Teluguvyasalu

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

విద్యాలయ తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణ మొదట్లో మనసుకు కష్టమనిపిస్తుంది. కానీ లక్ష్యం తెలిసిన మనసుకు మంత్రమే. స్కూల్ క్లాస్ రూమ్ లో పాఠాలు వినడానికి వెళ్ళే స్టూడెంట్ కు ముందుగా యూనిఫార్మ్ ఉంటుంది. గ్రహించాలి కానీ అంతా ఒక్కటే అనే భావనా డ్రెస్సింగ్ కోడ్ అందిస్తూ ఉంటుంది. స్కూల్ ఆవరణకు వచ్చేటప్పటికీ మైండులో అటెన్షన్ మొదలౌతుంది. స్కూల్ టీచర్ ను చూడగానే కర్తవ్యం గుర్తుకు వస్తుంది. అప్పజెప్పిన పనిని చూపించే అలవాటు … Read more

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది. నేర్చుకునే ఆసక్తి ఉన్నంత కాలం, మనసు నిత్యం విషయసారం గ్రహిస్తూనే ఉంటుంది. తెలుసుకోవడం విధ్య అయితే, నేను నిరంతరం నిత్య విధ్యార్ధిని అనే భావన, నిరంతరం ఏదో ఒక విషయం తెలుసుకునేలాగా మనసును ప్రేరేపిస్తుంది. నాకు అంతా తెలుసు అనే భావన, అలసత్వానికి నాంది అవుతుంది. రాను రాను తెలుసు అనే భావన తెలిసిన విషయాలను మరిపించే అవకాశం కూడా ఉండవచ్చు. విధ్యార్ధికి విద్యాలయంలో … Read more

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

మనకు అనేక తెలుగు కధలు ఉన్నాయి… అయితే కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే, కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని వ్యాక్యాలలో కధ గురించి…. ఈ తెలుగు వ్యాసంలో కధ అంటే ఎదో ఒక సత్యమైన విషయమును తెలియజేస్తూ, కల్పనతో కూడిన వచనం గాని, వాక్కుగా గాని చెబుతారు. పరిణామం ప్రకారం కధలు చిన్న కధలు, పెద్ద కధలు, నవలలు, ఒక పేజి కధలు… అలా కొన్ని రకాలుగా కధలు ఉంటాయి. కధలు చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి అమ్మ చెప్పే కమ్మనైన కధలు ఉంటాయి. ఇలా … Read more

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ. తెలుగులో వ్యాసం. ఈ కరోన కాలంలో ఎంత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, అంత ఆరోగ్యం ఇంకా అదే పెద్ద సామాజిక సేవ! కరోన దాటికి ప్రపంచ దేశాలు దిగివచ్చాయి. లాక్ డౌన్ విధించాయి. ఆర్ధిక లావాదేవీలు పక్కనబెట్టి ప్రజారోగ్యం గురించి, కరోన కట్టడికి కృషి చేశాయి. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కరోనపై సంపూర్ణ విజయం సాధించాలి. కరోనపై పూర్తిగా విజయం సాధించాలంటే సామాజికంగా … Read more

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో ఈ పోస్టు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మనిషికి మరచిపోవడం ఎంత సహజమో అంతకన్నా ఎక్కువ విషయాలు గుర్తులో ఉంటాయి. ఏదైనా మరిచిపోయే విషయం అతిగా ఉండడం అంటే బాగా వయస్సు అయిపోయాక జరిగేది మాత్రమే… మరిచి పోవడం అనేది చాలా సహజం, అయితే అన్నీ విషయాలు మరిచిపోము. ఎప్పుడో ఏదో ఒక విషయం మరిచిపోతే మనకు పది విషయాలు గుర్తుకు ఉంటాయి. అంటే ఇక్కడ మరిచిపోయినది, గుర్తుకు రాకపోయేసరికి … Read more

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం. క్లాసులో సమాధానం చెప్పాలి. పరీక్షలో పేపరుపై బాగా వ్రాయాలి. అర్ధవంతంగా సమాధానాలు వ్రాయడం ప్రధానం. SSC పరీక్షలు ఫెయిల్ అయితే అంతే, అనే భావన కొందరిలో ఉంటుంది. అటువంటి భావన వలన బాగా చదివేవారు కూడా పదవతరగతికి వచ్చేసరికి వెనుకబడే అవకాశం ఉంటుంది. కనుక పదవతరగతి బాగా చదవాలనే బలమైన సంకల్పం చేసుకోవాలి. అందుకోసం కృషి చేయాలి. ఇష్టపడి చదివితే, చదివే సమయం కష్టం తెలియకుండా ఉంటుంది. సమయం … Read more

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు. ఈ శీర్షికన తెలుగులో వ్యాసం. సాధన చేత లోకంలో పనులు సముకూరును అంటారు. కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడు. సరైన సాధన మనిషికి బలం అవుతుంది. కృషి, పట్టుదల, దీక్ష తదితర గుణాలు మనిషిలో సాధనకు బలం అవుతాయి. మనసులో బలమైన సంకల్పం ఉంటే, ఆ వ్యక్తి యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి మనసుకు మార్గం తెలియబడుతుందని పెద్దలంటారు. మంచి ఆశయం అంటే అది సమాజనికి మేలును చేకూర్చే … Read more