Teluguvyasalu

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు. వాక్కు అంటే మాట అంటారు. వాక్కు చాలా విలువైనది. మాటలే కదా అని మాట్లాడేస్తే, ఆ మాటలు వింటున్నవారు ప్రభావితం అవుతారు. వాక్ + దానం = వాగ్దానం అంటారు. అంటే మాట వలన ఒక వ్యక్తి సాయం పొందగలడు. ఒక నాయకుడు వాక్కు వలన, ఆ ప్రాంతం ప్రభావితం అవుతుంది. కాబట్టి వాక్కు చాలా చాలా విలువను పెంచుతుంది. అదే వాక్కులో తేడా ఉంటే, వాక్కు వలననే విలువను తగ్గుతుంది.

telugu_calc_app

అటువంటి వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎందుకు అంటారు?

బంగారు నగలు ధరించడం వలన మనిషికి హంగు వస్తుంది. మేకప్ వేసుకోవడం మనిషి అందానికి మెరుగులు దిద్దుకోవడం అవుతుంది. వస్తువులతో శరీరమునకు చేసుకునే అలంకారం, కేవలం ఆకర్షణీయంగా కనబడడానికే ఉపయోగపడతాయి. అసలైన ఆభరణం అవి కావు. మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి, అతని యొక్క సంస్కారవంతమైన మాటలు. అటువంటి వాక్కులు మనిషికి నిజమైన అలంకారం అని చెబుతారు.

మాటతీరు నచ్చితే, మనతో మాట్లాడేవారు పెరుగుతారు. మాటతీరు నచ్చకపోతే, మనతో మాట్లాడేవారు తక్కువగా ఉంటారు. సమాజంలో వ్యక్తికి గుర్తింపు పెరగడంలో, అతని ప్రతిభతో బాటు మాటతీరు బాగుంటే, అతనికి కీర్తి మరింతగా పెరుగుతుంది. అంటే వాక్కు మనిషికి సహజంగానే అలంకారమై, అతని కీర్తిని మరింతగా పెంచుతుంది.

మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏవి, అతని వాక్కులే అంటారు.

వాక్కు వలన మనసులోని భావము ఎదుటివ్యక్తి అర్ధం అవుతుంది. ఎటువంటి భావన మనసులో ఉంటుందో, దానికనుగుణంగా మనిషి వాక్కు ఉంటుంది. వాక్కులతో మనసులోని భావన ప్రస్పుటం అవుతుంది. కాబట్టి మంచి మాటలు మాట్లాడే వ్యక్తికి, అతని మాటలే భూషణములుగా మారతాయి. మంచిమాటలు మాట్లాడే మాటలే నిజమైన అందాన్నిస్తాయి. ఇతరుల మనసులో శాంతి భావనను పెంచగలగడమే వాక్కు యొక్క గొప్పతనం.

సహజంగా మాట్లాడే మాటలతో ఎదుటివారి మనసును నొప్పించకుండా మాట్లాడగలగడమే, మనిషికి నిజమైన అలంకారమని అంటారు.

తెలుగు వ్యాసాలు పోస్టులు

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ