Teluguvyasalu

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును…. వంటి విషయాలు తెలుసుకోగలుగుతాము. పదవ తరగతి పూర్తయ్యాక ఆలోచన చేద్దామనే భావన ఉంటే, అది కాలం వృధా కావడానికి కారణం కావచ్చును.

telugu_calc_app

హైస్కూల్ చదువుతుండగానే ప్రతి విద్యార్ధికి, తన బలమేమిటో తనకు తెలియవస్తుంది. ఆ బలంతోనే ముందుకు సాగడానికి మనసు సిద్దపడుతుంది. ముఖ్యంగా పఠ్యాంశములలోనే ఏదో ఒక సబ్జెక్టు అంటే ఇష్టముగా ఉంటుంది. ఆ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలో చదువు ముందుకు సాగే విధంగా ప్రణాళిక వేసుకోవడం వలన, పది పూర్తయ్యాక చేయవలసిన పనులపై సరైన అవగాహన ఏర్పడవచ్చును.

ఏదో పెద్దవారు చదివిస్తున్నారు. మనం చదివేస్తున్నాము. పది పరీక్షలు వ్రాసేసి, ఆపై ఆలోచన చేద్దామనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే… కారణం కొన్ని ప్రవేశ పరీక్షలకు సమయం మిగలకపోవచ్చును. మన ఆలోచనలు పూర్తయ్యి, ఏదైనా డిప్లొమా చేద్దామనుకుంటే, దానికి దరఖాస్తు గడువు ముగిసిపోయి ఉండవచ్చును. లేదా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్రాద్దామనుకుంటే, దానికి గడువు దగ్గరపడి ఉండవచ్చును…. ప్రిపేర్ కావడానికి సమయం ఉండకపోవచ్చును…. ఇలా ఒక సంవత్సర కాలం మనకు నచ్చిన కోర్సులో జాప్యం ఏర్పడవచ్చును…. కావునా పదవ తరగతి తరువాత ఆలోచన? మనసులో ముందునుండే ప్రణాళిక అవసరం.

చదువుతున్న కాలంలోనే ఆసక్తి ఏమిటి? క్రీడలంటే ఆసక్తి ఉంటే, ఆసక్తి ఉన్న క్రీడలలో ఉత్తమ సాధన చేయడం… ఆ క్రీడలలో పాల్గొనడం మొదటి నుండి ఎలా అవసరమో… ఏదైనా ఒక రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి, ఆ రంగానికి సంబంధించిన చదువులో విశేష కృషి కూడా అంతే అవసరం.

కాబట్టి ఎందుకు చదువుతున్నాము? ఏమిటి చదివితే మన జీవితంలో మనం ఉన్నత స్థితికి చేరగలం… అసలు మన ఆసక్తి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే, పదవ తరగతి పూర్తయ్యాక తరువాత ఆలోచన ఏమిటనేది ప్రస్ఫుటం కావచ్చును.

ముఖ్యంగా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులలో మార్కుల శాతం ఎప్పుడూ బాగుంటే, ఇంజనీరింగ్ రంగం, లేకపోతే పోటీ పరీక్షలకు సిద్దపడడానికి అనుకూలమైన గ్రూపుల గురించి అవగాహన అవసరం. డిప్లొమా కోర్సుల గురించి, ఒకేషనల్ కోర్సుల గురించి, ఇంటర్మీడియట్ గ్రూపుల గురించి…

పదవ తరగతి తరువాత ఉండే ఇంటర్మీడియట్ గ్రూపులు

ఇంటర్మీడియట్ బోర్డు రకరకాలు కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో కొన్ని కాంబినేషన్లలో మాత్రమే చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. వివిధ కాలేజీలూ వాటిపైనే దృష్టి సారిస్తున్నాయి. ఇవి చాలా పాపులర్ గ్రూపులు.

  • ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
  • బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
  • సీఈసీ (కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్)
  • ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్)
  • హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్)

ఇంజనీరింగ్ రంగంలో స్థిరపడాలనే నిశ్చయం ఉన్నవారు… ఎంపిసి గ్రూపును ఎంపిక చేసుకుంటారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ వంటి వివిధ రంగాలలో ఇంజనీరింగ్ చేయవచ్చునని అంటారు. ఐఐటిలో ప్రవేశించడానికి ఎంపిసి గ్రూపులో ప్రదమశ్రేణి మార్కులు అవసరం.

వైద్యరంగంలో స్థిరపడాలనే నిశ్చయం ఉన్నవారు… బైపిసి గ్రూపును ఎంపిక చేసుకుంటారు. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ వంటి రంగాలలో అవకాశాలు ఉంటాయి.

చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ వంటి వివిధ రంగాలలో స్ధిరపడాలనే ఆసక్తి ఉన్నవారు సిఇసి, ఎంఇసి వంటి గ్రూపులు ఎంచుకుంటారు. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ గ్రూపులలో చదవడం వలన అవకాశాలు బాగుంటాయని అంటారు.

ఇంక ఆర్ట్స్ గ్రూపులలో చేరడం ద్వారా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. యూపీఎస్‌సీ పోటీ పరీక్షలలో నెగ్గి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి.

ఒకేషనల్ కోర్సులలో అయితే వృత్తివిద్యా కోర్సులు ఉంటాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, వ్యవసాయ-వ్యవసాయాధారిత, హోంసైన్స్ తదితర రంగాల నుంచి మొత్తం 29 రకాల కోర్సులను అందిస్తున్న వృత్తులలో నచ్చినది ఎంపిక చేసుకుని, వృత్తి విద్యా లేదా ఒకేషనల్ కోర్స్ చదవవచ్చును.

2 ఇయర్స్ ఒకేషనల్ కోర్సులు పదవ తరగతి తరువాత ఆలోచన

అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్‌ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.

  • బిజినెస్ అండ్ కామర్స్ : మార్కెటింగ్ అండ్ సేల్స్‌మేన్‌షిప్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, అకౌంట్స్ అండ్ టాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్.
  • హ్యుమానిటీస్ అండ్ అదర్స్ : టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్.
  • ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, రూరల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, వాటర్‌సప్త్లె అండ్ శానిటరీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ.
  • హెల్త్ అండ్ పారామెడికల్: మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎం.ఎల్.టి.), మల్టిపర్పస్ హెల్త్ వర్కర్ (ఫీమేల్), ఫిజియోథెరపీ, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్.
  • హోంసైన్స్ : కమర్షియల్ గార్మెంట్ అండ్ డిజైన్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్, హోటల్ ఆపరేషన్.

3 ఇయర్స్ డిప్లొమో కోర్సులు

సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.

3.5 ఇయర్స్ డిప్లొమో కోర్సులు

మెటలర్జికల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ.

ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు

ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్.

డిప్లొమా పూర్తి చేశాకా ఉద్యోగ అవకాశాలు ఉండే రంగాలు అంటూ ఈ క్రింది విధంగా చెప్పబడుతున్నాయి.

సివిల్ ఇంజినీరింగ్: నీటిపారుదల, పబ్లిక్ హెల్త్, రోడ్లు, భవనాలు, రైల్వే, సర్వే, డ్రాయింగ్, నీటిసరఫరా, తదితర ప్రభుత్వ/ ప్రైవేటు రంగాలు.
ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్: డిజైన్, డ్రాయింగ్ శాఖలు, మునిసిపాలిటీల్లో లైసెన్స్ డిజైనర్, డ్రాఫ్ట్స్‌మెన్.
మెకానికల్ ఇంజినీరింగ్: మెషినరీ, ట్రాన్స్‌పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్లలో వర్క్‌షాపులు, గ్యారేజీల్లో అవకాశాలు.
ఆటోమొబైల్ ఇంజినీరింగ్: ఏపీఎస్ఆర్టీసీ, రవాణా రంగం, ఆటోమొబైల్ షోరూమ్‌లు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ.
ప్యాకేజింగ్ టెక్నాలజీ: ఫార్మాస్యూటికల్, ఫుడ్, బెవరేజ్, పేపర్, ప్లాస్టిక్ తదితర రంగాల్లో ప్యాకేజింగ్ విభాగాల్లో అవకాశాలు.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో, డీసీఎల్ లాంటి సంస్థల్లో ఉపాధి.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో అవకాశాలు.
అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్: ప్రాసెస్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో.
కంప్యూటర్ ఇంజినీరింగ్: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రెయినింగ్ తదితర రంగాల్లో.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: అన్ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీల్లో.
మైనింగ్ ఇంజినీరింగ్: గనులు, ఎస్.సి.సి.ఎల్., ఎన్.ఎం.డి.సి., తదితర సంస్థల్లో.
కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ): పేపర్, సుగర్, పెట్రో కెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో.
ప్రింటింగ్ టెక్నాలజీ: కంపోజింగ్ డీటీపీ, ఫిల్మ్ మేకింగ్, ప్రింటింగ్ రంగాల్లో.
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్టెనో, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్; రీటైల్ వ్యాపార రంగంలో వకాశాలు.
ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు
ఎంబెడెడ్ సిస్టమ్స్: ఎలక్ట్రానిక్ ఐసీ సర్క్యూట్ల తయారీ రంగం.
కంప్యూటర్ ఇంజినీరింగ్: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ శిక్షణ సంస్థల్లో.
కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ప్రాసెస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు.
ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్ ఐసీ సర్క్యూట్స్ తయారీ రంగం, ప్రాసెస్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు.
టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, ప్రైవేటు టీవీ ఛానెళ్లు, ప్రభుత్వ-కార్పొరేట్ హాస్పిటళ్లలో.
బయోమెడికల్ ఇంజినీరింగ్: మెడికల్ రిసెర్చ్ సంస్థలు, హాస్పిటళ్లు.
మెటలర్జికల్ ఇంజినీరింగ్: ఫౌండ్రీలు, స్టీల్ ప్లాంట్స్, ఫోర్జ్ షాప్స్, రోలింగ్ మిల్లులు, హీట్ ట్రీట్‌మెంట్ షాప్స్,
టెక్స్‌టైల్ టెక్నాలజీ: టెక్స్‌టైల్ మిల్లులు, వస్త్రాల ఎగుమతి పరిశ్రమల్లో.
కెమికల్ ఇంజినీరింగ్: కెమికల్, రిఫైనరీ, పెట్రోకెమికల్ పరిశ్రమలు. కెమికల్ ఇంజినీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ): రిఫైనరీ, పేపర్, సుగర్, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు. కెమికల్ ఇంజినీరింగ్ (పెట్రో కెమికల్): రిఫైనరీ, పెట్రో కెమికల్, కెమికల్ పరిశ్రమలు. కెమికల్ ఇంజినీరింగ్ (ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్): కెమికల్ పాలిమర్, ప్లాస్టిక్ పరిశ్రమలు.
సిరామిక్ టెక్నాలజీ: రిఫ్రాక్టరీ, ఇటుకబట్టీలు, సిమెంట్, గ్లాస్, సిరామిక్, శానిటరీ వేర్ తదితర రంగాలు.
లెదర్ టెక్నాలజీ: ట్యానరీ, ఫుట్‌వేర్ పరిశ్రమలు.
ఫుట్‌వేర్ టెక్నాలజీ (లెదర్): ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లెదర్ టెక్నాలజీ.

APRJC

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. దీనిలో ప్రవేశించగలిగితే, ఆ సంస్థే విద్యార్ధికి నాణ్యమైన చదువును అందిస్తుంది. వసతి సౌకర్యం కూడా కల్పిస్తుంది.

చదివే ఆర్ధిక స్థోమత తక్కువగా ఉన్నవారు పదవతరగతి తరువాత వెంటనే ఉపాధి అవకాశం కోసం ఎదురుచూసేవారు ఎంచుకునేది ఐ.టి.ఐ. ఇది రెండేళ్ళ కోర్సు… కోర్స్ పూర్తయ్యాక అప్రెంటీస్ పూర్తి చేస్తే, వివిధ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఐటిఐ పూర్తి చేసుకుని కూడా డిప్లొమో చదవుకోవచ్చును… ఉద్యోగం చేస్తూ… ఆ ప్రయత్నం చేయవచ్చును.

ఐటిఐ ట్రేడులు

అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్), డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టం, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టం మెయిన్‌టెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్), రేడియో-టీవీ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెయిన్‌టెనెన్స్ మెకానిక్ మిషన్ టూల్, మెరైన్ ఫిట్టర్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, వెజల్ నావిగేటర్, వైర్‌మన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్), మెకానిక్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్. పెయింటర్ (జనరల్), మెకానిక్ (డీజిల్), మౌల్డర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, శానిటరీ హార్డ్‌వేర్ ఫిట్టర్, సైంటిఫిక్ గ్లాస్ అండ్ నియాన్ సైన్స్, షీట్‌మెటల్ వర్కర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్), బుక్‌బైండింగ్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కటింగ్ అండ్ స్యూయింగ్, డ్రెస్‌మేకింగ్, హార్టికల్చర్, లిథో- ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్, మాసన్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, ప్లంబర్, ప్రి ప్రిపరేటరీ స్కూల్ మేనేజ్‌మెంట్ (అసిస్టెంట్), స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్), వెల్డింగ్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్). ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, ఆటోమొబైల్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, లెదర్, అపెరల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్, ఫ్యాబ్రికేషన్ (ఫిట్టింగ్, వెల్డింగ్), ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ మెషినరీ, కన్‌స్ట్రక్షన్ ఉడ్ వర్కింగ్, ప్రాసెస్ ప్లాంట్ మెయిన్‌టెనెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టూరిజం, బ్యాంబూ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, టెక్స్‌టైల్ టెక్నాలజీ.

జీవితంలో ఉత్తమ స్థితికి ఎదగడానికి పదవ తరగతి పునాది అయితే, పదవ తరగతి చదివేటప్పుడే మనము ఏమి కావాలో నిశ్చయం అయి ఉంటే, చదువు ఎంపికలో ఆ నిశ్చయం మార్గనిర్ధేశం చేయగలదని అంటారు. కావునా మన ఆసక్తి ఏమిటో మనం గుర్తించాలి. చెప్పేవారు చెబుతూ ఉంటారు. అలాగే మన మనసు కూడా చెబుతూ ఉంటుంది. అది ఆసక్తి రూపంలో తెలియబడుతుంటే, అది ఏమిటో గుర్తించి, దానికనుగుణంగా సాధన చేస్తే మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి…

తెలుగులో వ్యాసాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి