Teluguvyasalu

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి? మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి? మంచి స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇన్ని ప్రశ్నలు సమాధానం ఒక్కటే వస్తుంది. మంచిగా ప్రవర్తించు, మంచి స్నేహితుడుగా మారు, నీవే మంచి స్నేహితుడుగా ఉండడం వలన నీ వలన మరొక మంచి స్నేహితుడు మరొకరికి లభిస్తాడు.

telugu_calc_app

తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఆనందం ఉందని గుర్తెరిగినవారు తీసుకోవడం కన్నా ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తారు. ఆలోచన చేయడం కన్నా ఆచరించడం ఉత్తమమని గుర్తెరిగినవారు, ఆలోచన చేయడానికి చూడడం కన్నా తెలిసినది ఆచరించడానికే ప్రాధాన్యతనిస్తారు. ఏదైనా కానీ గుర్తెరిగిన మనసు ఉత్తమమైనదే ఆచరిస్తుంది… అలా మనసు ఏది ఉత్తమమో గుర్తించాలంటే, ఆ మనసుకు చేరువలో ఎప్పుడూ ఒక ఉత్తమ స్నేహితుడు అవసరం అంటారు.

ఎందుకు ఉత్తమ ఆలోచన అంటే, ఉత్తమ ఆలోచన ఉత్తమ ఆచరణకు ప్రేరణ. ఉత్తమ ఆచరణ కలిగినవారితో స్నేహం చేసే మనసు ఉత్తమమైన పనులపై ఆసక్తి పెంచుకుంటుంది. కాబట్టి మంచివారితో స్నేహం చేయడం వలన మంచి పనులపైనే ఆసక్తి నిలబడుతుంది. ఆర్నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారనే తెలుగు సామెత ప్రకారం మంచి వారితో సహవాసం చేయడం వలన మంచి గుర్తింపు కూడా పెరుగుతుంది.

జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అన్నీ సమస్యలకు స్వీయ ఆలోచన పరిష్కారం కాకపోవచ్చును. అప్పుడు సరైన సలహా అందించే సజ్జన సాంగత్యం అవసరం.

ఒక్కోసారి సుఖవంతమైన జీవనం సాగుతున్నప్పుడే, తప్పులు చేసేసి.. తరువాత బాధపడేవారు ఉండవచ్చును. అలా సుఖంగా సాగే జీవనంలో మంచి స్నేహితుడు తోడుగా ఉంటే, ఇతరుల విషయంలో తప్పులు జరగకుండా మంచి సలహాలు అందిస్తూ ఉంటాడు. అంటే మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అంటే మొదటి ప్రయోజనం ముందు చెడ్డపేరు తెచ్చుకోకుండా ఉండగలం. జీవితంలో చెడ్డపేరు తెచ్చుకోకుండా ఉండడమంటే, మంచి పేరును నిలబెట్టుకున్నట్టే కదా!

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి?

సమాజంలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నవారు మంచి మార్గములోనే నడుస్తారు. తమతో స్నేహం చేసేవారిని కూడా ఆ మార్గములోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయగలరు.

మంచితనం భాషించేవారు ఓర్పుతో ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేయడం వలన ఓరిమి లేనివారికి కూడా సహనం పెరిగే అవకాశం ఉంటుంది.

మంచివ్యక్తి మంచి లక్ష్యంతో ఉంటాడు. అలాంటివానితో స్నేహం చేయడం వలన లక్ష్యం లేనివారికి కూడా ఓ మంచి లక్ష్యం ఏర్పడవచ్చును.

ఆచరణలో ముందుండే మంచివారితో స్నేహం వలన ఆలోచన చేయడం తగ్గించి, తెలిసినదే ఆచరించడంలో ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంటుంది.

తృప్తిగా ఉండేవారు తమ సహజ స్వభావంతో ప్రశాంతంగా ఉంటారు. అటువంటి వారితో స్నేహం వలన మంచి ప్రయోజనాలు లభిస్తాయని అంటారు.

అసలు మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? అంటే… మనసు మామూలుగానే అనుసరించే ప్రక్రియను చేస్తుంది. చిన్నప్పుడు అమ్మను చూసి, నాన్నను చూసి, అన్నను చూసి, అక్కను చూసి, బావను చూసి… ఏదో ఒక బంధం చూసి ఏదో ఒక విషయమును అనుసరించి ఉంటాము. అలా అనుసరించి చాలా విషయాలు అనుభవంలోకి వస్తాయి… అయితే చిన్ననాడు అనుసరణ పెద్దయ్యాక తగ్గవచ్చును. కానీ అలవాట్ల విషయంలో మాత్రం అనుసరించడం ఉంటుందని అంటారు. కాబట్టి మంచి అలవాట్లు కొరకు కానీ చెడు అలవాట్లు అబ్బకుండా ఉండడానికి కానీ మంచి స్నేహితునితో స్నేహం శ్రేయష్కరం అంటారు.

అనుసరించే మనసులోకి చెడు అలవాట్లు అబ్బితే, ఆ మనసు కలిగిన వ్యక్తి వ్యసనపరుడుగా చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. అదే అనుసరించే మనసుకు మంచి స్నేహితుడి ద్వారా మంచి అలవాట్లు అబ్బితే, అతను మంచి వ్యక్తిగా కీర్తిగడిస్తాడు… కావునా మంచి మిత్రుడి కోసం ప్రయత్నించు… మంచి వారితో స్నేహం వదులుకోకు… మంచి వారితో స్నేహం నిలబడడానికి నిజాయితీగా ఉండడమే మేలు అంటారు.

మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి?

జీవితం ఓ పెద్ద నిరంతరం సాగే బడి అయితే అందులో మనతో మెసిలేవారంతా బంధువులు లేదా స్నేహితులు అయితే… బంధుత్వం చెడిపోకుండా ఎలా సహనంతో ఉంటామో? అలాగే మంచి వారితో స్నేహం విషయంలోనూ సహనంగానే ఉండాలి అంటారు.

ఓర్పు దేవతా లక్షణం అంటారు. సహనంతో ఉంటే సహస్ర మార్గములు కనబడితే, అసహనంగా ఉంటే, ఉన్న మార్గము కూడా ముళ్ళమార్గముగా అనిపిస్తుందని అంటారు. కావునా ఓర్పుతో కూడిన ప్రవర్తన ఎవరినీ దూరం చేయదు.

మన ప్రవర్తన చేత మనకు దగ్గరయ్యేవారు ఉంటారు. అయితే మనకుండే అలవాట్లు వలన మనకు స్నేహితులు పెరుతూ ఉంటే, ఎటువంటి అలవాట్లు ఉంటే, అటువంటి స్నేహం లభించే అవకాశం ఉంటుంది. కావునా మంచి అలవాట్లకు దూరం కావద్దని అంటారు.

వ్యక్తి మొదటి స్నేహితుడు మనసే అంటారు. మనకు మన చుట్టూ ఉండే విషయాలకు వారధి మనసు అయితే అటువంటి మనసుని అదుపులో పెట్టుకుంటే, జీవితంలో ఏదైనా సాధించవచ్చును. కావునా మనసుకు మంచి స్నేహితుడి సహవాసం దూరం చేయవద్దని అంటారు.

ఏది లోకానికిస్తే, లోకం ద్వారా అది తిరిగి లభిస్తే… ఇది ఒక లాజిక్… ఆ ప్రకారం మనం మంచి ప్రవర్తననే పంచితే, మనకు మంచిని పెంచే మంచి స్నేహితులు లభిస్తారు.

ఎవరి స్వభావం వారిదే కానీ ఆపదలో మంచి సలహా ఇచ్చేవారు ఎటువంటి స్వభావమో మనకు తెలియదు. కానీ ఆపద ఎప్పుడూ ఉండదు. కానీ ఎప్పుడూ మనతో ఉండేది మనసు. మనసుకు అలవాటు అనేది ఒక విషయము. ఆ అలవాటు ఎటువంటి విషయాలు అనేది ప్రధానం. మంచి మార్గములో నడిచే మిత్రుడితో స్నేహం ఉండడం వలన మనసుకు మంచి అలవాట్లపై ఆసక్తి పెరుగుతుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలను సన్మార్గంలో సాధించే సజ్జనుల సహవాసం ఉత్తమ సహవాసంగా చెప్పబడుతుంది.

తెలుగులో వ్యాసాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పావురం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి