Teluguvyasalu

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఏది ఏమిటో? ఏది ఎందుకో? దేని గుణమేమిటో? అవగాహన లేకపోవడం వలన పిల్లలు పనులు అజ్ఙానంతో చేసే పనులుగా ఉంటాయి. తెలియక చేసే వారి చేష్టల వలన వారికి అపాయం కూడా ఏర్పడవచ్చును. కావునా పిల్లలను తల్లి ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ…. లేకపోతే ఏడుస్తూ… నిద్రిస్తూ… లేకపోతే ఆడడం… అవగాహన తక్కువ చేష్టలు ఎక్కువ…. నిద్ర ఎక్కువ.. ఇలా బాల్యంలో చిన్న పిల్లల చేష్టలుంటాయి.

telugu_calc_app

అమాయకత్వంతో ఉండే చిన్న పిల్లల చేష్టల ముఖ్యంగా ఎదుటివారిని అనుకరించే అవకాశం ఉంటుంది. అలా అనుకరించడంలో వారికి ఆ చేష్టలపై ఎటువంటి అవగాహన ఉండదు… కానీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు చూసినది చూసినట్టుగా చేసే అవకాశం కూడా ఉంటుంది. కావునా చిన్న పిల్లల ముందు పెద్దలు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే హుందా ప్రవర్తన వారికి అలవాటు అవుతుందనే సదుద్దేశ్యం పెద్దలలో ఉంటుంది.

చిన్న పిల్లల చేష్టల గురించి

కొందరు పిల్లలు బాల్యం నుండే మొండివారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతిదానికి పేచి పెట్టడం. కావాలనిపించినది దానికోసం మరితంగా మారాం చేస్తూ ఉంటారు. ఏదైనా కావాలనే మొండితనం లేక పేచీ పెట్టి సాధించుకోవడం చిన్న వయస్సులోనే ప్రారంభం అవుతూ ఉంటుంది.

చిన్న పిల్లల చేష్టలు అసంకల్పితంగా జరిగినట్టుగా ఉంటాయి. తల్లి సంరక్షణలో పిల్లలు అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటారు. చిన్న పిల్లల చేష్టల అల్లరిగా అనిపిస్తాయి. ముద్దుగా అనిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి ప్రమాదావశాత్తు ఇబ్బందులకు కూడా ఏర్పడతాయి. ఏమి తెలియనివారికి అన్నింటిని పట్టుకుని ఆడుకోవడమే తెలుసు. కాబట్టి ప్రతి వస్తువుని ఒక ఆట వస్తువుగా బావిస్తారు. ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఇంకా చిన్న పిల్లల చేష్టలలో ఏ వస్తువునైనా నోటిలో పెట్టుకుని చీకడం వంటివి చేస్తారు. ప్రతి వస్తువును వారు అదే పని చేస్తారు. వేడి వస్తువైనా, చల్లగా ఉన్న వస్తువైనా ఏదైనా వారు పట్టుకుని నోటిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలకు అమ్మ దగ్గర వస్తు వివేకం ఏర్పడుతుంది.

తెలుగు వ్యాసాలు

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ