Teluguvyasalu

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ. తెలుగులో వ్యాసం. ఈ కరోన కాలంలో ఎంత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, అంత ఆరోగ్యం ఇంకా అదే పెద్ద సామాజిక సేవ!

telugu_calc_app

కరోన దాటికి ప్రపంచ దేశాలు దిగివచ్చాయి. లాక్ డౌన్ విధించాయి. ఆర్ధిక లావాదేవీలు పక్కనబెట్టి ప్రజారోగ్యం గురించి, కరోన కట్టడికి కృషి చేశాయి.

అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కరోనపై సంపూర్ణ విజయం సాధించాలి. కరోనపై పూర్తిగా విజయం సాధించాలంటే సామాజికంగా ప్రజల తీరే ముఖ్యం.

ఎవరు ఎంతబాగా తమనితాము కాపాడుకోవడానికి కోవిడ్ నియమాలు పాటిస్తారో? వారే సామాజిక సేవకులు… తమకుతాము మంచి మిత్రులు కూడా.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన కరోన వ్యాధి సోకే అవకాశం తక్కువ… తనదాకా కరోన వైరస్ రాకుండా నియంత్రించడం అంటే, తన నుండి కరోన వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడమే….

అందరూ గుర్తించవలసిన విషయం కరోన వ్యాప్తి చెందకుండా తమకుతాము తగు జాగ్రత్తలు పాటించడం. అనవసరంగా గుంపులలోకి రాకుండా ఉండడం… ప్రధానమైన విషయం.

అనవసరపు ప్రయాణాలు చేయకుండా ఉండడం. ఒకవేళ ప్రయాణం చేయవలసిన అగత్యం ఏర్పడితే మాత్రం, ప్రభుత్వ సూచనలు పాటించడం….

ప్రయాణములో మాస్క్ ధరిచి ఉండడం... ధరించిన మాస్క్ మూతి, ముక్కు కనబడకుండా ఉండేలా చూసుకోవడం… ఎక్కడ బడితే అక్కడ చేతులు వేసి, ఆ చేతులను ముఖముపై పెట్టకుండా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించడం….

ఇలా మనం మన పరిశుభ్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే, అంత ఆరోగ్యంతో బాటు సామాజిక సేవ కూడా అవుతుంది. ఎందుకంటే మన జాగ్రత్త వలన కరోన మన ద్వారా సమాజంలో వ్యాప్తి చెందదు.

ఇక ఇలా వ్యక్తి పరిశుభ్రతతో బాటు పరిసరాల శుభ్రత కూడా చాలా ప్రధానమైన విషయం. పరిసరాల బాగుంటే, చుట్టూ ప్రక్కల క్రిములు చేరకుండా ఉంటాయి.

చెత్తను ఎక్కడ బడితే అక్కడ పడవేయకుండా ఉండాలి. దాచిపెట్టిన చెత్తను మున్సిపాలిటీ లేదా పంచాయితీ బళ్ళు వచ్చినప్పుడు ఆ బళ్ళల్లో చెత్తను వేయాలి.

ఇంకా బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలి. బహిరంగ మురుగునీటిపారుదలను అరికట్టాలి. కలుషితమైన నీరు తాగడం మానివేయాలి. దోమల నిర్మూలన చేయాలి….

వ్యక్తిగత పరిశుభ్రత మనం మన పరిశుభ్రత విషయంలో

మనం తినే భోజనం వేడిగా ఉండాలి.

మనం ఆహారం తీసుకునే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు వ్యాయామం చేయాలి.

సురక్షితమైన లైంగిక సంబంధము వలన మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండగలదు.

సాధారణ ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి.

సాధారణంగా కొన్ని రకాల వ్యాధులు వివిధ బుతువులు, కాలాల్లో వసుంటాయి. వీటిని సీజనల్ వ్యాధులు అంటారు. అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కాలక్రమంలో వచ్చే వ్యాధుల గురించి , వాటికి సంబంధించిన కారణాలు, లక్షణాలు తెలుసుకోవాలి.

వ్యాధి లక్షణలు తెలియడం వలన వ్యాధినివారణ సులభం అవుతుంది.

అలా ఆ వ్యాధులను నివారించడమే కాకుండా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు.

ఇలా తగు జాగ్రత్తలతో ఉండడం వలన కరోన కాలంలో కూడా వ్యాధిగ్రస్తులు కాకుండా ఉండవచ్చు.

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి