Teluguvyasalu

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం. పక్షులకు ప్రధానంగా ఎగిరే గుణం ఉంటుంది. తమ ఆహార సముపార్జనకు ఆకాశంలో తమ శక్తిమేర ఎగురుతాయి.

telugu_calc_app

ఈ పక్షులు అంతరోష్ణ జీవులు లేక ఉష్ణ రక్త జీవులు అంటారు. పక్షుల శరీరం ఎగరడానికి వీలుగా వాటి దేహ నిర్మాణం ఉంటుంది.

రెక్కల సాయంతో పక్షులు ఎగురుతాయి. శరీరంపైభాగం ఈకలతో కప్పబడి ఉంటుంది.

కొన్నిరకాల పక్షులు నీటిపై కూడా ఉండగలవు. వీటిని నీటిపక్షులు అంటారు.

కొన్ని పక్షులు రాత్రులు మేల్కొని ఉంటాయి, రాత్రివేళల్లో మాత్రమే సంచరిస్తాయి. వీటిని నిశాచర పక్షులు అంటారు.

మరికొన్ని పక్షులు ఒక నిర్ధిష్ట సమయం ప్రకారం చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి, మరల తిరిగి వస్తాయి. వీటిని వలస పక్షులు అంటారు.

నీటిపక్షులకు ఉదాహరణగా బాతు, హంస, నీటికోడి, నీటికాకి…. చెబుతారు.

నిశాచర పక్షులకు ఉదాహరణగా గుడ్లగూబ, పైడిగంట…. చెబుతారు.

రకరకాల పక్షులు భూమిపై జీవిస్తూ, ఆకాశంలో ఎగురుతాయి. పిచ్చుకలు, కాకులు, గ్రద్దలు, చకోర పక్షి, చిలుక, మైనా, పావురాలు, రాబందులు, కొంగలు, లకుముకి, వడ్రంగి, పాలపిట్ట, గోరింక తదితర పక్షులు ఉంటాయి.

పక్షులు గూడు గురించి

తల్లిపక్షి పిల్ల పక్షులను గూడులో ఉంచి కాపాడుతుంది. పిల్ల పక్షులకు ఆహారం తీసుకొచ్చి, పిల్ల పక్షుల నోటిలో పెడతాయి. పిల్ల పక్షులకు రెక్కలు వచ్చి ఎగిరేవరకు తల్లి పక్షి, పిల్ల పక్షులను రక్షిస్తుంది.

ఇక ఈ పక్షిగూళ్ళు పుల్లలు, గడ్డి, ఆకులు వంటి సేంద్రీయ పదార్థాలతో కలిసి ఉండవచ్చు, ఇవి రకరకాల పరిమాణాలలో ఉండవచ్చు. వివిధ ఆకారాలలో కనబడతాయి. ఇంకా రాయి, చెట్టు, లేక భవనాలలోని కిటికీ రంధ్రాలు కూడా గూడులుగా మార్చుకుంటాయి. కొన్ని పక్షి గూళ్ళు గుండ్రంగా ఉండవచ్చు. కొన్ని పక్షిగూళ్ళు పైకప్పు లేకుండా ఉంటాయి. కొన్ని గూళ్ళు కేవలం పుల్లలలో నిర్మితమై ఉంటాయి,

పక్షి పిల్లలు అన్నీ గూడులోనే ఉండి, తల్లి పక్షి అందించే ఆహారంతో బ్రతుకుతాయి. పిల్ల పక్షులు ఉన్న గూడును తల్లి పక్షి కాపలా కాస్తూ ఉంటుంది.

ఈ భూమిపై మనిషితో బాటు అనేక జంతువులతో బాటు పక్షులు కూడా చాలానే ఉండేవి…. కానీ కాలంలో మారిన పరిస్థితుల బట్టి పక్షి జాతులు అంతరిస్తున్నట్టు చెబుతారు.

పిచ్చుకలు ఎక్కువగా కనబడేవని. ఇప్పుడు అవి కనబడడం లేదు అంటారు. కారణం సెల్ టవర్స్ అని చెబుతారు.

ఇలా కొన్ని మానవ సౌకర్యాల కోసం ప్రకృతిలో చేసే మార్పులు మరొక జాతి అంతమునకు కారణం అవ్వడం విచారకరం.

తెలుగులో వ్యాసాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర