Teluguvyasalu

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది? ఈ శీర్శికతో తెలుగు వ్యాసాలులో ఒక తెలుగు వ్యాసం.

telugu_calc_app

ఒకప్పుడు ఏదైనా వార్త దూర ప్రాంతంలో ఉండేవారికి చేరాలంటే, రోజలతరబడి సమయం పట్టేది… నేటి సోషల్ మీడియా వలన క్షణాలలో వార్త ప్రపంచం మొత్తం పాకుతుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి కుదించేసింది.. అరచేతిలోనే ప్రపంచంలో ఏమూలా ఏం జరిగినా తెలుసుకోవచ్చును.

తెలుగులో సామాజిక మాధ్యమం అదే ఇంగ్లీషులో సోషల్ మీడియా గా అభివర్ణిస్తారు. నేటి సోషల్ మీడియా చాలా వేగం కలిగి ఉంది. ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే వెబ్ సైట్స్ మొబైల్ యాప్స్ కీలకమైనవి. వాటిలో యాక్టివ్ యూజర్లు ప్రముఖంగా న్యూస్ వ్యాప్తి చెందడంలో కీలక పాత్రను కలిగి ఉంటారు.

సమాజంలో ఒకప్పుడు రచ్చబండలు వంటివి చర్చావేదికగా ఉండేవి… ఇప్పుడు అవి టివిలు ద్వారా ఇళ్ళళ్లోకి మొబైల్ ఫోన్స్ ద్వారా అందరిలోకి ఒక చర్చా వేదికను సోషల్ మీడియా సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో జరిగే విశేషాలకు టివిలలో కూడా ప్రచారం లభించడం విశేషం.

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది? తెలుగు వ్యాసం.

అలాంటి సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర యువతదే ఉంటుంది.

సమాజంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాపై ఆధారపడడం అలవాటుగా కూడా మారింది. సోషల్ మీడియా వెబ్ సైట్ లేక యాప్ రోజుకొక్కసారి అయినా విజిట్ చేస్తూ ఉంటారు.

ఈ సోషల్ మీడియా ప్రభావం యువతతో బాటు ఇంకా మిగిలిన వారిపై కూడా ప్రభావం చూపుతుంది. కారణం మొబైల్ ఫోన్ వాడుక ఎక్కువగా పెరగడం. అన్ని వయస్సులవారు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. తద్వారా చాలావరకు సోషల్ మీడియా ప్రభావం అందరిపై కనబడే అవకాశం కూడా ఉంది.

ఏదైనా సంఘటన లేక విశేషమైన ప్రకటన లేక పాపులర్ పర్సనాలిటీస్ పర్సనల్ యాక్టివిటీస్ వెంటనే సోషల్ మీడియా ద్వారా సమాజంలో వ్యాపిస్తున్నాయి.

సాదారణంగా టివి అయితే అన్ని వేళలా అందరూ వీక్షించడం కష్టం కానీ సోషల్ మీడియా అలా కాదు… అందరిచేతులలో ఉండే ఒక స్మార్ట్ ఫోను ఆధారంగా సమాజం మొత్త ఆక్రమించుకుని ఉంది.

దీని ద్వారా విషయం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంచి విషయం అయినా, చెడు విషయం అయినా వ్యాప్తి చెందడం నేటి టెక్ యుగంలో నిమిషాల మీద పని. ఇంకా యువత ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు… తద్వారా సోషల్ మీడియా ద్వారా విషయాలు యువత మైండులోకి జొప్పించబడతాయి. అవి ఎలాంటివి అయినా ఆసక్తిగా ఉంటే, వెంటనే వచ్చి యువత మైండులోకి తిష్ట వేసే అవకాశం సోషల్ మీడియా వలన జరుగుతుంటాయి.

సామాజిక మాధ్యమాల ప్రభావం అంటే ఆంగ్లంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువగా యువతపైనే పడుతుంది.

యువతపై ప్రభావం చూపుతున్న నేటి సోషల్ మీడియా ప్రభావం

ఇలా సోషల్ మీడియా ద్వారా విషయాల వ్యాప్తికి కూడా యువతే కారణం అయ్యే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే అంతగా టెక్ నాలెడ్జ్ లేకపోయినా సోషల్ మీడియా చూడడం వరకు ఎవరైనా చేయవచ్చును… కానీ సోషల్ మీడియా ద్వారా విషయాలను ప్రధాన్యతను కల్పించడం. వాటిని ప్రచారం చేయడంలో నైపుణ్యతను చూపించడం సోషల్ మీడియాలో యువతకే సాధ్యం అవుతుంది.

ముఖ్యం ఎప్పటికప్పుడు మారే టెక్నాలజీని అర్ధం చేసుకోవడంలో యువత ముందుంటారు. అలా సమాజంలో యువతపై విశేషంగా ప్రభావం చూపగలిగే సోషల్ మీడియా, అది పెరగడానికి కూడా యువతే కారణం కావడం విశేషం.

ఆవిధంగా సోషల్ మీడియా యువత ద్వారా సమాజంలో పెరిగి, యువతనే లక్ష్యంగా సాగుతూ ఉంటుంది.

పుకార్లు వేగంగా వ్యాప్తి చెందడానికి కూడా సోషల్ మీడియా వేదిక అవుతుంది

స్మార్ట్ ఫోను మొబైల్ ద్వారా ఉపయోగించే ఈ సోషల్ మీడియా వలన ప్రధాన ప్రయోజనం… వేగంగా వేలమందికి, లక్షలమందికి విషయం చేరుతూ ఉంటుంది. అలాగే ప్రధాన సమస్య పుకార్లు పుట్టడం.

పుకార్లు షికారు చేయడానికి సోషల్ మీడియా వేదికగా మారుతుంటుంది. ఇంకా చాలా వేగంగా పుకార్లు సమాజంలో వ్యాపింపజేయడానికి సోషల్ మీడియా వేదిక అవుతుంది.

యువతకు సోషల్ మీడియా స్టేటస్ ప్రధాన అలవాటుగా మారింది

యువత ప్రధానంగా మేల్కొన్నప్పుడు చేసే మొదటి పని ఏమిటి? అంటే తల్లిదండ్రులు విచారిస్తూ చెప్పే విషయం వారు ఫోనుతోనే వారికి తెల్లవారుతుందని.

అంటే యువత నిద్రకు ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిద్రనుండి మేల్కోవడం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ కావడం కోసం అన్నట్టు కొందరి ప్రవర్తన ఉంటుంది. ఈ విధంగా సోషల్ మీడియా యువతపై పెద్ద ప్రభావం చూపుతుందని అంటారు.

ఈ సోషల్ మీడియా వలన ఏర్పడిన మరొక అంశం… అతి స్వేచ్చ… అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. కానీ నేడు అతిగా ఉండడమే సాదారణంగా పరిగణించబడుతుంది. ఫోనులో చూసే వ్యక్తి ఏంచూస్తున్నాడో.. చూసేవారికే తెలియాలి.

ఒకప్పుడు ఎదుగుతున్న పిల్లల మనసులోకి చెడు విషయాలు చేరకుండా తల్లిదండ్రులు, ఆ కుటుంబ శ్రేయోభిలాషులు ప్రయత్నించేవారు… ఇప్పుడు చెడు విషయాలు చేతికి చేరువగా ఉంటున్నాయి… ఒక్క టచ్ ద్వారా ప్రపంచంలోని మంచి చెడులను ఇట్టే వీక్షించవచ్చును. అటువంటి సౌలభ్యం సోషల్ మీడియా ద్వారా నేటి యువతకు అందుబాటులో ఉంది.

అందులో వారు మనసును పాడు చేసే విషయాలను ఫాలో అవుతున్నారా? మనసుకు మేలు చేసే విషయాలను అనుసరిస్తున్నారా? అది మొబైల్ ఫోనులో సోషల్ మీడియా ఖాతను పరిశీలిస్తేనే అవగతమవుతుంది.

నేటి రోజులలో వేగం చాలా కీలకమైనది కాబట్టి వేగంగా నేర్చుకోవడానికి, వేగంగా తెలుసుకోవడానికి సోషల్ మీడియా చాలా ఉపయోగం కానీ వ్యక్తి దారి తప్పితే, వేగంగా చెడుదారిలో ప్రయాణించే అవకాశం కూడా సోషల్ మీడియా వలన కలగవచ్చు.

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై చాలా రకాలు ప్రభావితం చేస్తూ ఉంది. నేటికాలంలో సోషల్ మీడియా చాలా అవసరం అయితే కొన్నిసార్లు సోషల్ మీడియా వాడకం కూడా నియంత్రించబడాలి అంటారు. ఎవరికి వారే వారి సోషల్ మీడియా స్టేటస్ చెక్ చేసుకుంటూ, దానిపై నియంత్రణ కలిగి ఉండడం శ్రేయస్కరం అంటారు.

తెలుగు వ్యాసాలు పోస్టులు

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ