Teluguvyasalu

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు పెద్దలు చెప్పిన మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు నుండి కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పడం మేలు.

telugu_calc_app

మార్గదర్శకంగా నిలిచిన మహనీయులంతా తల్లిదండ్రుల నుండి కానీ గురువుల నుండి కానీ మంచి మాటలు విన్నవారేనని అంటారు. మహనీయులుగా మారినవారు సైతం వారి జీవితంలో ఎవరో ఒకరిని మార్గదర్శకంగా భావించే అవకాశం ఉంటుంది. అంటే ఒక గొప్పవ్యక్తిని చూసి, అతనంతా గొప్పస్థాయికి చేరాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం అంటారు.

ఒకరి జీవితం నేర్పిన అనుభవంలో నుండి పుట్టే ఆలోచనలు మాటలుగా మారితే, అవి మరొకరి పరాకుగా మారతాయి. కాబట్టి అనుభవశాలి మాట్లాడే మాటలు పరిగణనలోకి తీసుకోవాలని పండితులు సూచిస్తారు.

పిల్లలు ముందు పెద్దలు మాట్లాడే మాటలు, పిల్లలు ఆలకిస్తూ, వాటిని అనడానికి అనుకరిస్తారు. అలా అనుకరించే పిల్లలు ముందు అసభ్య పదములను వాడుట తప్పుగా చెబుతారు. ఎందుకంటే అవే అసభ్య పదములు పిల్లలకు అలవాటు అయితే, వాటినే వారు తిరిగి ప్రయోగిస్తారు. కాబట్టి పిల్లలకు మంచి మాటలు చెప్పడమే కాదు… వారి ముందు అసభ్యపద జాలమును ప్రయోగించరాదని పెద్దల సూచన.

మంచి మాటలు విన్న పిల్లలు గొప్పవారిగా మారతారనడానికి రుజువు ఏమిటి?

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు చెప్పడం మొదలు పెడిటే, అవి మంచి అలవాట్లుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఛత్రపతి శివాజీ తల్లి చెప్పిన మంచి మాటలు, తల్లి ద్వారా విన్న నీతి వ్యాక్యాలు… అతనిని గొప్పవానిగా చరిత్ర ఇప్పటికీ చెప్పుకుంటుంది. స్త్రీల పట్ట ఛత్రపతి శివాజీ భావనలు మనకు పాఠ్యాంశములుగా ఉన్నాయంటే, అతని స్వభావం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. అటువంటి స్వభావానికి పునాది, ఛత్రపతి శివాజీ తల్లి చెప్పిన మంచి మాటలే కారణం అయితే….

మరి మన పిల్లలకు మనం రోజుకో మంచి మాట అయినా చెప్పాలి. మంచిని నేర్చుకోవడానికే కదా విద్యాలయానికి వెళ్ళేది… మరలా మనం కూడా చెప్పాలా? అంటే అమ్మ నాన్న ప్రేమగా పలికే పలుకులు పిల్లల హృదయంలో నిలుస్తాయని అంటారు. కావునా పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించాలి.

నచ్చిన మంచి మార్గదర్శకుడి జీవితం గురించి తెలియజేస్తూ ఉండాలి…. అంటే అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణ, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్ వంటి వారు కావచ్చును. సాహిత్య పరంగా పోతన, తిక్కన వంటి మహానుభావుల గురించి ఇలా ఏదైనా పిల్లలకు ఇష్టమున్న రంగంలో గొప్పవారి గురించి చెప్పడం వలన వారి మనసులో ఒక గొప్ప లక్ష్యం పుట్టవచ్చును…

మంచి పుస్తకాలు చదవండి. మంచి వ్యక్తుల గురించి తెలుసుకోండి. మంచి మాటలు వినండి. మంచి లక్ష్యం కోసం జీవించాలనే సత్యం తెలుసుకోండి. మంచి భవిష్యత్తు కోసం తపనపడండి… అంటూ పెద్దలు చెప్పే మంచి మాటలు… పెద్దలు సూచించే సూచనలు పరిగణనలోకి తీసుకోవడం వలన శ్రేయష్కరం అంటారు.

పెద్పెద్దలు చెప్పే మంచి మాటలు మనకు రుచించకపోవచ్చును. కానీ కాలంలో అవి అనుభవంలోకి వచ్చినప్పుడు వాటి విలువ తెలియబడుతుంది. ఎప్పుడూ పెద్దలు పిల్లల భవిష్యత్తు కొరకు మంచి మాటలు మాట్లాడుతారే కానీ, పిల్లలు సాధించాలనే దృక్పధం కాదని చెబుతారు.

తెలుగులో వ్యాసాలు

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

విద్యార్థులకు మంచి మాటలు తెలుగులో నీతి సూక్తులు

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

పేదలకు దానం చేయటంవల్ల మనం

మంధర పాత్ర స్వభావం చూస్తే

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి