Teluguvyasalu

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం. తెలుగు భాష మన మాతృభాష! ఒక ప్రాంతంలో జీవించే జనుల మద్య సంభాషణకు ఉపయోగించే సహజమైన భాష, ఆ ప్రాంతపు భాషగా గుర్తింపు పొందుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరూ అదే భాషలో మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా మన రెండు రాష్ర్టాలలోనూ ప్రజలు ప్రధానంగా తెలుగులోనే మాట్లాడుకుంటారు. చిన్పప్పటి నుండి మన అమ్మ దగ్గరే నేర్చుకునే భాష మాతృభాష అయితే తెలుగు రాష్ట్రాలలో అమ్మ దగ్గర నుండి మాటలు నేర్చే భాష మన తెలుగు భాష.

telugu_calc_app

తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పాలంటే,

మన తెలుగు భాషపై పూర్వుల రచించిన పుస్తకాలు చదవాలి. పండితుల రచనలు చదివితే తెలుగు భాష గొప్పతం గురించి అవగాహన వస్తుంది. వారు చక్కగా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేవిధంగా వివరించారు. తెలుగు భాషలో ఎన్నో గొప్ప కవితలు, భక్తి గీతాలు, గొప్ప పద్యాలు, గొప్ప విషయాలు, గొప్ప పుస్తకాలు…. ఎంతో గొప్పదనం తెలుగు భాష సాహిత్యంలో ఉంది. అది తెలియడానికి తెలుగు భాషలో రచనలు, వ్యాసాలు, విశ్లేషణలు, గొప్పవారి అభిప్రాయాలు, గొప్పవారితో సంభాషించడం వంటివి చేయాలి. అప్పుడే తెలుగు భాష గొప్పతనం తెలియబడుతుంది. తెలుగు భాష గొప్పతనం అర్ధం అవుతుంది.

ఇంగ్లీషులో మాట్లాడితే, ఇంగ్లీష్ టాకింగ్ ఇంప్రూవ్ అయినట్టుగానే, అసలు తెలుగు భాషలో మాట్లాడితనే, తెలుగు భాష గొప్పతనం గురించి తెలుస్తుందని అంటారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలు అంటే తెలుగే వాడుక భాషగా ఉన్న ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో వాడుక భాష తెలుగంటే, అమ్మ దగ్గర నుండి మనకు పరిచయం అయ్యే భాష మన మాతృభాష తెలుగు భాష కాబట్టి అనేక భావనలకు తెలుగు మాటలు వలననే అవగాహన వస్తుంది.

ఏదైనా ఒక భాషలో అక్షర జ్ఙానం ఉంటే, ఆ భాష మాట్లాడే ప్రాంతంలో మన జీవనానికి భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. భాష వలన మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.

తెలుగులో మాట్లాడడం ప్రయోజనాలు

  • తెలుగు భాష వల్ల మన మనోభావం మాటలలో ఖచ్చితంగా వ్యక్తం చేయగలం.
  • తెలుగు భాషలో రచించిన పుస్తకాలు తెలుగువారే వ్రాసి ఉండడం వలన, వాటిని చదివి అర్దం చేసుకోవడానికి మనకు  తెలుగు భాష వచ్చి ఉండాలి. అప్పుడే ఆ తెలుగు పుస్తకంలోని విషయ విజ్ఙానం అవగాహన చేసుకోగలం ఉదాహరణకు: మనోవిజ్ఙానం, తాత్విక విజ్ఙానం తదితర తెలుగు పుస్తకాలు.
  • తెలుగు భాష వల్ల అధ్యయనం చేయగలం. తెలుగు భాష వల్ల వ్రాయగలుగుతాం.

అక్షరజ్ఙానం ఒక భాషలో ఉంటే, ఆ భాష వల్ల అన్ని ప్రయోజనాలు కలిగితే, మరి కొన్ని భాషలలో పట్టు ఉంటే, సమాజంలో చాలా చోట్ల సంభాషించగలం, చాలామందితో నేరుగా మాట్లాడగలం. చాలామంది వ్రాసిన పుస్తకాలు చదవగలం. వృత్తి వ్యాపారాలు నిర్వహణ చేయగలం. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరి మన మాతృభాష ప్రాముఖ్యత గొప్పతనం గురించి.

మాతృభాష కన్నా గొప్ప భాష ఉండదు.

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

మాతృభాష కన్నా గొప్ప భాష ఎక్కడా ఉండదు. చిన్నిపిల్లలుగా ఉండగా మనకు అమ్మ భాష తెలుగుతోనే అన్ని తెలుస్తూ ఉంటాయి. అమ్మే అన్నింటి తనకు తెలిసిన భాషలో మనతో మాట్లాడుతుంది. అలా అమ్మ మనతో మాట్లాడే మొదటి భాష ఏదో, అదే మనకు మాతృభాష. అమ్మకు తెలిసిన భాష, మనకు ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం ఇస్తుంది. అలా ఎదిగే వయస్సు నుండి మనసులో నాటుకునే విషయాలన్నీ అమ్మ భాషలోనే ఉంటాయి. కాబట్టి అమ్మ భాష కన్నా గొప్పగా అర్ధం అయ్యే భాష మరొకటి ఉండదు.

మన మాతృభాష తెలుగు భాషదేశంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాంతాలలో ప్రత్యేక భాషను మాట్లాడుతారు. తమిళనాడు రాష్ట్రమునకు చెందినవారు తమిళ భాషను మాట్లాడుతారు. అవసరాన్ని బట్టి ఇతర భాషలు మాట్లాడేవారు ఉంటారు. ఇలా ఏ ప్రాంతంవారికి ఆ ప్రాంతంలో మాట్లాడేభాష వారికి మాతృభాష అయితే, మనకు మాత్రం మాతృభాష తెలుగు అవుతుంది. మాతృమూర్తి అంటే ఎంత గౌరవం ఉంటుందో, అంతే గౌరవం మాతృభాషకు ఇవ్వాలని పెద్దలు అంటారు.

ఎవరి అమ్మవారికి గొప్పది అలాగే ఎవరి భాష వారికి గొప్పది… మాతృభాష మనకు ఎందుకు గొప్పది అంటే, మన సంస్కృతి, మన ఆచారం మన కుటుంబ పద్దతులు అన్నీ మనకు మాతృభాషలోనే మనకు పరిచయం అయినాయి… ఇంకా వ్యక్తి జీవన పరమార్ధిక విషయాలు కూడా మాతృభాషలో అర్ధం అయినట్టుగా మరొక భాష ద్వారా అర్ధం కావు. మన వాడుక తెలుగు భాషలోనే ఉండే అనేక తెలుగు సామెతలు జీవన పరమార్ధమును తెలియజేసే విధంగా ఉంటాయి. అటువంటి సామెతలను జీర్ణం చేసుకుంటే, జీవితం మరొక విధంగా ఉంటుందని అంటారు. అమ్మ భాష కన్నా గొప్ప భాష ఉండదన్నట్టుగా మన మాతృభాష ప్రాముఖ్యతను గుర్తెరగాలి.

తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు పుస్తకాలు

మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు. అటువంటి తెలుగు పుస్తకాలు చదివితే, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాష ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది.

తెలుగు భాష తియ్యదనంతెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలదనం… తల్లితండ్రి నేర్పినట్టి మాతృ భాషరా… తెలుగు మరిచిపోతే, వాళ్ళని నువ్వు మరిచనట్టేరా… ఈ పాట నిజమే కదా…!

తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు పుస్తకాలు
తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు పుస్తకాలు

చరిత్ర కూడా మనకు పుస్తకరూపంలోనే ఉంటుంది. అటువంటి చరిత్రలో మన ప్రాంతం గురించి, మన మాతృభాషలో అయితే చక్కగా వివరించి ఉంటుంది. తెలుగు భాషలోని పుస్తకాల వలన తెలుగువారి ఘన చరిత్ర ఏమిటో… మనకు బాగా అర్ధం అవుతుంది. తెలుగు పద్యాలు మనకు తెలుగు భాష విశిష్టతను బాగా తెలియజేస్తాయి. కొన్ని పదాలలోనే ఎంతో పరమార్ధం తెలుగు పద్యాలలో ఉంటుందని అంటారు. ఒక్కొక్క తెలుగు పద్యం అయితే, సమాజంలో ఉండే వివిధ స్వభావాలను ఎత్తి చూపుతూ ఉంటాయి. బహుశా ఇలా పద్యములలో ఎంతో అర్ధం వచ్చేలా ఉండడం, తెలుగు భాష విశిష్టతను తెలియజేస్తుంది.

ఎవరి అమ్మవారికే గొప్ప అన్నట్టుగా ఎవరి మాతృభాష వారికే గొప్ప… కానీ తెలుగు భాషకు ప్రత్యేకత ఉంటుందని అంటారు. ఎప్పుడో చరిత్రలోనే రాజుల కాలంలోనే దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పబడింది. వ్యాకరణం దీని ప్రత్యేకత… అది ఎంత ప్రత్యేకమో అంత సాధన కూడా అవసరం అంటారు… లేకపోతే తెలుగు వ్యాకరణం నేర్చుకోవడం అంత సులువు కాదని అంటారు.

మాతృభాష అయిన తెలుగు భాష గొప్పతనం గురించి మరింతగా

మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, తెలుగు సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి.

తెలుగు భాషలో గల పద్యములందు ఉండు అర్ధములు విశేషమైన విషయమును తెలియజేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పదాలతో నాలుగు లైన్లలో ఉండే ఈ పద్యాలలో ప్రతిపదార్ధము వచనంలో ఎక్కువగా ఉంటుంది. వీటి భావాలు విశేషమైన అర్ధమును తెలియజేస్తాయి.

అలాగే సామెతలు ఒక్క లైనులోనే ఉంటాయి…కానీ చాలా అర్ధవంతమైన భావమును వ్యంగ్యంగానూ, హాస్యంగానూ తెలియజేస్తాయి…

ఇంకా సూక్తులు కూడా కేవలం ఒక వ్యాక్యములోనే ఉంటాయి… కానీ భావము మాత్రము బలమైన అంతరార్ధమును కలిగి ఉంటాయి. మంచిగా ఆలోచించే శక్తి ఉండాలే కానీ ఒక సూక్తి చాలు మనసులో మార్పు రావడానికి… అంటారు.

అంటే ఇలా పద్యాలు, సూక్తులు, సామెతలు గమనిస్తే, చాలా తక్కువ పదాలతో ఎక్కువ భావమును ఇముడ్చుకోవడంలో తెలుగు భాష గొప్పదనం కనబడుతుందని అంటారు.

దైవచింతన, తత్వచింతన, సామాజిక పోకడలు ఇలా అన్నింటపైనా తెలుగు భాషలో తెలుగు పద్యాలు విశేషమైన భావాలను వ్యక్తపరుస్తాయి. ఇంకా ఇవి చాలా తక్కువ నిడివి గలిగిన వ్యాక్యాలతో ఉంటాయి… అవి కూడా మూడు వ్యాక్యాలు ఇంకా ఒక మకుట వ్యాక్యం కలిగి ఉంటాయి.

తెలుగు భాష గొప్పతనం అంతా భావప్రకటనలో, చాలా చిన్న చిన్న తేలికపాటి పదాలతో ఇమిడి ఉంటాయి. చిన్న చిన్న వ్యాక్యాలలోనే జీవిత పరమార్ధమును తెలియజేసే విధంగా ఉంటుంది.

స్వచ్ఛమైన మన తెలుగు భాష ఈనాటిది కాదు… మన మాతృభాష గొప్పతనం ఏనాడో పెద్దలు పుస్తకాల ద్వారా తెలియజేశారు…

తెలుగు భాషలో గొప్ప కవులు ఉన్నారు. గొప్ప గొప్ప ఇతిహాస, పురాణాలను అనువదించినవారు ఉన్నారు… అవి అన్ని కూడా సంస్కృత భాష నుండి తెలుగుకు తర్జుమా చేసినవే… తెలుగు భాషలో కవులకు లోటు లేదు పదాలకు లోటు లేదు…

మాతృభాష తెలుగు భాషలో పుస్తకం చదవడం

పుట్టిననాటి నుండి అలవాటు అయిన తెలుగులో ఏ పుస్తకం చదివినా అందులోని సారంశం సులువుగా మన మనసులలోకి వెళుతుందని అంటారు. మాతృభాష తెలుగు భాషలో పుస్తకం చదవడం వలన, ఆయా పుస్తకాలలో నిక్షిప్తం అయిన జ్ఙానం మనకు త్వరగా అబ్బే అవకాశం ఉంటుంది. తెలుగుభాషలో వ్రాయబడిన సాహిత్య పుస్తకాలు చదవడం విషయవిజ్ఙానం త్వరగా వృద్ది చెందే అవకాశం ఉంటుంది.

మన భాషలో మనకు మాట్లాడుతున్న నాటి నుండే పదాలకు అర్ధం తెలిసి ఉంటుంది. అమ్మమాటలతో అలవాటు అయిన తెలుగుభాష, నాన్న బందుమిత్రుల ద్వారా అనేక మాటలకు అర్ధాలు తెలిసి ఉంటాయి. ఇక తెలుగు భాషలోని తెలుగు పుస్తకాలు చదవడం మొదలైతే, మరింత సులువుగా ఆ పుస్తకములోని సారం త్వరగా అర్ధం అవుతుందని అంటారు.

ఆసక్తి ఉంటే దానిపై మరింత విజ్ఙానం పెంపొందించుకోవడానిక మాతృభాష ఎక్కువగా ఉపయోగపడుతుంది.

సంప్రదాయపు ఆసక్తి ఉంటే, ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఎటువంటి సంప్రదాయం ఉందో, అటువంటి ప్రాంతపు మాతృభాషలోనే ఎక్కువ విషయావగాహన కలిగించే విజ్ఙానం పుస్తకం రూపంలో నిక్షిప్తం అయి ఉంటుంది. అటువంటి ఆసక్తికి మాతృభాషలో ఉండే పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. మన తెలుగులో మనకు అటువంటి విజ్ఙానపు పుస్తకాలు ఆన్ లైన్లో ఫ్రీగా లభిస్తాయి.

టెక్నాలజీ, సైన్సు, మాథ్స్ తదితర సబ్జెక్టులు ఇంగ్లీషులో ఎక్కువగా ఉంటాయి. కానీ వాటి గురించి మన మాతృభాషలో వివరణ విన్నప్పుడే మనకు త్వరగా అవి అర్ధం అవుతాయి. అయితే ఇంగ్లీషులో మాతృభాషతో సమానంగా పట్టు ఉన్నవారి ఏభాషలో విద్య ఉన్నా ఒక్కటే అవుతుంది. కానీ మనోవిజ్ఙానం మాత్రం మాతృభాషతోనే సులభం అంటారు. ఎందుకంటే మనోవిజ్ఙానం మనసుకు సంబంధించినది. అందులోనూ అది పెరిగిన వాతావరణం ఆధారంగానే అన్ని విషయాలతోనూ మమేకం అయి ఉంటుంది.

ఏదైనా ఒక ఆసక్తిలో మరింత విజ్ఙానం సంపాదించుకుని, పండితుడు కావడానికి తెలుగువారికి మన మాతృభాష అయిన తెలుగుభాష బాగా ఉపయోగపడుతుందని అంటారు. ఏదైనా జీవితపు పరమార్ధం తెలియజేసే రచయిత తెలుగు పుస్తకాలు కూడా మనకు త్వరగా అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది. 

జీవితం యొక్క అంతిమ లక్ష్యం అంటే పరమార్ధిక విషయాలు అవి పురాణాలలో ఉంటాయి. అవి మన మాతృభాషలో అయితే మన మనసుకు దగ్గరగా ఉంటాయి. ఇతర భాషలలో అయితే, వాటి అర్ధాలు తెలిసే సమయానికి కాలం గడిచిపోతుంది. జీవితం గురించి విలువైన సమాచారం మన పండితులు వివిధ శాస్త్రములలో నిక్షిప్తం చేశారు. అవి మనసు గురించి ఎక్కువగా ఉంటే, అటువంటి మనసు గురించి మనసుకే అవగాహన రావడానికి మనసుకు బాగా తెలిసిన మాతృభాష అయితే, సులభంగా విషయసారం అర్ధం అవుతుందని అంటారు.

తెలుగు భాషలో కధలు తెలుగువారికి త్వరగా అర్ధం అవుతాయి.
కధలు మనకు చిన్నతనంలో అమ్మ లేక అమమ్మ లేక తాతయ్య లేక నానమ్మ లేక తాతయ్య లేదా అందరూ… మాతృభాషలోనే తెలుగు కధలు వింటాము. బాల్యంలో విన్న కధలు ఎప్పటికీ మనకు గుర్తుకు వస్తాయి. ఒక్కోసారి చిన్ననాడు విన్న నీతి కధల నీతి కూడా అనుభవంలోకి రావచ్చును. ఎవరైనా సరే పిల్లలుగా ఉన్నప్పుడు మాతృభాషలోనే కధలను వింటాము. మనమైతే తెలుగు భాషలోనే కధలు విని ఉంటాము. అవే మనకు త్వరగా అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది.

నీతి కధలు అర్ధం కావడానికి వాడుక భాష అయిన మాతృభాష కన్నా గొప్ప భాష ఉండదు. మాతృభాషలో మాట్లాడే మాటలు మనసులోకి త్వరగా చేరతాయి. అవి త్వరగా అర్ధం అవుతాయి.

మన సంస్కృతి, సంప్రదాయం తెలుగు భాషలో వివరించినట్టుగా
తెలుగు భాష గొప్పతనం గురించి
తెలుగు భాష గొప్పతనం గురించి మాతృ ప్రాంతం తెలుగువారి చరిత్ర

మాతృభాష వలన మాతృ ప్రాంతంలోని చరిత్ర గాని రచయిత భావజాలం గానీ మాతృ ప్రాంతపు సంస్కృతి గొప్పతనం బాగా అర్ధం అవుతుంది.

మనకు తెలుగు ప్రాంతాలలోనే అనేక సంప్రదాయాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల గతంలోని సంప్రదాయం చరిత్రలో కలిసి పోయి ఉంటుంది. కానీ రచయితల వలన మనకు మన పూర్వపు సంప్రదాయల గొప్పతనం తెలియబడుతుంది. వారు తమ రచనల ద్వారా సంప్రదాయం గురించి వ్రాసిన విషయాలు గతం గురించి వివరిస్తాయి.

వాడుక భాషలో కొన్ని మాటలు వ్యాకరణార్ధములు చూస్తే, మన తెలుగు భాష విశిష్టత ఏమిటో తెలియబడుతుంది. వ్యాకరణం తెలిసినవారికి తెలుగు భాష గొప్పతనం ఏమిటో బాగా తెలిసి వస్తుంది. అందుకేనేమో… శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలలో తెలుగు లెస్స అనుంటారు.

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం లో కొద్ది పాటి వివరణ ఇవ్వడం జరిగింది…. తెలుగు భాష గొప్పతనం అంటే తెలుగు సాహిత్యం చదివితే, తెలుగు వెలుగు రుచి తెలుస్తుంది… అది స్వయంగా చదివితేనే దాని గొప్పతనం మనకు అనుభవంలోకి వస్తుంది… అంతవరకు విన్నట్టుగానూ, చదివినట్టుగానూ మాత్రమే తెలుగు భాష గొప్పతనం గురించి తెలియబడుతుంది.

పురాణాలు, ఇతిహాసాలు తెలుగు భాషలో

తెలుగు భాష గొప్పతనం గురించి మనకు మరింత అవగాహన పురాణాలు చదువుతుంటే, బాగా తెలుస్తుందని అంటారు. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ ఉండే సన్నివేశాలు వివరిస్తూ ఉండే పద్యాలలోని పదాలలో విశేషమైన అర్ధం కలిగి ఉంటాయి. ఆయా పదాలకు గల భావం అర్ధం అవుతుంటే, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది.

కవులు మనకు పురాణాలను, ఇతిహాసాలను తెలుగులోకి అనువదించారు. వారి కారణంగా మనం మన మాతృభాష తెలుగు భాషలోనే వాటిని చదువుకోగలుగుతున్నాము. మన తెలుగులో ఎందరో కవులు, ఎంతో సాహిత్యమును తెలుగు భాషలలో గ్రంధములుగా అందించారు. ఆయా గ్రంధములను చదవగలిగితే జీవితం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అటువంటి జీవన ప్రాధాన్యత మనకు బాగా తెలిసిన మాతృభాష తెలుగు భాషలోనే చదివితే, త్వరగా వాటి సారం మనసుకు చేరుతుందని అంటారు.

మన పురాణేతిహాసాలు వివిధ పాత్రలు, ఆయా పాత్రల గొప్పదనం మనకు అర్ధం అయ్యేవిధంగా తెలుగు భాషలో గొప్పగా వివరించబడి ఉంటాయి. వాడుక భాషకు బాగా దగ్గరగా ఉండే పుస్తకాల వలన మనకు రామాయణ, భారత, భాగవత గ్రంధములలో వివిధ రకాల స్వభావాలు ఎలా ఉంటాయో తెలియబడుతుంది.

తెలుగు భాష చరిత్ర గురించి

తెలుగు భాష సంస్కృతం నుండి పుట్టిందని, తెలుగు భాష ద్రావిడ భాష నుండి విడివడిందని… భిన్నాభిప్రాయాలు కనబడతాయి. భాషా పండితుల అభిప్రాయం ప్రకారం తెలుగు భాష 2400 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. సాదారణంగా మనం వాడుతున్న పేపరు, దానిపై రచించిన రచనలు వ్రాయడానికి బాల్ పెన్ పుట్టింది 150 సంవత్సరాలకు లేదా అంతకన్నా ఎక్కువగా కావచ్చును. కానీ మన ప్రాచీన గ్రంధాలు సాదారణ పేపరుపై వ్రాసినవి కావు. కాబట్టి రచనలు ప్రకారం వాస్తవికతను అంచనా వేయడం కష్టమే అవుతుంది.

వాస్తవిక విషయాలు మూల గ్రంధాలు చదివితే తెలియబడుతుందని అంటారు. అవి గ్రాంధిక తెలుగు భాషలో ఉంటాయి. రచన చేసినవారి మక్కువను బట్టి కొన్ని విషయాలు రూపాంతరం చెంది గ్రంధస్తం చేయబడతాయి కాబట్టి మూల గ్రంధాలు చదివినవారికి వాస్తవ విషయాలు తెలియబడతాయని అంటారు. కావునా తెలుగు భాష ఎప్పుడు పుట్టింది అనే దాని కన్నా భాష మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఏవిధంగా మన మాతృభాషను వృద్ది చేసుకోవాలనే ఆలోచన మెరుగు.

ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి?

ఎందుకంటే, తెలుగు భాషలో పుట్టి పెరిగాము. మన మనోభావాలు తెలుగు పదాలలో మనకు పరిచయమే. అలాంటి పదాలతో కూడిన తెలుగు భాష వలన మనకు మనోవిజ్ఙానం బాగా అర్ధం అవుతుంది. మన సంప్రదాయంలో మనోవిజ్ఙానమే అన్నింటిలోనూ నియంత్రణతో ఉండే శక్తిని అందిస్తుందని అంటారు. అంటే మనోవిజ్ఙాన గ్రంధాలు మన మనసుపై పరిశీలన చేసినవి. అవి విలువలతో కూడిన మనోవిజ్ఙానాన్ని మనకు అందిస్తాయి. విలువలతో కూడిన వైజ్ఙానిక శాస్త్రం విషయ పరిజ్ఙానంతో బాటు, మన మనసు గురించి తెలియజేస్తాయి. తెలుగు భాషలో మనో విజ్ఙాన గ్రంధాలు చదివితే, మనసు యొక్క విశిష్ఠత, మనసు యొక్క చాంచల్యం…. వంటివి తెలుస్తాయి. ముందుగా మనసు ఒక అద్భుతమైనది… దానిని నియంత్రిస్తే చాలు, జీవితం గాడిన పడుతుందనే విషయం తెలుగు భాషలో రచించిన గొప్ప రచనలు చదవడం వలన తెలియబడుతుంది. అందుకని తెలుగు భాషను నేర్చుకోవాలి అంటారు.

తెలుగు భాష మన మనసులో వెలుగు వెదజల్లుతుంది.

జీవితానికి మార్గదర్శకత్వం వహించేవారు గురువు అయితే, ఆ గురువులుగా మొదటి తల్లిదండ్రులు తర్వాత పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. ఇంకా వైవాహిక జీవితం ప్రారంభం అయ్యాక కూడా గురువు అవసరం అయితే, మొదటి స్థానంలో పుస్తకమే మెదులుతుంది. అప్పటికి విద్యాభ్యాసం పూర్తయి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార పనులలో బిజిగా ఉంటాము. కావునా అప్పుడు కూడా మనసుకు మార్గదర్శకత్వం అవసరం అయితే, గొప్ప గొప్ప పుస్తకాలు మనకు మంచి మిత్రుడులాగా ఉపయోగపడతాయి. అలాగే రామాయణ, భారత, భాగవత పుస్తకాలు గురువు వలె బోధన చేయగలవు. అవి తెలుగు భాషలో రచించిన పుస్తకాలు చదివితే, తెలుగు భాష మన మనసులో వాటి వెలుగును వెదజల్లుతుంది.

మనకు మాతృభాష అయిన తెలుగులో మనకు మార్గదర్శకత్వం వహించగలిగే పుస్తకాలు ఉంటాయి. అవి వ్యక్తిగత జీవితంలో ఒక మిత్రుని వలె ఉపయోగపడతాయని అంటారు. అలాంటి పుస్తకాలు చదవడానికి తెలుగు భాషలో కొంతమేరకు ప్రావీణ్యత ఉంటే, అద్భుతమైన తెలుగు సాహిత్యం మన మనసులోకి చేరే అవకాశం ఉంటుంది. వాటిని చదవడం కోసం తెలుగు చదువుకోవలసని అవసరం ఉంది.

తెలుగు భాష గొప్పతనం గురించి తెలియడానికి మనకు తెలుగు భాషా పండితుల రచనలు చదవాలి. అప్పుడే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది.

తెలుగు వ్యాసాలు బ్లాగులో మరికొన్ని తెలుగులో వ్యాసాల లింకులు

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం