Teluguvyasalu

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు రాముని చుట్టూ ఉంటారు. అలా రాముడి ధర్మమే రామాయణంలో చాలా ప్రధానంగా ఉంటుంది. అలాంటి సుగుణాభిరాముడి గురించి … Read more

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది. పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది. భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం. వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి. గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు. ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది. మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది. భూమి, గాలి, … Read more

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర అంటే జరిగినది, జరగబోయే రోజులలో వర్తమానంగా వర్తింపబడుతుంది. అంటే గతంలోని విషయాలు ఈరోజు తెలుసుకోవడం… జరుగుతుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినది. దానిని కొంతకాలం జరిగాక, గుర్తుకు చేసుకుంటే అది గతం అవుతుంది. అలాంటి గత సంఘటనలు సమాజంపై చూపిన ప్రభావాన్ని బట్టి చరిత్రగా మనకు మరలా గుర్తుకు వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి జీవితం ముగిసింది. ఆయన జీవితం గతించిన జీవితంగా పరిగణింపబడుతుంది. ఎవరైతే … Read more

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయడపడతాయి. మాటపై వేలమందిని నడిపించగలిగే శక్తి నాయకుడుకి సొంతం. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడి గురించి వ్యాసంలో వివరించడానికి తెలుగువ్యాసాలులో ఒక పోస్టు.  లోకంలో అనేకమంది ప్రజలకు, ఎన్నో సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చును… అలా అవగాహన ఉన్నా, ప్రతి సమస్యకు పరిష్కారం తోచకపోవచ్చును… పరిష్కారం లభించినా, పరిష్కరించే … Read more

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి. అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది. సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో ఎక్కువమంది ఎవరిని పొగుడుతున్నారో… వారిలో సహజంగానే మంచి గుణాలు ఉంటాయి. మంచి గుణాలు అంటే ఉపకారం చేయడం, … Read more