Teluguvyasalu

జీవితంలో నా లక్ష్యం గురించి

మనిషి జీవితంలో నా లక్ష్యం గురించి ఒక వ్యాసం వ్రాయడానికి… మనకు లక్ష్యం ఖచ్చితంగా మనం ఏర్పరచుకున్నదో లేక పెద్దలు చెప్పగా విని మనం ఏర్పరచుకోవడమో… ఏదో ఒక విధంగా లక్ష్యం ఏర్పడుతుంది.

telugu_calc_app

అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అది ఆర్ధికంగా బాగా ఎదగాలి అని కొందరికి ఉంటే, మంచి ఉద్యోగం సంపాదించాలి. మంచి స్థాయిగల ఉద్యోగం పొందాలి. క్రీడలలో అగ్రస్థానం సంపాదించాలి… ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో ప్రతివారికీ లక్ష్యం ఉంటుంది.

కానీ లక్ష్యం గురించి వ్యాసం వ్రాయడానికి ఆలోచించాలంటే… ముందుగా ప్రతివారు కూడా పెద్దలు నుండి కొన్ని మాటలు విని ఉంటారు. అలా విన్న మాటలు మనం ఇలా ప్రస్తావిస్తూ వ్యాసం వ్రాయడానికి ప్రయత్నించవచ్చును. ఈ క్రింది విధంగా పెద్దల మాటల ప్రకారం సాదారణ జీవితంలో లక్ష్యం ఎలా ఏర్పడుతుందో… వ్యాసం వ్రాయడానికి…

జీవితంలో నా లక్ష్యం ఏర్పడడానికి పెద్దల మాటల ప్రభావం

లక్ష్యం లేని జీవితం నిరర్ధకం” అంటూ పెద్దలు పలుమార్లు ప్రస్తావించడం నేను విన్నాను. ముఖ్యంగా మనిషిగా జన్మించడం ఒక వరం అయితే, దాని సార్ధకతకు సరైన లక్ష్యం లేకపోవడం దురదృష్టకరం… అంటూ పెద్దలు పలికే పలుకులు నా మనసులో మెదులుతూనే ఉంటాయి.

అలాంటి పెద్దల మాటలు నన్ను ఆలోచింపచేశాయి. దాంతో చిన్ననాడే నా జీవితంలో నాకొక లక్ష్యం ఉండాలి, అని నిర్ణయించుకున్నాను. అయితే అసాధ్యమైన లక్ష్యం ఏర్పరచుకుని సాధించలేకపోవడం వలన నైరాశ్యం ఏర్పడుతుందనే మాటలు మరలా నన్ను ఆలోచింపజేశాయి.

అవును నేను ఉన్న స్థితిలో నా కుటుంబ స్తోమతను బట్టి సాద్యాసాద్యాలు అంచనా వేసుకోకుండా అసాధ్యమైన భారీ లక్ష్యం ఏర్పరచుకోవడం జీవితానికి అంత మంచిది కాదు. అది సాధించలేకపోయినప్పుడు కలిగే నిరాశ, నిస్పృహల వలన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి… కాబట్టి నా లక్ష్యం నా ఆర్ధిక స్థితిని బట్టి, నాకు లభించే వనరులను బట్టి ఎంచుకోవాలనే తలంపు పెద్దల మాటల వలన కలిగింది.

ఎందుకంటే వారు అనుభవంతో జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటివారి మాటలు మనం మన లక్ష్యం ఎంచుకోవడం ఉపయోగపడతాయని నాకు నా జీవితంలో లక్ష్యం ఎంచుకునే ప్రక్రియలో తెలియబడింది.

ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. క్లాసులో మంచి మార్కులు సాధించే మొదటి పదిమందిలో నేనూ ఒకడిని. కావునా నేను మరింత కృషి చేయడం ద్వారా ప్రధాన పోటీ పరీక్షలలో ప్రధమ స్థానం చేరుకోగలను.

నా జీవితంలో ప్రధమ లక్ష్యం మంచి మార్కులతో నా చదువును పూర్తి చేయడం. ఆ తర్వాత పోటీ పరీక్షలలో సరైన ఫలితం సాధించి, మంచి ఉన్నత స్థానానికి చేరడం… ఆర్ధికపరమైన నా రెండవ లక్ష్యం.

నన్ను పెంచి పోషిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ చేదోడు వాదోడుగా ఉండడంలో వెనుకాడకుండా ఉండాలి. నన్ను నమ్మి నా జీవితంలోకి ప్రవేశించబోయే, నా జీవిత భాగస్వామితో కలిసి ధర్మాచరణలో నాకర్తవ్యం నేను నిర్వహిస్తూ ఉండడం నా ప్రధాన జీవిత లక్ష్యం…

ఆర్ధిక సంపాదన ధర్మబద్దంగా ఉండడమే నిజమైన సంపాదన అని పెద్దలు చెబుతూ ఉంటారు. కావునా నేను సంపాదించే ప్రతి రూపాయి నా కష్టార్జితమే ఉండాలని భావిస్తాను.

జీవితంలో నా లక్ష్యం ఐఏఎస్ అయితే వ్యాసం

నా జీవితంలో నాకు ఐఏఎస్ అధికారి కావాలనే ఆశయం ఎలా ఏర్పడిందో… వివరిస్తాను. నేను పుట్టినది మద్యతరగతి కుటుంబం. కానీ నేను బాగా చదవాలని, మానాన్నగారు నాతో చెబుతూ ఉండేవారు.

అయితే నేను పదవతరగతి చదువుతున్న సమయంలో, ఒకరోజు మానాన్నగారు పిలిచి నాతో మాట్లాడారు…

”ఓరేయ్… కృష్ణా… నేను మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నించి, దానిని సాధించలేకపోయాను….అప్పుడు నేను నిశ్చయించుకున్నాను… నాకొడుకుని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగిని చేయాలని… ఇప్పుడు నీవు చదువుతున్నది పదవతరగతి… ఈ తరగతిలో నీకు వచ్చిన మార్కులు నీ చదువుకు పునాదిగా మారతాయి… నీవు బాగా చదువుకుంటే, నీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవసరమైన చదువు లేదా అంతకన్నా ఎక్కువ చదువు అయినా సరే… నేను నిన్ను చదివిస్తాను… మంచి మార్కులు తెచ్చుకో… ” అని నాతో మాట్లాడిన మానాన్నగారి మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి.

మానాన్నగారు బాగా చదువుకునేవారని మాతాతగారు చెబుతూ ఉండేవారు. కానీ మానాన్నగారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేకపోవడానికి ఏదో ఆర్ధికపరమైన అడ్డంకి కావచ్చును… అటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ఉద్యోగం సంపాదించాలంటే మంచి ప్రతిభ ఆధారంగా వచ్చే ఉద్యోగాలకు ప్రయత్నించాలి… మంచి హోదా కలిగిన ఉద్యోగం సంపాదించాలి… అని నిశ్చయించుకున్న… నాకు మా టీచర్ గారి మాటలు నా లక్ష్యం ఏది కావాలో నాకు సూచించాయి.

”చూడండి… జీవితంలో పొజిషన్ చాలా ఇంపార్టెంట్… మనం ఎటువంటి పొజిషన్ కు వెళ్ళాలని ఎంత బలంగా భావిస్తామో, మనం జీవితం కూడా ఆ పొజిషన్ వైపుకు పరుగులు పెడుతుంది. పొజిషన్ అంటే… పని చేయడం, పని చేయించడం, పని చేయించేవారిని కూడా నియంత్రించే అధికారం కలిగి ఉండడం… ఇలా రకరకాలుగా హోదాలు ఏర్పడుతూ ఉంటాయి. పని చేయడానికి పని తెలిసి ఉంటే, చాలు ఎవరో ఒకరి వద్ద పనికి కుదురుకోవచ్చును… కానీ పని చేయించాలి అంటే విధి విధానాలు తెలిసి ఉండాలి…. ఆయా రంగాలలో నైపుణ్యతను సాధించాలి… అందుకు అవసరమైన విద్యను అభ్యసించాలి… ఇంకా వివిధ రంగాలలో పనిని చేయించే అధికారులను సైతం నియంత్రించే ఒక ప్రాంతం మొత్తానికి శాసనాధికారిగా మారాలంటే, గ్రూప్ 1 వంటి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి… మన లక్ష్యం, మన పట్టుదల, మన సాధన మన జీవితాన్ని శాసిస్తాయి… నిర్ణయించుకోండి… భవిష్యత్తులో ఎటువంటి జీవితం కావాలనుకుంటున్నారో….” ఈ మాటలతో నాకు బలమైన నిశ్చయమే కలిగింది… అదే ఐఏఎస్ అధికారి కావాలనే కాంక్ష మొదలైంది…

జీవితపు లక్ష్యంపై మన జీవితంలో మన చుట్టూ ఉండేవారి ప్రభావం ఉండవచ్చు

జీవితంలో నా లక్ష్యం గురించి నాకు ఒక అవగాహన ఉంది. దానికి ప్రతిపాదిక ఫలానా సమయంలో ఫలానావారి మాటలు నా ఆలోచనలకు ఊతం ఇచ్చాయి… అంటూ కొందరు నిర్ధేశించుకున్న తమ జీవిత లక్ష్యం గురించి మాట్లాడుతూ ఉంటారు.

అంటే ప్రతి వ్యక్తి జీవితంలోనూ… తమ చుట్టూ ఉండేవారి ఆలోచనలు వలన కానీ బలమైన సంఘటనల వలన కానీ లక్ష్యం ఏర్పడవచ్చును… జీవితంలో ఏ లక్ష్యము లేకుండా తిరిగేవారిలో కూడా ఎవరో ఒకరి ప్రభావం వలన వారికి లక్ష్యం ఏర్పవచ్చును.

సహజంగానే లక్ష్యం లేకుండా జీవితం ఉండదు… అలా ఉందంటే ఆ జీవితం నిరర్ధకం అంటూ పెద్దలు సంబోదిస్తూ ఉంటారు.

ఒకరి లక్ష్యం మరొకరికి ప్రయోజనం అవుతుంది… ఒకర ఐఏఎస్ అధికారి అయితే, అతను పుట్టిన ప్రాంతంలోని వారికి సంతోషం… ఇంకా తను పుట్టి పెరిగిన ప్రాంతానికి బదిలీ అయి వస్తే, అక్కడ తన అధికారంతో తన ప్రాంతానికి శ్రేయష్కరమైన పనులు చేయవచ్చును… ఇలా జీవితానికో మంచి లక్ష్యం ఉండడం అంటే… అతనిపై ఆధారపడినవారికి ఇంకా తను పుట్టి పెరిగిన ప్రాంతానికి కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది… కాబట్టి వ్యక్తి జీవితానికో లక్ష్యం లేదా సదాశయం కలిగి ఉండాలని అంటారు.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

Telugulo Vyasalu

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

తెలుగులో వివిధ విషయాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

బమ్మెర పోతన గురించి రాయండి

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

తెలుగువ్యాసాలు TeluguVyasalu

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పావురం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

పండుగ అంటే ఏమిటి వివరించండి?

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

TeluguVyasalu Read Cheyadaniki

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

విద్యార్థులకు మంచి మాటలు తెలుగులో నీతి సూక్తులు

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

పేదలకు దానం చేయటంవల్ల మనం

మంధర పాత్ర స్వభావం చూస్తే

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి