Teluguvyasalu

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును…. వంటి విషయాలు తెలుసుకోగలుగుతాము. పదవ తరగతి పూర్తయ్యాక ఆలోచన చేద్దామనే భావన ఉంటే, అది కాలం వృధా కావడానికి కారణం కావచ్చును. హైస్కూల్ చదువుతుండగానే ప్రతి విద్యార్ధికి, తన బలమేమిటో తనకు తెలియవస్తుంది. ఆ బలంతోనే … Read more

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు పెద్దలు చెప్పిన మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు నుండి కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పడం మేలు. మార్గదర్శకంగా నిలిచిన మహనీయులంతా తల్లిదండ్రుల నుండి కానీ గురువుల నుండి కానీ మంచి మాటలు విన్నవారేనని … Read more

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు చూస్తే, కాలం కర్మ వెంటాడినా, వద్దని వారించినా, శ్రీరాముడి పట్టుదలే ప్రధాన కారణంగా కనబడుతుంది. శ్రీరామదృష్టి కోణం ధర్మమునే చూడడం వలన శ్రీరాముడు, ధర్మము ప్రకారం శ్రీరాముడు వనవాసం చేయడానికి సిద్దపడ్డాడనే భావిస్తారు. అయోధ్యాధీశుడైన దశరధ మహారాజు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని సభలో సభికులతో చెబుతారు. సభలో అందరూ హర్షిస్తారు. శ్రీరామ పట్టాభిషేకానికి ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుసుకున్న దశరధుడు, శ్రీరాముడిని పిలుపించుకుంటాడు. పట్టాభిషేక విషయం శ్రీరాముడితో దశరధుడు స్వయంగా … Read more

మంధర పాత్ర స్వభావం చూస్తే

శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా ఉంటుంది… మంధర మాటలు వినడానికి వినసొంపుగా అనిపిస్తే, అటువంటి మాటలు వ్యక్తిని చులకన చేస్తాయి… కైకేయి విషయంలో … Read more

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని విషయాలలో తస్మాత్ జాగ్రత్తగా పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటారు. వాటిని వినడం వలన వ్యక్తి జీవితంలో ఎలా ప్రవర్తించాలో? ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుంటాడని పెద్దలు అంటారు. ముఖ్యంగా అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం వంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త అంటారు. అర్ధనాశం: అర్ధము అంటే సంపాదించినది… అది ధనము కానీ దాన్యము కానీ వస్తువు కానీ ఏదైనా అర్ధముగా మారుతుంది. మన అవసరాలకు తీరడానికి ఉపయోగపడేది … Read more

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి… మంచి పుస్తకాలు కూడా చదవాలి. మంచిని తెలియజేసే మంచి తెలుగు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఇంకా సామాజిక అవగాహన కల్పించే వారపత్రికలు, వార్తాపత్రికలు కూడా చదవాలి… పిల్లలకు చదవడం బిగ్గరగా చదవడంతో అనర్ఘలంగా చదివే శక్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న మనసు తన ఆసక్తి నెరవేర్చుకోవడం బహు శ్రద్ద చూపుతుంది. అంటే… ఆసక్తి అంటే ఏమిటి? సినిమా … Read more

వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో

నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో…. వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి అనగానే వరకట్నం ఎంత? వరకట్నం కోసం కూడబెట్టిన డబ్బు లేకపోతే, ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలు వర్ణానీతతం…. … Read more

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం వరకే… అయితే మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి? మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ ఎలా ఉండాలి? పైన చెప్పినట్టుగా మూగ జీవులు అంటేనే మాట్లాడలేవు. వాటికి బాధ కలిగితే, మూలుగుతూ బాధపడతాయి. సంతోషం … Read more

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి. ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం. పిల్లలకు చక్కని నీతి కధలు బోధించడం. పిల్లలకు మంచి మాటలు చెప్పడం. పిల్లలకు గొప్పవారి గురించి చెబుతూ, వారి మనసులో గొప్పవారు కావాలనే కాంక్షను పుట్టించడం.. ఇలా ఇంటిలో ఇల్లాలు … Read more

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ప్రజలు ఆర్ధిక వనరుల బాగా ఉన్నచోట, నివాసానికి అనువుగా ఉన్నచోట, సౌకర్యాలు లభించే ప్రాంతాలలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు… బహుశా నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు ఇంకా ఇలా ఉండవచ్చును. ప్రధానంగా నగరములలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. విశ్వవిద్యాలయములు నగరములలోనే ఉంటాయి. స్వయం ఉపాధి అవకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరమైన సేవలు నగరములలో ఎక్కువగా లభిస్తాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నగరములలో ఎక్కువ. నగరములలో వ్యాపార, వాణిజ్యములు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి … Read more