Teluguvyasalu

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో ఈ పోస్టు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

telugu_calc_app

మనిషికి మరచిపోవడం ఎంత సహజమో అంతకన్నా ఎక్కువ విషయాలు గుర్తులో ఉంటాయి. ఏదైనా మరిచిపోయే విషయం అతిగా ఉండడం అంటే బాగా వయస్సు అయిపోయాక జరిగేది మాత్రమే…

మరిచి పోవడం అనేది చాలా సహజం, అయితే అన్నీ విషయాలు మరిచిపోము. ఎప్పుడో ఏదో ఒక విషయం మరిచిపోతే మనకు పది విషయాలు గుర్తుకు ఉంటాయి. అంటే ఇక్కడ మరిచిపోయినది, గుర్తుకు రాకపోయేసరికి కలిగే చికాకు వలన మనసు పొందే భావన వలన మిగిలిన విషయాలు ప్రక్కకు వెళ్ళిపోతాయి.

ఇది పాఠాలు విషయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రాని ప్రశ్నలు గురించి ఆలోచించి వచ్చిన ప్రశ్నల సమాధానాలు మరిచిపోవడం జరుగుతూ ఉంటుంది.

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా అంటే, సహజంగా పాఠాలు అర్ధం చేసుకోవడం మేలైన విధానం అయితే, తగినంత సాధన చేయడం మరింత మంచి ఫలితం వస్తుంది.

పాఠాలు గుర్తులో లేకపోవడానికి కొన్ని కారణాలు

  • అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం
  • సబ్జెక్టులో ఏదో ఒక సెక్షన్ పై అనవసరపు భావన (కొందరు లెక్కలు బాగా చేస్తారు. కానీ ఆల్జీబ్రా అంటే ఆసక్తి తక్కువ. అంటే ఆసక్తి లేని విషయాలలో సాధన చేయకపోవడం)
  • ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం
  • పరీక్షా సమయంలో వేరొకరి భావన బలంగా మనసులో ఉండిపోవడం

అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం

ఒకటికి పదిసార్లు పుస్తకాలలో పాఠాలు బట్టి బట్టడం వలన కొన్నిసార్లు గుర్తుకు ఉంటాయి. కొన్నిసార్లు ఒత్తిడిలో గుర్తుకు రాకపోవచ్చు. పుస్తకంలో పాఠాలు అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం వలన అవి గుర్తుకు రాకపోవచ్చు.

అదే పుస్తకంలో పాఠాలు పాఠశాల తరగతిలో చెప్పినప్పుడు శ్రద్దగా వింటే, అసలు పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటో తెలియబడుతుంది. ప్రాధమికంగా పుస్తకంలో చాప్టర్ ప్రస్తావిస్తున్న అంశం అర్ధం అయితే, ఆ అంశంపై మైండులో ఆలోచనలు పెరుగుతాయి. తద్వారా ఆ అంశంపై అవగాహన పెరిగి, ఆ అంశంలో ప్రశ్నలకు సమాధానాలు సమయానికి తట్టే అవకాశం ఉంటుంది.

లెక్కల పుస్తకంలో ఉండే సూత్రాలు అర్ధం అయితే, లెక్కలు చేయడం చాలా తేలిక. అలాగే తెలుగు అయినా, సోషల్ అయినా, సైన్స్ అయినా చాప్టర్ లో ఉన్న అంశం గురించి సరైన అవగాహన ఉంటే, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం సులభం అవుతుంది.

కేవలం వచనంతో పాఠాలు అయినా, ఆ పాఠాలలో ప్రస్తావించే అంశం ఏ విషయానికి సంబంధించినది? తెలుసుకుని, ఆ అంశం గురించి మనకు తెలిసి ఉన్న విధానాల ద్వారా కూడా పరిజ్ణానమ్ పెంచుకోవచ్చు.

సహజంగా తరగతి గదిలో చెప్పే పాఠాలు గురించి ఆలోచన చేయడం వలన సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం సాధ్యపడుతుంది.

ఉదాహరణకు సోషల్ సబ్జెక్టులో చరిత్ర ఉంటే, చరిత్రకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. అవి చూస్తే, చరిత్ర గురించి అవగాహన మైండులోకి సులభంగా చేరుతుంది. అలాగే ఆర్ధిక బడ్జెట్ వంటి విషయాలు, స్టాటిస్టిక్స్ గురించి కేవలం పుస్తకాల ఉండే కాకుండా పత్రికలలో న్యూస్, వీడియోలు కూడా చూసి తెలుసుకోవచ్చు. ఒకే రకమైన పద్దతిలో చదువు కన్నా పలు రకాలుగా పరిజ్ణానమ్ పెంచుకోవడమే చదువుకునేతప్పుడు చేయాలి. అర్ధం కానీ పాఠాలు గురించి, తెలిసిన స్నేహితులను అడగడం వలన ఆ పాఠం గురించి గుర్తు ఉంటుంది. ఎందుకంటే స్నేహితుడితో ముచ్చట్లు మైండుకు బాగా పడుతుంది. అలాగే టీచర్లను అడగడం. టీచర్ల అంటే భక్తి, భయం ఉండడం వలన కూడా వారిని అడిగిన పాఠాలు ఎక్కువగా గుర్తులో ఉండే అవకాశాలు ఎక్కువ. ఏదైనా అర్ధం కానీ సబ్జెక్టులో వివిధ పద్దతిలో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ సబ్జెక్టులో కూడా మేలైన ఫలితాలు రాబట్టవచ్చు. సరైన సాధన, పట్టుదలతో చేస్తే, సాధించలేనిది అంటూ ఉండదని పెద్దలు అంటారు.

సబ్జెక్టులో ఏదో ఒక సెక్షన్ పై అనవసరపు భావన (కొందరు లెక్కలు బాగా చేస్తారు. కానీ ఆల్జీబ్రా అంటే ఆసక్తి తక్కువ. అంటే ఆసక్తి లేని విషయాలలో సాధన చేయకపోవడం)

చదువుకునే వయస్సులో టీచర్ల అంటే భయంతో పాటు తోటివారితో అల్లరి కూడా ఉంటుంది. అల్లరితోనో, భయంతోనో ఏదో ఒక సబ్జెక్టులో సాధన తక్కువగా ఉండవచ్చు.

ఇష్టమున్న సబ్జెక్టులో మైండ్ ముందుగానే స్పందిస్తుంది. ఇష్టం లేని సబ్జెక్టులో మైండ్ మాట్లాడదు. మైండుకు ఏదో కష్టం అనే భావన బలపడిన చోట, తప్పించుకోవాలని చూడడం దాని సహజ లక్షణం. కాబట్టి కష్టం అని అనిపించే సబ్జెక్టులో మొదటి నుండి ప్రత్యేకమైన సమయం కేటాయించి, దాని సంగతి చూడాలి.

ఏదైనా మొదటిగా ఏర్పడే భావన, చాలా కాలం ఉంటుంది. ఒక సబ్జెక్టు గురించి పాఠాలు విన్నప్పుడు, సరిగా అర్ధం చేసుకోకపోతే, ఆ సబ్జెక్టుపై మొదటి భావన కష్టమనే భావన ఏర్పడవచ్చు. అందుకే పాఠశాల తరగతులలో పాఠాలు మొదటి నుండి సరిగ్గా వినాలి. మొదటి నుండి సరిగ్గా విని ఉండక పోవడం వలన సబ్జెక్టుపై ఏర్పడే భావన, మైండుపై పరీక్షలలో చూపుతుంది. అలా పరీక్షల నుండి ఆ భావన మరింత బలపడే అవకాశం.

వీక్ సబ్జెక్ట్ ఉందంటే, ఆ సబ్జెక్టులో పాఠాలు సరిగా వినలేదు లేక సరైన సాధన చేయలేదని గుర్తించాలి. ప్రత్యేక సమయం కేటాయించి, ఆ సబ్జెక్టులో సాధన చేయాలి.

ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం

పాఠశాలలో చదువుకునే సమయంలో సబ్జెక్టులపై దృష్టి పెట్టడం మానేసి, పరీక్షల ముందు పుస్తకాలు చదివేసి, పరీక్షలలో వాటిని గుర్తుకు తెచ్చుకుని వ్రాసేయడానికి అలవాటు పడడం వలన ప్రధాన పరీక్షలలో కూడా అదే అలవాటు ఉంటుంది.

బాగా గుర్తుకు ఉండే సబ్జెక్టులు బాగా వచ్చినట్టు, గుర్తులేని సబ్జెక్టులు రానట్టు మనసు భావన పొందుతుంది. ఒక తరగతి సబ్జెక్టులలో అన్నీ బట్టీ బట్టీ చదివే అవకాశం ఉండదు. అందుకనే వచనంలో ఎక్కువ మార్కులు వచ్చే వారికి లెక్కలు, సైన్స్ సబ్జెక్టులలో మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉండవచ్చు.

తరగతి పాఠాలు సరిగా వినక, బట్టీ బట్టి చదివిన పాఠాలు ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయడం కన్నా పాఠాలు సరిగ్గా విని వాటిలో సరైన సాధన చేయడం ఉత్తమం.

పరీక్షల సమయంలో మైండును సహజంగా పని చేసే విధంగా చూసుకోవాలి కానీ ఆందోళనతో ఆలోచించకూడదు.

పరీక్షా సమయంలో వేరొకరి భావన బలంగా మనసులో ఉండిపోవడం

“ఈ సారి మార్కులు తక్కువ వచ్చాయో… నీ పని చెబుతా” ఇక పరీక్షలకు ముందు టీచర్లు కానీ ఇంట్లో పెద్దవారు కానీ మందలించడం కూడా సహజం. ఎందుకంటే భయంతోనైనా భాగా చదువుతారేమో అని వారి ఆలోచనగా ఉంటుంది. అయితే ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని బాగా చదవడానికి ప్రయత్నం చేయాలి… కానీ భయం పెంచుకోకూడదు. ప్రయత్నించక పోతే కచ్చితంగా తప్పే. ప్రయత్నిస్తూ భయం పెట్టుకోవడం అనవసరం… వారు చెప్పినట్టు మంచి మార్కుల కోసం పట్టుదలతో చదవడమే పనిగా పెట్టుకున్నప్పుడు అనవసర భయాలు, భవనాలు వృధా…. కొందరు అలాంటి భయాలే, పరీక్షల సమయానికి కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ పరీక్షల సమయానికి సరైన సాధన చేసి ఉంటే, మైండులో భయం పొందడానికి స్థానం ఉండదు. అయితే గుర్తుకు తెచ్చుకుని భయం పెట్టుకోవడం వలన అనవసర ఒత్తిడి వస్తుంది. పరీక్షల సమయంలో ఎప్పటికీ ఏ సబ్జెక్టులో పాఠాలు అవసరమో, ఆ పాఠాలు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి.

ఇలాంటివి అన్నీ ముఖ్యంగా మనసుకు సంబంధించినవే…. కాబట్టి మనసుకు తర్ఫీదు ఇస్తే, చాలు. ఇంకా పౌష్టికాహారం సర్వ సాధారణం.

ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మాత్రం అవసరానికి అసలు విషయం గుర్తుకురాదు. ఆ సమయంలో మరింత చికాకు తెచ్చుకుని, కోపం తెచ్చుకుంటే, మరింత ఒత్తిడికి లోనయ్యి గుర్తులో ఉన్న విషయం కూడా మరిచే అవకాశం ఎక్కువ.

గుర్తులో లేదు, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే ముందు మనకు ముందు చేయవలసిన పనిని ముగించేసి, అప్పుడు గుర్తుకు రావలసిన విషయం గురించి ఆలోచించాలి.

చేయవలసిన పని ముందు ఉండగా, ఆ పని యొక్క ఒత్తిడి మైండుపై కొంత ఉంటుంది. ఆ పని వదిలి గుర్తులో లేని విషయం గురించి ఆలోచన చేస్తే, చేయవలసిన పని వలన ఉండే ఒత్తిడి మైండులో మరింత పెరుగుతుంది.

అదెలాగంటే ఉదాహరణ:

మీరు ఇంట్లో డ్రాయింగ్ వేయడానికి సిద్దం అయ్యారు. ప్రాజెక్టు వర్కులో భాగం ముఖ్యమైన డ్రాయింగ్ వేయాలి. దానికి సిద్దం అయ్యారు. ఈలోపు మీ అమ్మగారు వచ్చి “ఉదయం నీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టవు?” అని అడిగారు. వెంటనే మీరు బ్లాంక్ మైండుతో ఆలోచనలోకి వెళ్లారు. ఎందుకంటే ఉదయం స్కూల్ కు వెళ్ళే హడావుడిలో డబ్బులు తీసుకోవడం గుర్తు ఉంది. కానీ ఆతర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. సడన్ గా అమ్మ డబ్బులు అనగానే తీసుకోవడం గుర్తుకు వస్తుంది. కానీ డబ్బులు ఎక్కడ పెట్టడం జరిగిందో గుర్తుకు రాదు. ఇక ఆ డబ్బులు గురించే ఆలోచన చేస్తే, ఆలోచన పెరిగి పెరిగి చికాకు కలుగుతుంది. ‘ఒక ప్రక్క డ్రాయింగ్ వేయాలి’ అనే ఆలోచన మైండులో మెదులుతూ ఉంటుంది. కానీ డబ్బులు గురించి ఆలోచన కూడా వస్తుంది. డబ్బులు గుర్తుకు రాకపోతే, అమ్మ మరొకమారు అడిగేటప్పటికి కోపం కూడా కలుగుతుంది. అలా కాకుండా అమ్మ డబ్బులు అడగగానే, ముందుగా అమ్మతో “నేను డ్రాయింగ్ అర్జెంటుగా వేయాలి, ఈ పని పూర్తయ్యాక డబ్బులు ఎక్కడ పెట్టానో వెతికి ఇస్తాను” అని చెబితే, ముందుగా మీరు డబ్బులు గురించిన ఆలోచన నుండి బయటకు వచ్చేయవచ్చు. డ్రాయింగ్ వేయడం, సంతృప్తిగా పూర్తి చేశాక, ఆలోచిస్తే డబ్బులు విషయం వెంటనే గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. శాంతితో ఉండే మనసు పనితీరు అద్భుతమని చెబుతారు.

ఇలా మీకు క్వశ్చన్ పేపరులో కూడా సడన్ గా ఆమ్మ అడిగిన ప్రశ్నలాగానే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని మొదట మరిచిపోవాలి. బాగా వచ్చిన క్వశ్చన్స్ గురించి బాగా వ్రాసేసి, ఆపై గుర్తులో లేని ప్రశ్నలు సంగతి చూడాలి.

అంటే గుర్తు లేకపోవడం అంటే మనసులో జరిగే ప్రక్రియ. ఏదో ఒక విషయంలో మరుపు సహజం. అయితే అది శాశ్వతం కాదు. మరలా అది గుర్తుకు వస్తుంది. కానీ ఒత్తిడి గురి అయితే మాత్రం చికాకు, అసహనం కలుగుతాయి.

ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకోవడం ఎలా?

ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకోవడం ఎలా? ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది?

సహజంగా పరీక్షా కాలంలో ఒత్తిడి ఉంటుంది. దీనివలన నాకు మతి మరుపు ఉందేమో అనే ఆలోచనలు కూడా పెరుగుతాయి.

ఇంకా కొందరికి పెద్దవారు భయపెడుతూ చెప్పిన మాటలు వలన అనవసరపు భయాలు పొందుతారు. బాగా చదివే వారికి కూడా ఈ భయం వలన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది.

ఒక్కసారి పరీక్షా హాలులో కూర్చుంటే, కేవలం క్వశ్చన్ పేపరులో ఉన్న క్వశ్చన్స్ గురించి మాత్రమే చూడాలి. ప్రశ్నలకు సమాధానాలు చక్కగా వ్రాయడానికి ప్రయత్నం చేయాలి, కానీ గతంలో విన్న హెచ్చరికల గురించి కాదు.

మరిచిన విషయాలు గుర్తుకు తెచ్చుకునే సమయం మనసు శాంతిగా ఉండాలి. అంటే అప్పటికి చేయవలసిన పనిని పరిపూర్ణంగా చేయాలి.

ఒక సంవత్సరంలో ఒక తరగతి విధ్యార్ధులు పరీక్షలు నిర్వహించ బడతాయి. వాటిలో ఉత్తీర్ణత శాతం, ప్రతి విధ్యార్ధికి ఒక గుర్తింపు తెచ్చిపెడుతుంది.

ఎక్కువ మార్కులు వచ్చేవారికి ప్రశంశలు, తక్కువ మార్కులు వచ్చినవారికి హెచ్చరికలు సహజంగా వస్తాయి.

చదువుకునే కాలంలోనే నేర్చుకునే వయస్సు. ఎంత నేర్కుకుంటే అంతా పనితనం అబ్బినట్టు, ఎంత చక్కగా ఏకాగ్రతతో పాఠాలు వింటే, అంతా చక్కగా పాఠాలు అర్ధం అవుతాయి. సబ్జెక్టుపై సరైన అవగాహన ఏర్పడుతుంది. మరింత సాధన చేస్తే, సమాధానాలు సారవంతంగా అర్ధవంతంగా వ్రాయగలరు.

తెలుగులో వ్యాసాలు

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పావురం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

పండుగ అంటే ఏమిటి వివరించండి?

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

ఈ సైటు గురించి