Teluguvyasalu

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి.

telugu_calc_app

మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది. మనసుకు అయిష్టాలు చాలానే ఉండవచ్చు.

నచ్చని మాట వినబడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నచ్చనివారు ఎదురుపడిన కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. నచ్చని పని చేయాలంటే, కోపం, అసహనం కలిగే అవకాశాలు ఉంటాయి.

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అసహనం పెరిగే కొలది చిరాకు, కోపం పెరుగుతూ ఉంటాయి. చిరాకు, చికాకు వలన చీటికి, మాటికి కోపం రావడం అలవాటు అయితే, అది ఇతరులపై ప్రదర్శించడం అలవాటు అయి, వారి మనసులో మనపై చికాకు భావన పెంచుకునే అవకాశం మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

దాని పర్యవసానంగా పలు సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. నలుగురిలోనూ “వీడికి కోపం ఎక్కువ” అనే భావన బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

కాని కోపం రాని మనిషి ఉండడు. అయితే కొందరు కోపాన్ని నియంత్రిస్తారు. కొందరు కోపాన్ని ఇతరులపై ప్రదర్శిస్తారు. కోపాన్ని నియంత్రించుకోగలగడం గొప్ప విషయంగా పెద్దలు పరిగణిస్తారు.

తన కోపమే తన శత్రువు అంటారు. అంటే ఎవరికీ కోపం వస్తే, అదే వారి శత్రువుగా మారుతుంది.

ఎందుకంటే ఎప్పుడూ కోపగించే తత్త్వం కలిగిన వ్యక్తితో ఎవరూ ఆప్యాయంగా మాట్లాడలేరు. ఆప్యాయంగా మాట్లాడే మనిషి ఒక్కరు కూడా లేకపోతే, ఒంటరితనం పెరిగి, మనిషి ఒంటరివాడుగా మారతాడు. కష్టసుఖాలు పంచుకోకుండా మనిషి మనసు ఉండలేదు.

ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే అలవాటు ఉంటే, అది చివరికి క్రోధంగా దారి తీసే అవకాశం ఉంటుంది. క్రోధం వలన మనసు విచక్షణ కోల్పోతుంది. అలాంటి సమయాలలో మనసు ఇష్టారీతిలో ప్రవర్తిస్తుంది.

ఇష్టానుసారం మెదిలే మనసుకు అంతులేని ఆలోచన, ఆందోళన, చికాకు ఎక్కువ అవుతాయి.

నచ్చిన విషయాలు మనసుకు ఎదురైనప్పుడు సంతోషించే మనసు, నచ్చని విషయం ఎదురైనప్పుడు మాత్రం అందుకు కారణం అయినవారిని వెతుక్కొని, వారిని తప్పుబడుతుంది.

అలాగే తమకు నచ్చినట్టు ప్రవర్తించే మనిషి అంటే ఇష్టం. తమకు నచ్చనట్టు ప్రవర్తించే మనిషి అంటే కష్టంగా కొందరి మనసు మారుతూ ఉంటుంది. కానీ అలంటే సమయంలో సంయమనం పాటించేవారిని, గొప్పవారిగా పెద్దలు చెబుతారు.

నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనిషికి నచ్చినట్టుగా కాకుండా శాస్త్రం లేక పెద్దలు ఆమోదించిన విధానం ప్రకారం ఉంటే, వారు మార్గదర్శకులుగా మారగలరు. కానీ నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనసును బట్టి ఏర్పరచుకుంటే, అదే అలవాటు కోపానికి కారణం కాగలదు.

తత్కారణంగా అలవాటు కోపంగా మారితే, తన కోపమే తన శత్రువుగా మారుతుంది.

ఆహారం ఒక పద్దతిగా వైద్యులు సుచించినట్టుగా తీసుకుంటే, అనారోగ్యం కూడా నయం అవుతుంది. అలా కాకుండా ఆహారం మనసు కోరినట్టుగా అతిగా ఆరగిస్తే, అదే ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నచ్చని ఆహారం తినవలసి వచ్చినప్పుడు కోపం కలిగే అవకాశం ఉంటుంది.

ఇలా పలు విషయాలలో మనిషికి నచ్చడం, నచ్చకపోవడం ఉంటుంది. కానీ నచ్చిన విషయం అందరికి ఆమోదయోగ్యమైతే, అది మంచి విషయంగా ఉండవచ్చు. నచ్చని విషయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండి, ఒక్కరికే నచ్చకపోతే, సదరు వ్యక్తి తన ఆలోచనను గమనించాలి.

కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి కోపం ఎందుకు వస్తుంది

మనిషి మనసుకు నచ్చడం, నచ్చకపోవడం, వినడం, వినకపోవడం, ఇష్టం, అయిష్టం వంటి వాటి భావనలు బలపడి ఉంటే, అవే కోపానికి కారణం కాగలవు, కీర్తికి కారణం కాగలవు.

ఒకరికి చదువుకోవడం ఇష్టం. అది మంచి, చదువుకునే విషయంలో కాలయాపన జరిగితే కోపం. అది మంచి చేసే కోపం. కానీ అదే కోపం పదే పదే తెచ్చుకుంటే, అది భాధకు కారణం కాగలదు.

మంచి విషయానికైనా, చెడు విషయానికైనా కోపం రావచ్చు. కానీ అది నియంత్రించబడాలి. అప్పుడే అది మనిషికి శాంతిని అందిస్తుంది. లేకపోతే కోపం వచ్చిన వ్యక్తి మనసుతోపాటు, ఇతరుల మనసు మదనపడుతుంది.

కావునా కోపమనేది కేవలం ఒక చెడు విషయాన్నీ ఖండించడానికి ఉపయోగపడాలి… కానీ మనసుకు అలవాటుగా మారకూడదు. అతి సర్వత్రావర్జయేత్ అంటారు.

అంటే అతి అన్నింటా అనర్ధమే అంటారు. కోపం విషయంలో ఇది నిజమని, గుర్తించకపొతే, మనసుకు కోపం చాలా చాలా నష్టాన్నే మిగిలుస్తుంది.

కారణం లేని కోపం చేటు చేస్తుంది. కారణాంతరాల వలన కోపం కలిగినా, దానిని నియంత్రించుకునే అలవాటు నేర్చుకోవాలి.

కోపం వలన కష్టాలు తీరవు కానీ కోపం వలన కొత్త కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ. కావునా కోపం అనే గుణం దుర్గుణంగా మారకుండా, కోపం అనే గుణంపై నియంత్రణ ప్రయత్న పూర్వకంగా సాధించాలి.

సాదారణ స్థితి మనిషికి మరొక మనిషితో సత్సంబంధం ఏర్పరిస్తే, కోపం వలన సత్సంబంధం మద్య బేధభావం ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి కోపం కారణంగా నష్టాలు అధికంగా ఉండవచ్చు.

తెలుగులో వ్యాసాలు

ఎప్పుడూ బ్లాగులు కొత్త విషయాలను పరిచయం చేయడానికి

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.