Teluguvyasalu

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు.

telugu_calc_app

వ్యాసం ఉద్దేశం అంటే విషయం గురించి వివరణ చేయుట. ఆ విషయం ఏదైనా సంఘటన గురించి కావచ్చు. ఏదైనా సమస్య గురించి కావచ్చు. ఎవరైనా గొప్ప వ్యక్తి గురించి కావచ్చు. ఇంకా ఏదైనా చారిత్రక విషయం కావచ్చును. ఏదైనా ఒక శాస్త్రీయ పద్దతి గురించి కావచ్చును. ఏదైనా సరే ఒక విషయం గురించి ఆసక్తిని కలిగిస్తూ, విషయంలోని సారమును తెలియజేసే విధంగా వ్యాసము ఉంటుందని అంటారు. తెలుగులో విషయాల గురించి తెలిపే తెలుగు వ్యాసాలు బ్లాగుల ద్వారా చదవగలం.

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే విషయ విశ్లేషణ

ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. వ్యాసం ఒక అవగాహన కల్పించడంలో టీచర్ వలె ఉంటుంది.

తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ వ్యాసం వ్రాయమంటారు. అంటే వ్యాసం ఒక వస్తువు లేదా విషయం లేదా ప్రాంతం లేదా ఒక విధానం లేదా చరిత్ర ఏదైనా గొప్పతనం గురించి చక్కగా వివరించగలదు.

వ్యాసం వలన వ్యక్తికి విషయంలోని సారం తెలియబడుతుంది. సారాంశం కూడి అర్ధవంతమైన సమాచారం అందించే వ్యాసం ఏదో ఒక సామాజిక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని వ్రాయబడతాయి. అటువంటే వ్యాసాల వలన సామాజిక అవగాహన పెరుగుతుంది.

ఆ ఒక విషయమును విపులంగా వివరణతో విశ్లేషించబడి ఉంటుంది. వ్యాసం నందు మొదటిగా విషయము శీర్షిక ఉంటుంది. ఆపై ఉపోద్గాతము ఉంటుంది.

ఉపోద్గాతము తర్వాత వ్యాసంలో విషయమును గురించి వివరాలతో వివరిస్తూ సాగుతుంది. విషయము యొక్క విశిష్టత, విషయము యొక్క ఆవశ్యకత, విషయము యొక్క ప్రభావం, విషయము యొక్క లాభ నష్టాలు తదితర అంశముల వారీ విషయ విశ్లేషణ వ్యాసంలో వ్రాయబడి ఉంటుంది.

ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ గురించి వ్యాసం వ్రాయాలంటే… ముందుగా స్మార్ట్ ఫోన్ ఎవరు కనిపెట్టారు. ? ఎప్పుడు కనిపెట్టారు? ఎవరు డవలప్ చేశారు? అందులో పనిచేసే సాఫ్ట్ వేర్? వంటివి వ్రాయాలి.

విషయము యొక్క విశిష్టత: అంటే మొబైల్ ఉంది. దాని ప్రధాన ప్రయోజనం దానియందు విశిష్టమైనదిగా ఉంటుంది. ఒక సాదారణ కంప్యూటర్ ద్వారా నిర్వహించే పనులు స్మార్ట్ ఫోను ద్వారా కూడా చేయవచ్చును. ఈరోజులలో స్మార్ట్ ఫోనులు మల్టి టాస్కింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలా ఏదైనా వస్తువు యొక్క విశిష్టతను వివరించడం వ్యాసంలో ఉంటుంది.

ఆవశ్యకత: అంటే ఒక విషయము యొక్క ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో ఎంతవరకు ఉంది? అనే విషయం చెప్పడాన్ని ఆవశ్యకత అంటారు. అలా ఒక మొబైల్ ఫోన్ ఆవశ్యకత గురించి తెలియజేయాలంటే… స్మార్ట్ ఫోను ద్వారా ఆన్ లైన్ చెల్లింపు చేసేయవచ్చును. స్మార్ట్ ఫోను ద్వారా షాపింగ్ చేయవచ్చును. స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యనభ్యసించవచ్చును… నేడు స్మార్ట్ ఫోను మనిషి జీవితంలో ఒక బాగమై ఉంది. కావునా మొబైల్ ఫోన్ నేటి రోజులలో అందరికీ అవసరమే అవుతుంది.

ప్రభావం: ఒక విషయము ప్రస్తుత పరిస్థితలలో ఎలాంటి ప్రభావం సమాజం మీద చూపుతుంది? ఆ విషయము వలన సమాజంపై భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రభావం చూపవచ్చును..? ఇలాంటి ప్రశ్నలతో విషయ ప్రభావం ఎలా ఉంటుందో వివరించడం… ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే, అది వ్యక్తి జీవితంలో భాగమై ఉంది. ఎక్కడికి వెళ్ళినా వెంట స్మార్ట్ ఫోన్ ఉండాలి.

స్మార్ట్ ఫోను వలన అనే ఆన్ లైన్ లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చును. అయితే స్మార్ట్ ఫోనులో అంతర్జాలం ద్వారా వచ్చే అనేక మంచి చెడు విషయాలను చూపుతుంది. కాబట్టి యువత చెడువైపు ఆకర్షితమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. భవిష్యత్తులో అనేక మార్పులు సమాజంలో మొబైల్ ఫోను ద్వారా జరగవచ్చును… ఇలా ప్రభావం గురించి వివరించడం.. ఇంకా వివరంగా వ్యాసంలో వివరించవచ్చును.

లాభనష్టాలు: ఒక విషయముల వలన సమాజానికి ఒనగూరే పూర్తి ప్రయోజనాలు, పూర్తి నష్టాలు పాయింట్ల వారీ తెలియజేయడం.

  • మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చెల్లించవచ్చును
  • స్మార్ట్ ఫోను ద్వారా ఎవరైనా ఎక్కడినుండైనా ఎక్కడివారితోనైనా కమ్యూనికేట్ చేయవచ్చును.
  • ఇమెయిల్ సందేశాలు, మల్టీమీడియా సందేశాలు క్షణాలలో పంపించవచ్చును.
  • సృజనాత్మకతను బట్టి స్మార్ట్ ఫోను ద్వారా కూడా సంపాధన చేయవచ్చును.
  • ఏవైనా విషయాలు శోదించడానికి స్మార్ట్ ఫోను చాలా ఉపయోగం.

    నష్టాలు
  • స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగే కొలది,మనిషికి మనిషికి గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది.
  • రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది.
  • టచ్ స్క్రీనుపై అనేక క్రిములు ఉంటాయి.
  • యువతకు స్మార్ట్ ఫోన్ గేమింగ్ వంటివి వ్యసనంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
  • ఎక్కువగా స్మార్ట్ ఫోనులో వీడియోలు చూడడం వలన కళ్ళపై ప్రభావం పడుతుంది.

ఇలా ఇక విషయమును గురించిన లాభనష్టాలు వ్యాసంలో చూపాలి. అవి సమాజంపై ఏవిధంగా ప్రభావం చూపుతూ మనిషిని ప్రభావితం చేస్తున్నాయి….

వ్యాసం ముఖ్యంగా ఒక విషయం గురించిన సమాచారం అందిస్తుంది. ఒక ఉపన్యాసము అక్షరరూపంలో మారితే వ్యాసం, అది వ్యాసము అవుతుంది.

ఉపన్యాసంలో కూడా విషయమను సమగ్రంగా విశ్లేషిస్తారు. అలాగే వ్యాసంలో కూడా ఒక విషయమును సమగ్రమంగా విశ్లేషిస్తారు.

వివిధ విషయాల గురించి తెలిపే తెలుగు వ్యాసాలు, వ్యాసం అంటే ఏమిటి?

ఒక సమాజంలో వివిధ విషయాలలో అనేక విధి విధానాలు ఉంటాయి. వివిధ వస్తువు వివిధ రకాల వస్తువులతో తయారు అవుతాయి. వివిధ వ్యవస్థలు వివిధ రకాల పనులను నిర్వహిస్తూ ఉంటాయి. వివిధ రకాల పని విధానాలు ఉంటాయి. అందరికీ అన్ని తెలియకపోవచ్చును. కావునా ఇలాంటి విషయాలను వివరించే ప్రయత్నం కొందరు చేయవచ్చును. అలాంటి పత్రికలలో అచ్చు అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే బ్లాగు పోస్టులలో వ్యాసాలు అనేక విషయాలను వివరిస్తూ ఉంటాయి.

ఒకరికి ఒక వస్తువు వాడుక గురించి బాగుగా తెలుసు, ఆ వస్తువు వాడుక విధానం చాలామందికి తెలియకపోవచ్చును అని అతను భావిస్తే, దాని వాడుక విధానం గురించి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా అతను ఆ వస్తువు వాడుక విధానాన్ని వ్యాసరూపంలో మార్చవచ్చును.

ఒక వ్యవస్థ చర్యలు భవిష్యత్తులో సమాజానికి భారం అని ఎవరికైనా అనిపిస్తే, అతను ఆ వ్యవస్థ యొక్క చర్యలు, ఆ చర్యల వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు, తీవ్రత తదితర అంశాలు ఆధారంగా సామాజిక శ్రేయస్సు కొరకు వ్యాస రచనకు పూనుకోవచ్చును.

ఇలా ఎక్కువగా తెలుగు వ్యాసాలు సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ వ్రాయబడి ఉంటాయి.

ఇంకా వివిధ సంస్కృతులు గురించి,

ప్రాంతాల సంప్రదాయాల గురించి,

గొప్ప గొప్ప వ్యక్తుల గురించి,

సమాజంపై తీవ్ర ప్రభావం చూపని సంఘటనల గురించి,

సమాజానికి తీవ్ర నష్టం జరిగిన సంఘటనల గురించి,

తెలుగు వ్యాసాలు ఇంకా చదవడానికి ఈ క్రింది లింకులు క్లిక్ చేయండి.

తెలుగు వ్యాసములలో మరిన్ని తెలుగు వ్యాసముల గురించి రీడ్ చేయడానికి ఈ అక్షరాలను టచ్ చేయండి.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో