Teluguvyasalu

విద్యార్థులు మంచి మాటలు వినడం వలన

విద్యార్థులు మంచి మాటలు వినడం వలన, అవి మనసుపై ప్రభావం చూపగలవు. జీవితంలో విద్యార్ధి దశ చాలా కీలకమైనది. విద్యార్ధి దశలో బలపడుతున్న భావనలు జీవితకాలం కొనసాగుతాయి. కాబట్టి మంచి భావనల కోసం, వారు మంచి మాటలు వినడం సర్వదా శ్రేయష్కరం అంటారు. నాలుగు మంచి మాటలు వినడం లేదా నాలుగు మంచి మాటలు చదవడం చేస్తూ ఉండాలి అంటారు.

telugu_calc_app

ఏది వింటే అదే మనసుని చేరుతుంటే, వినే వయస్సులో మంచిని పెంచే ప్రయత్నం పెద్దలు చేస్తూనే ఉంటారు. అది ఇంటిలో కుటుంబ పెద్దలు కావచ్చును. పాఠశాలలో బోధకులు కావచ్చును. కాబట్టి వారి మంచి మాటలు వినడం మేలు అంటారు.

చదువుకునే వయస్సులో మంచి మాటలు విద్యార్ధుల మనసులలో బాగు నాటుకుంటాయని అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దవారు పిల్లలకు మేలు చేసే మాటలే చెబుతారు. కావున అనుభవజ్ఙులు చెప్పే మంచి మాటలు వింటూ ఉండాలి.

మంచి మాటలు వినడంలో ఆసక్తి చూపడం వలన మంచి అలవాట్లకు పునాది పడుతుంది. మంచి పనులు చేయాలనే ఆలోచనలు వస్తాయి. విద్యార్ధి యొక్క ఆసక్తి ఏ విషయాలపై ఉంటుందో, ఆ విషయాలు మంచి సంకల్పం ఏర్పడడంలో తోడ్పడతాయి. కావునా మంచి విషయాలపై ఆసక్తి పెంచుకోవడానికి మంచి మాటలపై ఆసక్తి కనబరచాలి.

విద్యార్థులు మంచి మాటలు వినడం వలన చెడు అలవాట్లకు దూరంగా ఉండగలరు

నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. రేపటి భవిష్యత్తుపై నేటి విద్యార్ధి దశలో నేర్చుకుంటున్న పాఠాలు, మరియు ఇతర అంశాలు ప్రభావం చూపుతాయని అంటారు.

చెడు చెప్పకుండానే మనసులోకి చేరుతుంది. మంచి చెప్పినా మనసుకు ఎక్కదు అంటారు. కావునా మంచిని ఎప్పుడూ వినడానికి ఆసక్తి చూపాలి. ఎందుకంటే మంచి మాటలు వినడం వలన చెడు మాటలు మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటుంది. చెడు మాటలు మాట్లాడకుండా, ఎప్పుడూ మంచి మాటలనే మాట్లాడుతుంటే మాత్రం, వారికి మిత్రులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే చెడు మాటలు ఎదుటివారి మనసులో అశాంతి ఆలోచనలను సృష్టించగలవు. మంచి మాటలు మాత్రం ఎదుటివారికి శాంతినే సూచిస్తాయి.

ఇంకా మంచి మాటలు వినడం వలన చెడు అలవాట్లకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్దల మాటలలో చెడు అలవాట్లు గల వ్యక్తి లోకంలో ఉండే విలువ గురించి చెబుతారు. చెడు అలవాట్ల వలన జీవితం ఎలా పాడవుతుందో వివరించే ప్రయత్నం పెద్దల మంచి మాటలలో ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి చెడు అలవాట్లు అంటే ఆసక్తి కనబరచకుండా మనసు ఉండగలదని అంటారు.

మనిషి మంచి అలవాట్లు మానేయడం చాలా సులభం. కానీ చెడు అలవాట్టు మానడం మహాకష్టం అంటారు. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రలేవడం గొప్ప అలవాటు…. అది మానేయడానికి ఒక్కరోజు లేటుగా లేవడం చాలా సులభం…. కానీ ప్రతి రోజూ లేటుగా నిద్రించడం చెడ్డ అలవాటు… అది మానేయడం చాలా కష్టం.

విద్యార్థులు మంచి మాటలు వినడం వలన వారికి జీవన గమ్యం ఏమిటో

వినడం వలన చెప్పేవారి మాటలలో ఆంతర్యం అర్ధం అవుతుంది. ఎలా ఉంటే… పాఠశాల తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు శ్రద్దగా వినడం వలననే, ఆ పాఠ్యాంశం బాగా అర్ధం అవుతుంది. అలాగే ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు, వారు చెప్పేది పూర్తిగా వినడం వలన, వారి ఆంతర్యం ఏమిటో తెలియబడుతుంది.

విద్యార్ధి దశలోనే వినడం అనే స్వభావం వలన పెద్దలు చెప్పే మాటలకు ఆంతర్యం తెలుస్తుంది. పెద్దల మాటల వలన సమాజంలో తీరుతెన్నులు తెలుస్తాయి. తమ ప్రయాణం ఎలా ఉంటే, అందరి చేత మన్నన పొందగలం? అనే గొప్ప ఆలోచన మనసులో పుడుతుంది. ఆ ఆలోచన ప్రకారం నడుచుకోవడానికి విద్యార్ధి దశలోనే పునాది పడడానికి మంచి మాటలు వినడం ఒక ఉపాయం అంటారు.

విన్న మాటలు, చూస్తున్న పరిస్థితులు, వింటున్న సలహాలు విద్యార్ధికి అవగాహన ఏర్పడుతుంది. చదువుతో బాటు తమ జీవన గమ్యం గురించి కూడా ఆలోచనా తీరు మనసులో వృద్ది చెందుతుంది. కాబట్టి మంచి మాటలు వినడం ఒక మంచి అలవాటుగా చెబుతారు.

ఈ రోజు మంచి మాటలు అంటే తెలుసుకున్న మంచి మాటలలో ఏది ఎంతవరకు ఆచరిస్తున్నామో… గమనించుకుంటే, అది మంచి పనికి నాంది కాగలదు.

ప్రతిరోజు ఒక మంచి మాటతో ప్రారంభిస్తే, ఏదో ఒక రోజు మంచి పనికి పూనుకుంటాము.

నాలుగు మంచి మాటలు విను, ఒక మంచి పనిని చేయడానికి సంకల్పించు. సంకల్పించిన మంచి పనిని చేయడానికి కృషి చేయి… విద్యార్ధిగా ఉన్నప్పుడు విద్యార్థులకు మంచి మాటలు చెప్పే పెద్దల మాటలను గౌరవించు… తెలుగులో నీతి సూక్తులు విను వాటిపై అవగాహన ఏర్పరచుకుని మంచి లక్ష్యం ఎంచుకో…. విద్యార్ధులు మంచి మాటలు వినడం వలన ప్రయోజనం అప్పటికప్పుడు కనబడకపోవచ్చును కానీ దీర్ఘకాలంలో జీవితంపై మంచి ప్రభావం చూపగలదు.

తెలుగువ్యాసాలు

తెలుగురీడ్స్

తెలుగుబ్లాగు

తెలుగుకధలు

ఇతర తెలుగు వ్యాసాల లింకులు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి