Teluguvyasalu

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన ఎందుకు చేసుకోవాలి. నేడు సమాజాన్ని నడిపించేది, సామాజిక భవిష్యత్తును శాసించేది… రాజకీయం. సమాజంలో రాజకీయం వలననే అధికారం ఉంటుంది. ఈ రాజకీయాలు పాతతరం వారితో బాటు కొత్తతరం వారు కూడా ఉండడం చేత, సామాజిక భవిష్యత్తుకు చక్కటి మార్గం ఉంటుంది. కొత్తతరం వారు లేకుండా కేవలం పాతతరం వారితోనే రాజకీయాలు సాగితే, సామాజిక భవిష్యత్తు మారుతున్న కాలాన్ని అనుసరించలేకపోవచ్చును. మారుతున్న కాలాన్ని బట్టి నిర్ణయాధికారం లేకపోతే, సామాజిక భవిష్యత్తు ఎలా ఉంటుందో ? తెలియదు.

telugu_calc_app

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన

కొత్తతరం అంటే నేటి కళాశాల విద్యార్ధులే, రేపటి సామాజిక నేతలు కావచ్చును. కాబట్టి కళాశాల రోజుల నుండే విద్యార్ధులకు రాజకీయా గురించిన అవగాహన ఉండడం మేలు అంటారు.

సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న తరుణంలో పారిశ్రామికపరమైన విధానాలు, వ్యవస్థ యొక్క విధానాలు.. చాలా రకాల విధానాలు సాంకేతికతతో ముడిపడి ఉంటున్నాయి. సాంకేతికతను ఆధారంగా చూసినా కూడా, కొత్తతరం రాజకీయ నేతల వలన సాంకేతికతపై రాజకీయాలలో మరింత అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది.

సమాజాన్ని శాసించే రాజకీయాల గురించి విధ్యార్దులకు సరైన అవగాహన ఉండడం చేత వారు గొప్ప నేతలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. విద్యార్ధులకు రాజకీయ అవగాహన లేకుండా ఉండడం చేత, అర్హత లేనివారు కూడా రాజకీయ నేతలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్వార్ధపరులు, అవినీతిపరులకు అవకాశం ఉండకూడదంటే, విద్యార్ధులకు రాజకీయ అవగాహన ఉండాలి. వారు సమాజంలో నేతలుగా మారినప్పుడు తాము చూసిన సమాజాన్ని మార్చగలిగే రాజకీయనేతలుగా మారగలరు.

తెలుగు వ్యాసాలు

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ