Teluguvyasalu

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు. విజ్ఙానం ఒక సముద్రం వంటిది. అది కనుచూపు మేర కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి చెలియలికట్ట ఉంది కానీ విజ్ఙాన సంద్రానికి మాత్రం చెలియలికట్ట లేదు. ఎంతైనా ప్రయత్నిస్తూ… విజ్ఙానం పెంపొందించుకోవచ్చును. విషయశాస్త్రాన్ని అర్ధం చేసుకోవడానికి చేసే సాధనలో, ఆ విషయాన్ని బట్టి లోకంలో ఉండే వివిధ అంశాలపై కూడా వ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. విశ్వంలో ప్రతి వస్తువు తయారీలోనూ సైన్సు ఉంటుంది. ప్రతి మనిషిలోనూ రషాయినిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ప్రదేశంలో రషాయినిక చర్యలు జరుగుతూనే ఉంటాయి. లోకాన్ని గమనించినా, వ్యక్తి శరీరాన్ని గమనించినా, వస్తువు ఉత్పత్తి విధానం గమనించినా…. సైన్సు కనబడుతుంది.

telugu_calc_app

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

చిన్న వయస్సులో బాలుడిలో పుట్టే ప్రశ్నలో సైన్సు ఉంటుంది. వస్తు తయారీకి, వస్తు పరిశోధనకు, విషయ పరిశోధనకు సైన్సు ఆధారం. కాబట్టి నిత్య జీవితంలో వ్యక్తికి ఎదురయ్యే అనేక విషయాలతో సైన్సు మమేకం అయి ఉంటుంది. పరిశీలిస్తే వివిధ కుటుంబ సంప్రదాయాలలో ఉండే ఆచారాలు కూడా సైస్సును బట్టి ఉంటాయని అంటారు. ఇంకా వ్యక్తి ఆహార పదార్ధములపై నియమ నిబంధనలు కూడా సైన్సుని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని అంటారు.

సైన్సు మన జీవితంలో మనకు తెలియకుండానే భాగమై ఉంటుంది. ఆచారం అయినా, సంప్రదాయం అయినా, వస్తువుల అయినా… ఎలా చూసినా సైన్సు కనబడుతుంది. పరిశోధనాత్మక దృష్టి ఉన్నవారికి నిత్య జీవితం కూడా ఒక పరిశోధనాలయం గా కనబడుతుంది.

వంట చేస్తున్నప్పుడు గమనిస్తే… సైన్సు కనబడుతుంది. సైన్సు ఉపయోగాలు ఏమిటో తెలుస్తాయి.

వ్యక్తి శరీరం, వ్యక్తి జీర్ణాశయం, అందులో జరిగి జీర్ణక్రియలు గమనిస్తే, సైస్సు ఉపయోగాలు తెలుస్తాయి.

ఒక ఫ్యాన్, ఒక టివి, ఒక ఫోన్…. ఇల ఏ వస్తువు గమనించినా అందులోని వాడిన పదార్ధాలు, ఆయా పదార్ధాల లక్షణాలు గమనిస్తే… సైన్సు ఉపయోగాలు తెలియబడతాయి.

అద్దంలో ముఖం చూసుకుంటే, ఎందుకు మన ముఖం ప్రతిబింబిస్తుంది? ప్రశ్న పుడితే… అదో పరిశోధనాంశంగా మనసుని సైన్సు వైపుకు మళ్ళించవచ్చును.

ఇలా విశ్వంలో విజ్ఙానం ఒక సంద్రం వలె ఉంటుంది. దానికి హద్దు లేదు…. పరిశీలించే కొలది కొత్త ఆవిష్కరణలకు కొంగ్రొత్త ఆలోచనలు పుట్టగలవు. సాధన చేస్తే… కొత్త ఆవిష్కరణలు సాధ్యపడగలవు. ఆలోచిస్తే నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు అనేకంగా కనబడుతాయి.

తెలుగు వ్యాసాలు

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ