Teluguvyasalu

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది. అమ్మ మాట్లాడే భాషలోనే పెరిగిన పిల్లలు, అదే భాష ద్వారా విషయాలను గ్రహించడంలో అలవాటు పడి ఉంటారు. కావునా మాతృభాషలో విద్య వలన త్వరగా విద్యార్ధులకు విషయావగాహన ఉంటుందని అంటారు. మాతృభాషలో విద్య మీరు … Read more

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు. అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన మాటలే కాదు పద్యాలు పలికిన మహానుభావులు మన తెలుగు పూర్వీకులు. మన కవులు అందించిన కవిత్వంలోని మాధుర్యం … Read more

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు కూడా అమ్మ సంతోషం కోసం అమ్మ చేత కట్టబడ్డాడు… కాబట్టి తల్లి సంతోషం కన్నా కొడుకు సాధించేదేముంటుంది? … Read more

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో… తెలుగు సామెతలలో పదాలు పదునైన మాటలను కలిగి ఉంటాయి. మాటలు మనసును తాకుతాయి. మాటలు మనసును కదిలిస్తాయి. మాటలు మనసును బాధిస్తాయి. మనసుకు ఓదార్పు అవుతాయి. ఒక వ్యక్తి తన మాటల ద్వారా నలుగురిని కలుపుకోవచ్చు. మనిషికి మాటల ద్వారా తగువులు పెరుగుతాయి. మనిషి మాటల ద్వారా మనిషి మరింతమందికి దూరం అవ్వవచ్చు… దగ్గరకావొచ్చు… మాట అంత శక్తివంతమైనది. అలాంటి మాటలు పెద్దల ద్వారా చమత్కారంగా చలోక్తులుగా వినబడుతూ … Read more

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం. తెలుగు భాష మన మాతృభాష! ఒక ప్రాంతంలో జీవించే జనుల మద్య సంభాషణకు ఉపయోగించే సహజమైన భాష, ఆ ప్రాంతపు భాషగా గుర్తింపు పొందుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరూ అదే భాషలో మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా మన రెండు రాష్ర్టాలలోనూ ప్రజలు ప్రధానంగా తెలుగులోనే మాట్లాడుకుంటారు. చిన్పప్పటి నుండి మన అమ్మ దగ్గరే నేర్చుకునే భాష మాతృభాష అయితే తెలుగు రాష్ట్రాలలో అమ్మ దగ్గర నుండి మాటలు నేర్చే … Read more