Teluguvyasalu

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలులో పర్యావరణం గురించి తెలుగు వ్యాసం.

telugu_calc_app

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే, అదే పెద్ద ఆస్తి. మనిషి ఆరోగ్యంగా ఉండడం చేత, శక్తివంతంగా పనిచేయగలడు. తన సమర్ధవంతమైన పని వలన, శ్రమకు తగిన ఫలితం పొందగలడు. అలాగే ఆరోగ్యవంతుడు మాత్రమే, తనకు ప్రీతికరమైన ఆహార పదార్దములు స్వీకరించగలడు. వాటిని జీర్ణం చేసుకోగలడు. అటువంటి ఆరోగ్యం ఉన్న మనిషి జీవనం సాఫీగా కొనసాగుతుంది. అదే అనారోగ్యంగా ఉండే మనిషికి తినడానికి కూడా సమస్యలు ఉండవచ్చును. కావునా మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.

మనిషి సుఖంగా జీవించడానికి తన శరీర వ్యాయామంతో బాటు, అతని చుట్టూ ఉండే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండడం చేత మనిషి మనుగడ భూమిపై సుఖంగా సాగుతుంది. లేదంటే తన శరీర సమస్యలపైనే పోరాడాల్సిన స్థితి వస్తుంది. కాబట్టి మనిషి తన మరియు తన తరువాతి తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి ప్రస్తుత వాతావరణమును సక్రమముగా వినియోగించుకోవాలి. పర్యావరణమును పరిశుభ్రతలో అశ్రద్దగా ఉండరాదు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలు:

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు
వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

మన సమాజంలో కొన్ని కర్మాగారాల నుండి విడుదల వ్యర్ధ పదార్ధాలు, వాతావరాణానికి హానికరం. పరిశ్రమలలో సరైన చర్యలు లేకపోవడం వలన, కొన్ని పరిశ్రమల వలన కూడా వాతావరణం కాలుష్యం చెందుతుందని అంటారు. అంతే కాకుండా నిత్యం ఎక్కువమంది ఉపయోగించే మోటారు వాహనాలు వలన కూడా వాయు కాలుష్యం ఎక్కువగా జరుగుతుందని అంటారు. ఇంకా…. చెత్తను ఎక్కడపడితే అక్కడే పడవేయడం వలన మురికినీరు ఏర్పడి, ఆ నీటి వలన వివిధ క్రిములు పెరగడం, అవి రోగకారకాలుగా మారడమే కాకుండా, నీటి కాలుష్యం ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా వాతావరణం, పర్యావరణం పరిరక్షణలో తగు జాగ్రత్తల విషయంలో చూపే అశ్రద్ధ జల కాలుష్యం, వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం అంటారు.

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు
వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

నిర్లక్ష్యం వలన కర్తవ్యం దెబ్బతింటుంది. పర్యావరణం విషయంలో కొందరి అశ్రద్ద వలన వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దీని వలన భయానక పరిస్థితులను మనిషి ఎదుర్కొనవలసిన ఆగత్యం ఏర్పడుతుందనే అభిప్రాయానికి బలం చేకూరుతుంది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించిందని అంటారు. ఎందుకంటే, దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

వాతావరణ కాలుష్యం పరిష్కారం:

ఏదైనా ఒక సమస్యకు కారణం నిర్లక్ష్యం కారణం అయితే, అవగాహనారాహిత్యం కూడా మరొక కారణం కాగలదని అంటారు. వాతావరణం విషయంలో అందరూ తమ వంతు కర్తవ్యం గుర్తించాలి. ప్రతివారు తమ చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులను గమనించి, అక్కడ జరుగుతున్న కాలుష్యమును నివారించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ సంస్థలు కూడా వాతావరణ ప్రభావం గురించి, ప్రజలలో అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం ఇంకా చేయాలి.

కర్మాగారాలు, పరిశ్రమలు నడిపేవారు కూడా నిబంధనల ప్రకారం, తమ తమ పరిశ్రమలలో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో మరింత శ్రద్ద వహించాలి. వాతావరణం విషయంలో మనిషి ఎంత జాగ్రత్తపడితే, అంత సామాజిక సేవ చేసినవారుగా ఉంటారు. భావితరానికి ఆరోగ్యకర పరిస్థితులను అందించినవారవుతారు.

తెలుగు వ్యాసాలు వాతావారణం పర్యావరణం మరికొన్ని వ్యాసాలు

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం