపాదించిన ధనం అతని కష్టానికి ఫలితం అయితే, ఇవ్వన్నీ శాశ్వతం కాదని అనడం ఏమిటి?

అవును….వ్యక్తి ఇవ్వన్ని ఉంటేనే, వ్యక్తికి సమాజంలో విలువ ఏర్పడుతుంది. ఇవి లేకుండా వ్యక్తికి గౌరవం ఉండదు. మర్యాద లభించదు. అయితే ప్రతివారు ఇవి కలిగి ఉండడమో లేక సాధించడమో చేస్తారు. అయితే వీటిని ఎలా సాధించాము? ఇదే పెద్ద ప్రశ్న. ఒక వ్యక్తి అసాదారణ తప్పులు చేసి, ఇవ్వన్నీ సాధించినా వాటికి విలువ, అవి ఆ వ్యక్తి చుట్టూ ఉన్నంత కాలమే. ఆ వ్యక్తి మరణించాకా అతని ఆస్తిపాస్తులు పంచుకోవడానికి మినహా, అతని గురించి మాట్లాడుకునేవారు మిగలరని అంటారు. అయితే అవ్వన్నీను ధర్మబద్దంగా తన కష్టంతో సాధించుకుని ఉంటే మాత్రం వాటికి విలువ ఉంటుందని అంటారు.

పదవి ఉండడం ఒక ఎత్తయితే, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా పని చేయడం ప్రధానం. తెలుగు వ్యాసాలు

ఒక వ్యక్తి ఒక ఉన్నత ప్రభుత్వ పదవి లభించింది. అతనికి ఉన్నత పదవి లభించిందంటే, అది అతని ప్రతిభ కారణంగా వచ్చి ఉంటుంది. అలా కాకుండా అతను లంచం ఇచ్చి అడ్డదారులలో ఉద్యోగం సాధించి ఉంటే, అది తెలిసిన చోట, అతనికి ఉద్యోగం చేసే చోటే విలువ ఉండకపోవచ్చును. కానీ అతను కష్టపడి తన ప్రతిభతో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఆ పదవికి గౌరవం మరింత పెరిగే విధంగా పనిని చేయగలగడం అంతకన్నా గొప్ప అంటారు.

పదవిలోకి వచ్చిన వ్యక్తి వృత్తిపరమైన విలువలు పాటించకుండా, వ్యవస్థ భవిష్యత్తుని పట్టించుకోకుండా కేవలం తన స్వార్ధ ప్రయోజనాలకు తన పదవి, అధికారం ఉపయోగించుకుంటే, దాని ద్వారా అతని అపకీర్తిని మూటగట్టుకుంటాడు. అతని సంపద, పదవి, అధికారం, హోదా అన్నియు కేవలం అతను పదవిలో కొనసాగినంతవరకే అతనికి ఉపయోగపడతాయి. అది అక్కడివరకే పరిమితం.

కానీ ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, తన పదవికి న్యాయం చేస్తూ పని చేయడం వలన ముందుగా అతను అతని మనస్సాక్షి ముందు హోదాలో ఉంటాడు. అలాగే అతను పనిచేస్తున్న ఆఫీసులోనూ గౌరవంగా ఉంటాడు. ఇక తన కర్తవ్య నిర్వహణలో సామాజిక శ్రేయస్సు ప్రధానం అతను కష్టపడితే, తన అధికార పరిధి ఎంతమేరకు ఉందో, ఆ పరిధిలో అతని మంచి కీర్తిని పొందగలుగుతాడు. అలా అతను తన పదవికే వన్నె తెచ్చినవారవుతారు.

పదవీ అధికారం సామాజిక శ్రేయస్సు కొరకు, సంపదలు లేనివారికి సాయపడడం కోసం ఖర్చు చేసే వ్యక్తి శరీరం

పదవి, సంపద రెండూ ఉన్న వ్యక్తి. తన పదవీ అధికారం సామాజిక శ్రేయస్సు కొరకు ఉపయోగించడం వలన అతను సమాజాన్ని రక్షించినవారవుతారు. అతను, అతని కుటుంబ సభ్యుల జీవనం సుఖంగా ఉండడం కన్నా ఎక్కువ ధనం పేదలకు ఖర్చు చేసేవారి జీవనం కీర్తివంతం అవుతుంది. అలాంటి మహానుభావులు అరుదుగా ఉంటారని అంటారు. అలాంటివారు మార్గదర్శకులుగా మారతారని అంటారు.

ఒక వ్యక్తికి పదవులు సంపదలు చాలా ప్రధానం. ఇంకా అతనికి శరీరం ఉంటేనే ఇవ్వన్నీ. కానీ అతను వీటిని సమర్దవంతంగా సామాజిక శాంతి కొరకు, కుటుంబ శాంతి కొరకు ఉపయోగిస్తూ, ఉండడం వలన ఇవ్వన్నీ శాశ్వతం కాదు అతని జీవన మార్గం మార్గదర్శకమని సామాజం చరిత్రగా లిఖించుకుంటుందని అంటారు.

వ్యక్తి తన జీవితాన్ని కీర్తివంతంగా తీర్చిదిద్దుకోవడం కోసం, మరొకరికి అపకారం చేయకుండా జీవించగలడం వలన తను మరొకరికి మార్గదర్శకం కాగలడని అంటారు.

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు, తాను జీవించిన కాలంలో తాను చేసిన మంచి పనులు వలన ఫలితం పొందినవారు ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే తాను చేసిన పనుల వలన బాధించబడినవారు కూడా తమ స్థితికి కారణం అయినవారిని మరిచిపోలేరు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏ విధంగా ప్రవర్తించి, తన చుట్టూ ఉన్నవారి మద్య కీర్తిని పెంచుకుంటారో, ఆ కీర్తి అతను లేనప్పుడు కూడా అతని చుట్టూ ఉండే సమాజంలో ప్రకాశిస్తుంది. అదే అతని కుటుంబ సభ్యులకు కూడా మంచి గుర్తింపుని తెస్తుందని అంటారు.

ధన్యవాదాలు

తెలుగు వ్యాసాలు బ్లాగులో మరి కొన్ని తెలుగు వ్యాసాలు

10TH క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

ఈ సైటు గురించి

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

తెలుగురీడ్స్

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.