Teluguvyasalu

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు. ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం … Read more

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. చూసి నేర్చుకునే విద్యైనా, చదివి తెలుసుకునే విద్య అయినా సరే గురువు ద్వారా నేర్చుకునే విద్యకు రాణింపు ఉంటుంది. మంచి గుర్తింపుతో బాటు మనోవిద్య కూడా … Read more

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది. ముఖ్యంగా తాత-ముత్తాతలు, అమ్మమ్మ, అమ్మకు అమ్మమ్మలు మాటలు పిల్లలలో మంచ అవగాహనను కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు చూపుకునే ప్రేమాభిమానాలు ఎదుగుతున్న పిల్లలో ఒంటరితనం అనే భావన లేకుండా, పాజిటివ్ దృక్పధం పెరిగే అవకాశాలు ఎక్కువ. … Read more

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి. పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి? మొక్కగా ఉన్నప్పుడే … Read more

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం? వ్యక్తికి శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యక్తులందరూ శ్రీరామాయణం చదవడం వలన సమాజానికి ప్రయోజనం ఏమిటి? శ్రీరామాయణం రీడ్ చేయడం వలన కలుగు మేలు ఏమిటి? ఎన్ని ప్రశ్నలు సంధించుకున్నా, ఆ ప్రశ్నకోణంలోనే, తగు సమాధానం మనసులో ధ్యోదకం అయ్యేలాగా శ్రీరామాయణం చేయగలదని పండితులు అంటారు. ఎన్ని సార్లు చదివినా కొత్తగా చదువుతున్న అనుభూతి కలగడంతో బాటు శ్రీరామాయణం చదవడం వలన శ్రద్ధాసక్తులు పెరుగుతాయని అంటారు. ప్రధానంగా ధర్మము తెలిసి … Read more

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును. ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు? కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు. … Read more

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి. కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది… మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం. వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా చెబుతారు. అనేక ఆలోచనలు సృష్టించే మనసు వివిధ విషయాలపై వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇలా … Read more

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది. ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావులలో ధర్మరాజు గొప్పవానిగా కీర్తింపబడ్డాడు. క్షత్రియ ధర్మం ప్రకారం రాజ్యాధికారిగా ఉండేకాలంలో రాజుగా ఉండాలి కాబట్టి శ్రీకృష్ణునితో ధర్మరాజు చెప్పే మాటలు … Read more

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. కేవలం వృత్తి పనితో బాటు తగిన చదువు ఉంటే, వ్యక్తి తనకు వచ్చిన పనితోనైనా జీవనం కొనసాగించగలడు. లేదా ఇతర కార్యాలయములలో ఉపాధి అవకాశాలు చూసుకోగలడు. కావునా … Read more

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు. ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మ విషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే, అమ్మ పంచిన ప్రేమను తరిచి చూస్తే చాలు… పదాలు ప్రవహిస్తూ పేరాలుగా ఏర్పడుతూ పేజీలకు పేజీలు పెరుగుతూనే … Read more