Teluguvyasalu

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి. అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్టులుంటాయి… కొందరికి అటువంటి ఆస్తి ఉండదు… కానీ పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడుతూ ఉంటారు… కొందరు జీవితం గురించి కలలు కంటారు. కానీ కాలంలో తాము కన్న కలలు నెరవేరవని తెలుసుకుని వాటిని విరమించుకుంటారు. … Read more

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు. ఈ వ్యాక్యం ఆధారంగా ఒక వ్యాసం వ్రాయాలంటే, మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనకో అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులలో, ఆ పరిస్థితులను ప్రభావితం చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలిసి ఉండాలి. ఇంకా ఎవరెవరు ఎటువంటి ప్రభావం చూపుతున్నారో తెలియబడి ఉండాలి. ఇలా మన చుట్టూ ఉన్న స్థితి మనకు అవగాహన ఉంటే, మన చుట్టూ మనకో మార్గదర్శకుడు కనబడతారు. ఒక వ్యక్తి చుట్టూ ఒక … Read more

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సమయానికి శ్రద్దతో ఆహారం స్వీకరించేవారు శక్తివంతులుగా ఉంటారు. సమయానికి ఒత్తిడి కారణంగా ఆహారం స్వీకరించక ఉండేవారు బలహీనతను కొని తెచ్చుకుంటారు. జీవనశైలి వలన వచ్చు వ్యాధులు, వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకునేవారి జీవనశైలితో వారు సంతోషంగా ఉండగలరు. ఒత్తిడికి తలొగ్గి కనీస సమయపాలన కూడా పాటించిన జీవనశైలి గలవారు అనారోగ్యవంతులు అవుతారని అంటారు. అంటే ఎవరి ఆరోగ్యం వారి … Read more

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకోవడానికి చాలా రకాల అంశములలో వివిధ విషయములు ఉంటాయి. అయితే తెలిసి ఉన్న రంగంలో మనకు బాగా తెలిసిన విషయంలో అయితే వ్యాసం బాగా వ్రాయగలుగుతాం. కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశం ఎంచుకోవడంలో బాగా తెలిసిన అంశమునే ఎంచుకోవాలి. విద్యార్ధులకు అయితే ప్రశ్నాపత్రములో ముందుగానే అంశము చెప్పి, దానిపై మీ సొంత వ్యాక్యాలలో వ్యాసం వ్రాయమని ప్రశ్నరూపంలో అడుగుతారు. ప్రశ్నాపత్రములో పాఠ్యాంశము నుండి కానీ లేదా సామాజిక అంశము నుండి … Read more

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువు గురించి చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఆ బంధం అట్టేకాలం కొనసాగదు. సహచరుల విషయంలో చెడు … Read more

చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం

పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు… పాఠశాలలు ప్రత్యేకించి క్రమపద్దతిలో పాఠ్యాంశాలు బోధించడానికి ఉంటే, స్మార్ట్ ఇష్టానుసారం విషయ సంగ్రహణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్మార్ట్ ఫోన్ తగదని అంటారు. కానీ కొన్ని పరిస్థితులలో హోమ్ వర్క్ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే… ఎంతవరకు దానిని వాడుకోవాలి? కొందరు విద్యార్ధులు పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సెర్చ్ చేయడం చేస్తూ ఉంటారు. కూడికలు చేయడానికి … Read more

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి వంటిది అంటారు. మనిషి ఒక వనరుగా ఉంటే, మానవ వనరు అంటే, ఒక సంస్థకు పనిచేసే మనుషులను మానవ వనరులు అంటే, ఒక సంస్థలో నియమితులైన సిబ్బందినే హ్యుమన్ రిసోర్సెస్ అంటారు. సంస్థకు ఉండే … Read more

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో అంటే చాలా సులభం అంటారు. వ్యాసం రాయడం ద్వారా ఒక విషయం గురించి సవివరంగా తెలియజేయవచ్చు. ఒక వస్తువు వాడుక విధానం వ్యాస రూపంలో అందించవచ్చు. ఒక సేవ యొక్క లక్ష్యం వ్యాసం ద్వారా తెలియజేయవచ్చు. ఇలా వ్యాసం రాయడం ద్వారా కూడా డబ్బు సంపాదన చేయవచ్చు. ఇంకా ఇతర భాషలలో కూడా వ్యాసం (ఆర్టికల్) వ్రాయగలిగితే మరింత ఆదాయం గడించవచ్చు. నేటి రోజులలో అనేక విషయాల గురించి ప్రచారం అవసరం అవుతుంది. ఒక కొత్త వస్తువు వస్తే, దాని వాడుక విధానం తెలిపే వ్యాసాలు అవసరం అవుతాయి. ఒక కొత్త సినిమా విడుదల అయితే ఆ సినిమా గురించి విశ్లేషణను కూడా ఒక వ్యాసం ద్వారా వివరించవచ్చు. రాజకీయ నాయకుడి గుణగణాలు, వారి సేవానిరతి గురించి ప్రజలకు తెలియడానికి కూడా వ్యాసం ఉపయోగపడుతుంది. సేవా సంస్థల గురించి, వాటి కార్యకలాపాల గురించి విపులంగా తెలియజేయడానికి వ్యాసం అవసరం అవుతుంది. సామజిక సమస్యల గురించి వ్యాసాల ద్వారా ప్రజలలో ప్రచారం కల్పించవచ్చు. ప్రజలలో సామజిక స్పృహ పెరిగేలా వ్యాసాల ద్వారా ప్రజలలో అవగాహనా తీసుకురావచ్చు… సామజిక అసమానతలు ఉంటె, వాటిపై విశ్లేషణలతో వ్యాసం ద్వారా వివరించవచ్చు.. ఇలా వ్యాసాలు వివిధ అంశాలలో వివిధ రంగాలలో వివిధ విషయాల గురించి విశ్లేషిస్తూ అర్ధవంతంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయి… అలా అర్ధవంతమైన వ్యాస రచన చేయగలిగినవారికి ఆర్ధిక సంపాదన కూడా ఉంటుంది. ఎలా వ్యాసాలు ద్వారా డబ్బు సంపాదన ప్రసిద్ది చెందిన వార్త పత్రికలకు కధనాలు వ్రాస్తూ సంపాదించవచ్చు. టీవీ చానల్స్ లో కధనాలు వ్రాయవచ్చు. ఏదైనా ప్రసిద్ది చెందిన వెబ్ సైట్ కు వ్యాసాలు రాస్తూ డబ్బు సంపాదించవచ్చు. లేదా మీకు మీరే ఒక బ్లాగు సృష్టించుకుని అందులో వ్యాసాలు వ్రాస్తూ ఉండవచ్చు… ఇలా వ్యాసం రాయడం బాగా వస్తే, మంచి మంచి వ్యాసాలు వ్రాస్తూ కీర్తి గడించవచ్చు. అయితే ఇలాంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు వాస్తవికతకు దూరంగా కల్పన ఉండకూడదు. వాస్తవికతను ప్రస్తావిస్తూ ఊహాత్మక విశ్లేషణ వ్యాసంలో అవసరం అంటారు. పుస్తకాలూ చదివే సమయంలోనే మనసుకు ఊహాశక్తి అలవరుతుంది. ఊహాశక్తికి అక్షరరూపం ఇస్తూ అది అర్ధవంతంగా చెప్పగలిగితే అది వ్యాసం అవుతుందని అంటారు. అయితే అది విపులంగా విశ్లేషణతో ఉండాలి. ఇంకా కల్పిత కదల బ్లాగు సృష్టించుకుని చక్కటి కధలు ఆకట్టుకునే విధంగా వ్రాయగలిగితే, అటువంటి బ్లాగు కూడా సంపదను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అనుకరణ వ్యాసం కన్నా అలోచించి విషయాన్నీ సరిగ్గా విశ్లేషించగలగాలి. డబ్బు సంపాదన మార్గాలు … Read more

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి? అధిక్షేపం ఆక్షేపించడం అంటారు. అంటే ఒక విషయంలో ఉన్న లోపామును అర్ధవంతంగా వివరణగా విశదీకరించడం అంటారు. పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మేధావులకు ఆ చట్టాలు లోపభూయిష్టంగా అనిపిస్తే, వాటిపై ఆక్షేపణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చట్టం యొక్క ఉద్దేశం, ఆ చట్టం యొక్క ప్రభావం, ఆ చట్టం అమలు అయితే వచ్చే దుష్ఫలితలను తెలియజేస్తూ విశ్లేషణలు వ్యక్తం చేస్తూ … Read more

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ, పరోక్షంగా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది. పరిశుభ్రత మనిషి ఆరోగ్య సూత్రాలలో ప్రధానమైనది. మనిషి తన వంటికి పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే తన నివాసం పరిశుభ్రతగా ఉంటుంది. తను ఆరోగ్యంగా ఉండడం తన ప్రధాన అవసరం అయితే, తన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం సామజిక అవసరం. తన గురించి తన చుట్టూ ఉండే … Read more