Teluguvyasalu

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే వ్యక్తి శరీరం ఆరోగ్యంగా ఉంటే, ఆ శరీరంతో కష్టపడి పని చేయగలడు. డబ్బు సంపాదించగలడు… తనను తాను పోషించుకుంటూ, తనపై ఆధారపడినవారిని పోషించగలడు… కానీ అనారోగ్యంతో ఉంటే, తను ఇతరులపై ఆధారపడాలి…. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట చద్దిమూట వంటిదే. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలామంది ప్రతిరోజూ నడవండి… అంటారు. వేళకు భోజనం చేయండి … Read more

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు చూస్తే, కాలం కర్మ వెంటాడినా, వద్దని వారించినా, శ్రీరాముడి పట్టుదలే ప్రధాన కారణంగా కనబడుతుంది. శ్రీరామదృష్టి కోణం ధర్మమునే చూడడం వలన శ్రీరాముడు, ధర్మము ప్రకారం శ్రీరాముడు వనవాసం చేయడానికి సిద్దపడ్డాడనే భావిస్తారు. అయోధ్యాధీశుడైన దశరధ మహారాజు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని సభలో సభికులతో చెబుతారు. సభలో అందరూ హర్షిస్తారు. శ్రీరామ పట్టాభిషేకానికి ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుసుకున్న దశరధుడు, శ్రీరాముడిని పిలుపించుకుంటాడు. పట్టాభిషేక విషయం శ్రీరాముడితో దశరధుడు స్వయంగా … Read more

మంధర పాత్ర స్వభావం చూస్తే

శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా ఉంటుంది… మంధర మాటలు వినడానికి వినసొంపుగా అనిపిస్తే, అటువంటి మాటలు వ్యక్తిని చులకన చేస్తాయి… కైకేయి విషయంలో … Read more

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి! నీటి ఎద్దడి ఎదుర్కొనేవారికి నీటి విలువ తెలుస్తుంది. వారు నీటిని పొదుపుగా వాడతారు. నీరు వాడడంలో నీటి వృధా కానివ్వరు. నీటి యొక్క ఉపయోగాలు బాగా గుర్తెరిగి ఉంటారు. నీటి వృధా చేసేవారికి నీటి విలువ తెలియకుండానే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు… ఎవరు ఎలా ఉపయోగించినా గాలి తరువాత మనిషి మనుగడకు నీరు చాలా చాలా అవసరం. త్రాగు నీరు లేనిదే మనిషి మనుగడ లేదు… అలాగే భూమిమీద … Read more

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు కొన్నింటిని…. మంచి విద్యార్ధిగా ఉన్నప్పుడు మంచి లక్షణాలు ఉండడం చేత ఉపాధ్యాయుని వద్ద మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా ఉపాధ్యాయుడు మంచి లక్షణాలు గల విద్యార్ధులకు పాఠాలు చెప్పడంలో ఆసక్తి చూపుతారు. అంటే ఒక విద్యార్ధికి మంచి లక్షణాలు ఉంటే, అవి తోటివారికి కూడా సాయపడతాయి… అనుకరణలో విద్యార్ధులు ఒకరిని చూసి మరొకరు చేస్తూ ఉంటారు… కాబట్టి మంచి లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్ధి తమ వైఖిరి పట్ల తాము … Read more

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

కుటుంబ వ్యవస్థను అర్ధం చేసుకోవాలి. ముందుగా మనకున్న కుటుంబం గురించి తెలుసుకోవాలి. మన కుటుంబంలో పూర్వీకుల ఆచార వ్యవహారాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవారిపై ఎందుకు గౌరవం కలిగి ఉండాలో, తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి నమ్మకం… ఒకరి స్వభావం గురించి ఒకరికి అవగాహన కలిగి ఉంటూ, ఒకరిపై ఒకరికి సదభిప్రాయం కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనం ఏం చేయాలో మనకొక ఆలోచన పుడుతుంది. కుటుంబంలో సభ్యుల వలన … Read more

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు… అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు… అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా లభిస్తుంది. చేసిన మేలు మరిచేవాడిని కృతఘ్నుడు అంటాము… కృతఘ్నుడికి క్షమా బిక్షలేదని అంటారు. మరి చెట్టు మానవజాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి… కాబట్టి చెట్లకు నీరు అందించి వాటిని సంరక్షించాలి. చెట్లను తొలగించడము అంటే, … Read more

మన మహనీయుడు వేమన యోగి

మన మహనీయుడు వేమన యోగి, తన పద్యములతో వ్యక్తులను ప్రశ్నించాడు. సూటిగా ప్రశ్నించే భావములు వేమన పద్యాలలో ఉంటాయి. యోగి వేమన సుమారు 1652 – 1730 మధ్య కాలములో జీవించారిన చరిత్ర. కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని చెబుతారు. వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలోకి వచ్చాయి. లోకం తీరు గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి స్వభావం గురించి ఆలోచించే విధంగా వేమన పద్యాలు ఉంటాయి. వేమన … Read more

పివి నరసింహారావు మన మహనీయుడు

మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన … Read more

పావురం గురించి తెలుగులో వ్యాసం

పావురం గురించి తెలుగులో వ్యాసం ! ప్రధానంగా తెల్లని పావురం శాంతికి సంకేతంగా చెబుతారు. పావురం ప్రధానంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్నవాటిని కూడా ఇవి గుర్తించగలవు. 16గంటలు అవిశ్రాంతంగా ఆకాశంలో ఎగురగలవు. అందుకే వీటిని పూర్వపు కాలంలో సందేశాలు ఒక ప్రాంతం నుండి మరొక సుదూర ప్రాంతానికి పంపడానికి ఉపయోగించేవారు. పావురాలు తలను పైకెత్తకుండానే ఆహారాన్ని స్వీకరించగలవు. కానీ ఇతర పక్షలు పావురం మాదిరి ఆహారాన్ని స్వీకరించలేవని అంటారు. ఇంకా పావురం గుండె … Read more