Teluguvyasalu

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం. మాటతీరు వలన మన్ననలు పొందవచ్చు. మాట తీరుతో బాగుంటే, స్నేహపూర్వక సమాజం మనిషి చుట్టూ ఏర్పడుతుంది. సంఘంలో గుర్తింపు మాట తీరును బట్టి ప్రభావితం అవుతుంది. మనిషి మాట తీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. మాట వలన మనిషికి మనిషికి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటే మంత్రం అవుతుంది. మాటే కష్టం పోగొడుతుంది. మాటే మనిషికి కష్టాన్ని తీసుకురావచ్చు. మాట శక్తివంతమైనది… అది ఒక మంత్రంగా పనిచేయగలదు. ఎందుకంటే మాట మనసుని తాకుతుంది. వ్యక్తి మాట తీరు బాగుంటే, ఆ వ్యక్తి చుట్టూ స్నేహితులే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా సరే స్నేహపూర్వక ఆదరణ మాట తీరు బాగుండే వ్యక్తిపై చూపుతారు. అలా కాకుండా ఒక వ్యక్తి మాట తీరు కటువుగా ఉంటే మాత్రం, ఆ వ్యక్తికి ఎక్కువమంది మిత్రుల కంటే శత్రువులు పెరుగుతారు. మాట తీరు వలననే మిత్రత్వం లేదా శతృత్వ భావనలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో వ్యక్తిపై అతని మాట తీరు ప్రభావం చాల ప్రముఖమైంది. అతని మాటే అతనికి పరిచయాలు తీసుకువస్తుంది,. మాట తీరును బట్టి స్నేహితులు గాని శత్రువులు గాని ఉండవచ్చు. మాట తీరు మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలదు, మాట తీరు వలన విషయాలను చక్కగా వివరించవచ్చును. మాట తీరు మంచిదైతే లోకం అంతా ప్రశాంతంగా కనబడుతుంది. లేకపోతె లోకం అశాంతిగా అనిపిస్తుంది. కొందరి మాట తీరు ఎదుటివారిలో శాంతిని రేకెత్తిస్తే, కొందరి మాట తీరు ఎదుటివారిలో అశాంతికి కారణం కాగలదు. కొందరు నొప్పించే మాట తీరు కలిగి ఉండి, తమ చుట్టూ ఉండేవారిని కూడా బాధపెడుతూ ఉంటారు. మాట సాయం వలన మనిషికి మనో బలం ఏర్పడుతుంది. అటువంటి మాట సాయం మంచి మాట తీరు కలిగిన వ్యక్తులకే సాద్యమంటారు. మాట తీరు ప్రాముఖ్యత గురించి పురాణాలలో కూడా కనబడుతుంది. మనకు మాట … Read more