Teluguvyasalu

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చక్కని కార్యక్రమం తెలంగాణకు హరితహారం. ఇది అటవీకరణ కార్యక్రమం.

telugu_calc_app

2015 తెలంగాణ రాష్ట్రంలో మొక్కలు నటి, తెలంగాణ అంతా పచ్చదనం నింపాలనే సదుద్దేశ్యంతో ప్రారంభించబడింది… ఈ హరితహారం.

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ ఈ హరితహారం కార్యక్రమం ప్రారంభించారు.

హరితహారం కార్యక్రమం ప్రకారం హైదరాబాద్ నగరంలో ఒకరోజునే 25,00,000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఒకరోజులో లక్షమంది 163 కిలోమీటర్ల దూరం అనేక మొక్కలు నటించడం జరిగింది.

మొక్కలు నాటడం వాటిని పెంచి వృక్షాలుగా తయారు చేయడం అంటే ప్రకృతి సమతుల్యతకు పాటుపడడమే… ఎక్కువ వృక్షాలు ఉండడం వలన అక్షిజన్ ఎక్కువగా ఉంటుంది.

సహజమైన ప్రాణవాయువు మనిషి మంచి ఆరోగ్యదాయకం అంటారు. మానవ మనుగడకు చెట్లు చాలా కీలకమైనవి… అటువంటి చెట్లతో తెలంగాణ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడే విధంగా చేయాలనే ఈ హరితహారం కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా భావింపబడుతుంది.

ఏదో ఒక ఏడాది కాకుండా ప్రతియేట ఈ హరితహారం కార్యక్రమం తెలంగాణలో నిర్వహించబడుతుంది. ఏటా అనేక మొక్కలు నాటుతున్నారు.

తెలంగాణలో మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా మార్చి అటవీకరణ ప్రాంతం పెంచి, తెలంగాణలో వానల శాతం పెరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.

రోడ్లకీరువైపుల మొక్కలు నాటడం వలన కాలుష్య ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రాణవాయువు శాతం పెరిగి, సహజమైన గాలి వలన మనిషికి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

పర్యావరణ సమతుల్యత పెరిగే అవకాశం ఈ హరితహారం కార్యక్రమం వలన ఉంటుంది.

ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో….

అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యాలుగా ఉన్నాయి

  1. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం
  2. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం
  3. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం
  4. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం
  5. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం
తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం
తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

హరితహారం కార్యక్రమం గురించి ప్రజలలో ప్రేరణ కలిగించడానికి నినాదాలు కూడా కలవు.

తెలంగాణ ‘పచ్చ’ల పేరు.. హరిత హారం జోరు
వనాలు పెంచు-వానలు వచ్చు
చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు
పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
వనాలు-మానవాళి వరాలు
పచ్చని వనములు-ఆర్థిక వనరులు
అడవులు-మనకు అండదండలు
అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
అటవీ సంపద-అందరి సంపద
చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
అడవులు-వణ్యప్రాముల గృహములు
పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
సతతం-హరితం
మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
చెట్టుకింద చేరు-సేదను తీరు
అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే
మొక్కను పట్టు-భూమిలో నాటు
దోసిలిలోకి తీసుకోమొక్కు -ఏదోస్థలమున నాటుము మొక్క

ప్రకృతికి మేలు జరిగితే, ప్రకృతి నుండి సమాజనికి మేలు జరుగుతుంది. ప్రకృతిని ఎంత సహజంగా ఉంచితే, ప్రకృతిలో అంత సహజంగా మానవ మనుగడ ఉంటుంది.

సహజంగా ఉండే ప్రకృతిలో చెట్లు చాలా కీలకం… అలాంటి చెట్లను హరితహారం కార్యక్రమం ద్వారా పెంచి, వాటిని పోషించాలని అనుకోవడం మంచి చర్యగా భావింపబడుతుంది.

తెలుగులో వ్యాసాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం