Teluguvyasalu

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం. విశ్వంపై పరిశోధనాత్మక దృష్టి ఉంటే, లోకంలో అద్బుతాలను ఆవిష్కరించవ్చని అంటారు. ఇప్పుడు మనం విశ్వంలోని అనేక విషయాలను దృశ్యమానంగా ఎక్కడబడితే అక్కడే వీక్షించగలుగుతున్నాము అంటే అందుకు ఎవరో ఒకరి పరిశోధన ఫలితమే… మొదటి పరిశోధనకు మరింత పరిశోధన చేసి, దానిని మరింత సౌలభ్యం అభివృద్ది చేయడానికి లోకంలో పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉంటారు.

telugu_calc_app

విజ్ఙాన శాస్త్రం విశ్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది. పరిశోధనాత్మక దృష్టి విశ్వ రహస్యాలు సైతం గోచరిస్తాయని అంటారు. అలా పరిశోధకులు ప్రతిభ కారణంగా మన సమాజంలో ఆవిష్కరింపబడిన అద్భుతంగా టెలివిజన్ కుదిస్తే, టి.వి. తెలుగులో దీనిని దూరదర్శన్ అంటారు. అంటే దూరంగా ఉన్నవాటిని దర్శింపజేసేది. ఇంట్లో కూర్చుని ఎక్కడెక్కడి విషయాలను దృశ్యమానంగా చూపించే, దూరదర్శన్ మానవుడి జీవన విధానంపై ప్రభావం చూపింది.

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం

గాలిలో ప్రసారం చేయబడుతున్న దృశ్య తరంగాలను దృశ్యాలుగా చూపించే దూరదర్శన్ బ్రిటన్లో 1936 లో వెలుగులోకి వచ్చింది. ఈ దూరదర్శన్ ని స్కాట్ దేశానికి చెందిన్ ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928 సంవత్సరంలో కనిపెట్టినట్టు చరిత్ర చెబుతుంది.

లోకంలో దూరదర్శన్ లేకుండా ఇల్లు ఉండదు. కొత్తగా ఇల్లు కట్టుకుంటే, టి.వి. ఫిట్ చేసుకోవడానికి ప్రత్యేక ప్లేస్ కేటాయించడం కామన్ గా మారింది. అంతలాగా దూరదర్శన్ మానవ జీవితంలో భాగమైపోయింది. కారణం టి.వి. ద్వారా అనేక కార్యక్రమాలు వీక్షించవచ్చును. వినోదం పంచే సినిమాలు వీక్షించవచ్చును. లోకంలో జరుగుతున్న విశేషాలు చూడవచ్చును. ప్రభుత్వ, ప్రవేటు రంగంలో విశిష్ట సంఘటనలు ప్రతి విషయం ప్రత్యక్ష ప్రసారంలోనే టి.విలలో వీక్షించవచ్చును.

అనేక రంగాలలో జరుగుతున్న అభివృద్ది, అనేక రంగాలలో మారుతున్న పరిస్థితులు, అనేక రంగాలలో రావాల్సిన మార్పులు… ఇలా సామాజికంగా సామాజిక విశ్లేషకులు అభిప్రాయాలు వీక్షించవచ్చును. ప్రజలు చైతన్యవంతం కావడానికి టి.వి. ఉపయోగపడుతుంది. ప్రజలు కాలక్షేపం చేస్తూ, కాలం వృధా చేయడానికి కూడా టి.వి. ఉపకరిస్తుంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

దూరదర్శన్ – టెలివిజన్ – టి.వి. – స్మార్ట్ టివి

వ్యామోహానికి గురికాకుండా ఉంటే, టి.వి. ద్వారా విజ్ఙానం పొందవచ్చని అంటారు. ఎందుకంటే ఇప్పుడు టి.వి. మరింతగా వృద్ది చెంది… స్మార్ట్ టి.వి. అవతరించింది. స్మార్ట్ టివి వలన కేవలం కొందరు ప్రసారం చేసే, ప్రత్యక్ష ప్రసారాలతో బాటు, మనకు కావాల్సిన విజ్ఙాన విషయాలను వెతికి చూడవచ్చును. కంప్యూటర్లో బ్రౌజింగ్ చేసినట్టు స్మార్ట్ టి.విలో కూడా బ్రౌజింగ్ చేయవచ్చును. ఇంటర్నెట్ సాయంతో అనేక విజ్ఙాన విషయాలను తెలుసుకోవచ్చును.

ఉపయోగించుకుంటే స్మార్ట్ టివి సాంకేతిక గురువు వలె ఉపయోగపడుతుంది.

తెలుగు వ్యాసాలు వాతావారణం పర్యావరణం మరికొన్ని వ్యాసాలు

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం